ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు.. టికెట్ కోసం రూ.5 కోట్లు..!
ఇద్దరు టీడీపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కలకలం రేపుతున్నాయి.. మరోసారి ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సంచలన ఆరోపణలు చేశారు.. 2024 ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం 5 కోట్ల రూపాయాలు కేశినేని చిన్ని అడిగారని ఆరోపించారు.. అంతేకాదు, తన అకౌంట్ నుంచి మూడు దఫాలుగా 60 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. ఇక, ఎంపీ చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి తీసుకువెళ్లిన 50 లక్షల రూపాయలు.. నా మిత్రులు ఇచ్చిన 3.50 కోట్ల రూపాయల గురించి రేపు మాట్లాడుకుందాం.. నిజమే గెలవాలి అంటూ పోస్టులు పెట్టారు కొలికపూడి.. అయితే, ఇవాళ తిరువూరులో ఎంపీ కేశినేని చిన్ని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ సంచలన పోస్టులు పెట్టడం హాట్ టాపిక్‌గా మారిపోయింది..
కొలికపూడికి దేవినేని చిన్ని కౌంటర్.. దేవుడిగా ఉన్న నేను దెయ్యంగా మారానా..?
బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చేసిన ఆరోపలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.. 2024 ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ టికెట్ కోసం 5 కోట్ల రూపాయాలు కేశినేని చిన్ని అడిగారని ఆరోపించిన కొలికపూడి.. తన అకౌంట్ నుంచి మూడు దఫాలుగా 60 లక్షల రూపాయలు ట్రాన్స్‌ఫర్ చేసినట్టు తన ఫేస్‌బుక్ లో పోస్ట్ పెట్టారు.. ఇక, ఎంపీ చిన్ని పీఏ మోహన్ పోరంకి వచ్చి తీసుకువెళ్లిన రూ. 50 లక్షలు.. నా మిత్రులు ఇచ్చిన రూ. 3.50 కోట్ల గురించి రేపు మాట్లాడుకుందాం.. నిజమే గెలవాలి అంటూ పోస్టులు పెట్టారు కొలికపూడి.. దీంతో, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఒకసారిగా పొలిటికల్ హీట్ పుట్టింది.. ఎంపీ కేసినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ వార్ పీక్‌కు చేరినట్టు అయ్యింది.. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్యే కొలికపూడికి ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ఇచ్చారు. నేను ఎప్పుడు నా జేబులో డబ్బులు మాత్రమే ఖర్చు పెడతాను అని స్పష్టం చేశారు ఎంపీ కేశినేని చిన్ని.. విజయవాడ ఉత్సవాలతో నష్టపోయారు.. కేవలం ఐదు లక్షలు.. పది లక్షల గురించి నాపై ఆరోపణలు చేస్తున్నారు అంటూ మండిపడ్డారు.. ఇవన్నీ ప్రజల నమ్మరన్న ఆయన.. వీటిని పార్టీ నాయకత్వం, అధిష్టానం చూసుకుంటుందని పేర్కొన్నారు. నేను ఎప్పుడు రంగులు మార్చలేదన్నారు.. అయితే.. 12 నెలలు దేవుడిగా ఉన్న నేను.. ఇప్పుడు దెయ్యంగా మారాను అంటే ఎమ్మెల్యే కొలికిపూడి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. ఇక, ఎంపీ కేశినేని చిన్న లేకపోతే నేనులేను అని చెప్పిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీని
పంచాయతీరాజ్ అధికారులకు పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకువచ్చామని, వాటి ఫలాలు ప్రజలకు సక్రమంగా అందించే బాధ్యత ఉద్యోగులపై ఉందని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్.. నవంబర్ 1వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి అధికారులు.. డీడీవో కార్యాలయాలు ప్రారంభించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ ఉన్నతాధికారులతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. క్లస్టర్ విధానం రద్దు చేసి 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర యూనిట్లు చేయడం ద్వారా గ్రామీణులకు మెరుగైన సేవలు అందించే వెసులుబాటు తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం చెప్పారు. పల్లెల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో పంచాయతీలు, గ్రామీణాభివృద్ధికి నిధులు సమకూరుస్తున్నామని తెలిపారు. ఇక, 15వ ఆర్థిక సంఘం నిధులతోపాటు పంచాయతీలు ఆర్థిక స్వయం ప్రతిపత్తి సాధించే విధంగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు పవన్ కల్యా్… నిధులు సమకూర్చడంలోను, పాలనాపరమైన సంస్కరణల్లోనూ కూటమి ప్రభుత్వం ఎంతో సానుకూల దృక్పథంతో ఉందనీ… ఆ ఫలితాలు ప్రజలకు చేర్చి పల్లెల అభివృద్ధిలో ఉద్యోగులు క్రియాశీలక బాధ్యత తీసుకోవాలన్నారు. నిధుల వినియోగం, పాలన సంస్కరణల అమలుపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సమీక్షలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. పల్లె పండగ 2.0 ద్వారా గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపై పూర్తి ప్రణాళిక అందించాలని ఆదేశించారు డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్..
ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు అత్యవసర నిధుల విడుదలకు సీఎం ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలపై దుబాయ్ నుంచి అధికారులతో మరోమారు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. తీసుకోవాల్సిన చర్యలపై మంత్రులు, సీఎస్, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో మాట్లాడారు.. వర్ష ప్రభావిత నెల్లూరు, ప్రకాశం, కడప, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిస్థితిపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీజీఎస్ అధికారులతో మాట్లాడిన సీఎం చంద్రబాబు.. నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు రూ.2 కోట్ల చొప్పున, మిగతా వర్ష ప్రబావిత జిల్లాలకు రూ.1 కోటి చొప్పున అత్యవసర నిధులు మంజూరుకు ఆదేశాలు జారీ చేశారు.. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని సూచించారు.. ప్రాణ, ఆస్తి నష్టం జరగ్గకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రెవెన్యూ, డిజాస్టర్, పోలీస్, ఇరిగేషన్, మున్సిపల్, ఆర్ అండ్ బి విద్యుత్ శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సీఎం చంద్రబాబు.. లోతట్టు ప్రాంతాల్లోని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్న ఆయన.. రిలీఫ్ కేంద్రాల్లో బాధితులకు నాణ్యమైన ఆహారం, పిల్లలకు పాలు అందించాలని స్పష్టం చేశారు.. అయితే, దక్షిణ. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో ఇప్పటికే కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్టు సీఎం చంద్రబాబు వివరించారు కలెక్టర్లు.. కాలువ, చెరువు గట్లకు గండ్లు పడకుండా బలహీనంగా ఉన్న చోట్ల పటిష్ట పరచాలని సూచించారు.. ఇక, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలని ఆదేశించారు.. పంట నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..
బంజారాహిల్స్లో సె*క్స్ రాకెట్ గుట్టురట్టు.. విదేశీ యువతి సహా పలువురు అరెస్ట్.!
హైదరాబాద్‌లో మరోసారి సెక్స్ రాకెట్ బట్టబయలు అయ్యింది. బంజారాహిల్స్ ప్రాంతంలో పెద్ద సెక్స్ రాకెట్‌ను తాజాగా పోలీసులు గుట్టురట్టు చేశారు. రోడ్ నెంబర్ 12లో ఉన్న R-Inn హోటల్‌లో వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు దాడి నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. షరీఫ్ అనే వ్యక్తి ఆ హోటల్‌లో రెండు రూమ్‌లను అద్దెకు తీసుకుని.. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నాడు. అతను ఉద్యోగాల పేరుతో ఇతర ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నాడు. పక్కా సమాచారం రావడంతో బంజారాహిల్స్ పోలీసులు R-Inn హోటల్‌పై దాడులు నిర్వహించారు. ఈ రైడ్‌లో ముగ్గురు యువతులు, వ్యభిచారం కోసం వచ్చిన ఏడుగురు విటులు, ఇంకా ఈ రాకెట్ నిర్వాహకుడు షరీఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన యువతుల్లో ఒకరు ఉజ్బెకిస్తాన్‌కు చెందిన యువతిగా గుర్తించారు. ఈ ముఠా కార్యకలాపాలు, ఇతర లింకుల గురించి పోలీసులు షరీఫ్‌ను, మిగతా వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దీపావళి రోజు ‘‘కార్బైడ్ గన్’’ విషాదం.. కంటిచూపు కోల్పోయిన 14 మంది చిన్నారులు..
దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు వైభవంగా జరిగాయి. ప్రజలు తమ కుటుంబాలతో పండగను సెలబ్రేట్ చేసుకున్నారు. కానీ, కొందరికి మాత్రం దీపావళి విషాదాన్ని మిగిల్చింది. కంటిచూపు కోల్పోయేలా చేసింది. ‘‘కార్బైడ్ గన్’’ వల్ల మధ్యప్రదేశ్‌లో 122 మంది పిల్లలు గాయపడ్డారు. వీరిలో 14 మంది కంటి చూపు కోల్పోయారు. కేవలం మూడు రోజుల్లోనే వీరంతా గాయపడ్డారు. ఈ కార్బైడ్ గన్‌ను ‘‘దేశీ ఫైర్ క్రాకర్ గన్’’గా కూడా పిలుస్తారు. వీటిపై మధ్యప్రదేశ్‌లో నిషేధం ఉన్నా కూడా, దీనిని ఉల్లంఘించి కొంత మంది విక్రయించారు. ముఖ్యంగా, విదిశ జిల్లాలో ఎక్కువగా ఇలాంటి సంఘటనలు రిపోర్ట్ అయ్యాయి. రూ. 150-200 మధ్య దొరికే ఈ కార్బైడ్ గన్ బాంబుల వలే పేలుతున్నాయి. విదిషలో ఈ గన్‌లను విక్రయించిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, గ్వాలియర్ ఇలా అన్ని నగరాల్లోని ఆస్పత్రుల్లోని ఐ వార్డులు నిండిపోయాయి. భోపాల్‌లోని హమీడియా ఆస్పత్రిలో 72 గంటల్లో 26 మంది పిల్లలు చేరారు.
