విశాఖపట్నం పోర్టు అథారిటీ (VPA) మరో అరుదైన ఘనత సాధించింది.. స్వచ్ఛత పఖ్వాడా అవార్డ్స్ 2024లో భారతదేశంలోనే మొదటి స్ధానంలో నిలించింది. తద్వారా విశాఖ ఖ్యాతిని జాతీయ స్థాయిలో నిలిపింది విశాఖ పోర్టు.. పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ మంత్రిత్వశాఖ (MoPSW) నిర్వహించిన ఈ పోటీలో, శ్యామ ప్రసాద్ ముఖర్జీ పోర్టు అథారిటీ (SMPA) రెండవ స్థానంలో నిలవగా.. ఇండియన్ మేరిటైమ్ యూనివర్సిటీ (IMU) మూడవ స్థానంలో నిలిచింది..
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ నెల 15వ తేదీ నుంచి ఉచిత ఆర్టీసీ ప్రయాణం అందుబాటులోకి రానుంది... ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రం అంతా మహిళలు ఉచితంగా ప్రయాణం చెయ్యచ్చు. పల్లె వెలుగు. అల్ట్రా పల్లె వెలుగు... సిటీ ఆర్డినరీ.. మెట్రో.. ఎక్స్ ప్రెస్లో ప్రయాణం చెయ్యచ్చు. ఇప్పటికే ఏపీ కేబినెట్ సమావేశంలో మహిళల ఉచిత బస్సు పథకం ఆమోదం పొందింది..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం తొలగించడంతో నందిగామలో ఉద్రిక్తత వాతావరణానికి కారణం అయ్యింది.. ట్రాఫిక్కు అడ్డుగా ఉందని రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో తొలగించారు మున్సిపల్ అధికారులు... గాంధీ సెంటర్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించిన ప్రదేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దేవినేని అవినాష్, గౌతమ్, రెడ్డి, మొండితోక జగన్ మోహన్ రావు ఆందోళనకు దిగారు..
వర్ రాయుడు హత్యకేసులో శ్రీకాళహస్తికి చెందిన జనసేన పార్టీ మాజీ ఇంఛార్జ్, జనసేన బహిష్కృత నేత వినుత కోటకు బెయిల్ దొరికింది.. రాయుడు హత్య కేసులో A3గా ఉన్న శ్రీకాళహస్తి జనసేన పార్టీ బహిష్కృత నేత వినుత కోటకు బెయిల్ మంజూరు చేసింది మద్రాస్ చీఫ్ సెషన్స్ కోర్టు.. అయితే, ప్రతి రోజు ఉదయం 10 గంటలలోపు C3 సెవెన్ వెల్స్ చెన్నై పోలీస్ స్టేషన్ లో సంతకం చేయాలని షరతులు పెట్టింది కోర్టు.
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి...జర్నలిస్టులపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. పెన్ను పేపర్ ఇస్తే ఏబీసీడీలు కూడా రాయలేని వాళ్లు కూడా జర్నలిస్టులుగా చెప్పుకున్నారని అన్నారు. పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటారని...అదేదో వాళ్ల ఇంటిపేరు అయినట్టు అంటూ వ్యాఖ్యానించారు. ఏం జర్నలిస్ట్ అని అడిగితే సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటున్నారని మండిపడ్డారు.
తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఉత్తరాంధ్ర. 2024 ఎన్నికల ఫలితాలు, ఇక్కడ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు వచ్చిన మెజార్టీలే అందుకు నిదర్శనం. అందులోనూ గ్రేటర్ విశాఖ సిటీలో అయితే సైకిల్ సవారీకి ఎదురే లేకుండా పోయింది. కూటమి కట్టినా...ఒంటరిగా పోటీ చేసినా సిటీ పరిధిలోని నాలుగు స్ధానాలు టీడీపీ ఖాతాలోనే పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ పోలవరం. కానీ... అదే పోలవరం ఎమ్మెల్యే విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కొత్త కొత్త వివాదాలు రేగుతూ... రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఆ వ్యవహారాల్లో ఈ జనసేన ఎమ్మెల్యే ప్రమేయం ఉందా లేదా అన్న సంగతి పక్కనబెడితే... వోవరాల్గా హైలైట్ అవుతోంది మాత్రం ఆయనే. అది ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి తలనొప్పిగా మారుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు తేవాలన్నా శాసనసభ్యులే కీలకం. నియోజకవర్గాల్లో వాళ్ళు, వాళ్ల అనుచరుల వ్యవహారాలు, ప్రవర్తనను బట్టే ప్రభుత్వం మీద ప్రజలకు ఓ అభిప్రాయం కలుగుతుంది. కానీ... ప్రస్తుతం ఏపీలోని చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కట్టు తప్పుతున్నారన్న నివేదికలు అందుతున్నాయట ప్రభుత్వ పెద్దలకు. దాన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబు..
కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్... 665 పేజీల నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు అధికారుల కమిటీ దాన్ని పూర్తిగా స్టడీ చేసి 60 పేజీల సారాంశాన్ని క్యాబినెట్కు అందించింది. అయితే ఈ అరవై పేజీల నివేదికలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల పేర్లు మాత్రమే ప్రస్తావించి వారు సక్రమంగా విధులు నిర్వర్తించ లేదని స్పష్టం చేసింది.