ఇదేం షాక్ సామి.. అమెజాన్‌లో 6 లక్షల ఉద్యోగాలను రోబోలతో భర్తీ..!
అమెరికాలో రెండవ అతిపెద్ద కంపెనీ అమెజాన్ దాదాపు 600,000 ఉద్యోగాలను రోబోలతో భర్తీ చేయాలని యోచిస్తోంది. గత రెండు దశాబ్దాలుగా లక్షలాది మంది వేర్ హౌజ్ వర్కర్స్ ను నియమించిన, కాంట్రాక్ట్ డ్రైవర్ల సైన్యాన్ని నిర్మించిన, ఉద్యోగులను నియమించడానికి, పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంలో మార్గదర్శకత్వం వహించిన సంస్థ ఇదే. కంపెనీ వర్గాల సమాచారం ప్రకారం అమెజాన్ ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీ కార్యాలయంలో మార్పులు అవసరమని, ఉద్యోగుల స్థానంలో రోబోలను ఉపయోగించాల్సిన అవసరం ఉందని విశ్వసిస్తున్నట్లు వెల్లడైంది. 2018 నుండి అమెజాన్ US శ్రామిక శక్తి మూడు రెట్లు పెరిగి దాదాపు 1.2 మిలియన్లకు చేరుకుంది. కానీ అమెజాన్ ఆటోమేషన్ బృందం 2027 నాటికి USలో 160,000 కంటే ఎక్కువ మందిని నియమించుకోకుండా ఉండగలదని ఆశిస్తోంది. దీనివల్ల అమెజాన్ ఎంచుకునే, ప్యాక్ చేసే, డెలివరీ చేసే ప్రతి వస్తువుపై దాదాపు 30 డాలర్స్ ఆదా అవుతుందంటున్నారు.
ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ.. ప్రశాంత్ నీల్ ఇలా చేశావేంటి..?
రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే నేడు. సాధారణంగా హీరోల బర్త్ డేలకు వాళ్ల రాబోయే సినిమాల నుంచి అప్డేట్లు వస్తాయనే విషయం తెలిసిందే కదా. నేడు ప్రభాస్ నటించిన ది రాజాసాబ్, ఫౌజీ సినిమాల నుంచి అప్డేట్లు వచ్చాయి. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అనుకున్న సలార్-2 నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదు. అదే ఫ్యాన్స్ కు అసంతృప్తిని కలిగించింది. హోంబలే సంస్థ నుంచి కేవలం బర్త్ డే విషెస్ మాత్రమే వచ్చాయి. పైగా ఏదో నార్మల్ ఫొటోను పెట్టేసి విష్ చేసింది నిర్మాణ సంస్థ. దీంతో ప్రశాంత్ నీల్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఏదో బిగ్ అప్డేట్ ఇస్తావని ఆశిస్తే ఇలా చేశావేంటని అంటున్నారు. సలార్-2 అంచనాలకు మించి ఉంటుందని గతంలోనే ప్రశాంత్ నీల్ తెలిపాడు. దాంతో ఈ సినిమా నుంచి ఏదైనా పోస్టర్ లేదా కీలక అప్డేట్ ఉంటుందని అంతా ఆశించారు. కానీ ఇలా షాక్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్ మావ. దీంతో సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ ను ట్యాగ్ చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. ఇలా చేశావేంటి మావా అంటూ అడుగుతున్నారు. నిన్న రాత్రి ప్రభాస్ బర్త్ డే వేడుకల్లో ప్రశాత్ నీల్ కూడా ఉన్నాడు. ఇంకోవైపు కల్కి-2 నుంచి గానీ.. స్పిరిట్ సినిమాల నుంచి గానీ ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ మరింత నిరాశకు గురయ్యారు. ఇంకో విషయం ఏంటంటే నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా కనీసం విషెస్ కూడా చెప్పకపోవడం విశేషం. మరి రాత్రి లోపు అయినా వారి నుంచి అప్డేట్లు వస్తాయా లేదా అన్నది చూడాలి.