ప్రభుత్వానికి మంచి పేరు రావాలన్నా, చెడ్డ పేరు తేవాలన్నా శాసనసభ్యులే కీలకం. నియోజకవర్గాల్లో వాళ్ళు, వాళ్ల అనుచరుల వ్యవహారాలు, ప్రవర్తనను బట్టే ప్రభుత్వం మీద ప్రజలకు ఓ అభిప్రాయం కలుగుతుంది. కానీ... ప్రస్తుతం ఏపీలోని చాలా మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు కట్టు తప్పుతున్నారన్న నివేదికలు అందుతున్నాయట ప్రభుత్వ పెద్దలకు. దాన్ని దృష్టిలో పెట్టుకునే సీఎం చంద్రబాబు..
కాళేశ్వరం బ్యారేజీల కుంగుబాటుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్... 665 పేజీల నివేదిక ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంలోని ముగ్గురు అధికారుల కమిటీ దాన్ని పూర్తిగా స్టడీ చేసి 60 పేజీల సారాంశాన్ని క్యాబినెట్‌కు అందించింది. అయితే ఈ అరవై పేజీల నివేదికలో ఇద్దరు ఐఏఎస్ అధికారుల పేర్లు మాత్రమే ప్రస్తావించి వారు సక్రమంగా విధులు నిర్వర్తించ లేదని స్పష్టం చేసింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో....బీసీ రిజర్వేషన్ల అంశం మీద జోరుగా చర్చ జరుగుతోంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వాలన్న విషయంలో అన్ని పార్టీలది ఒకటే మాట. కానీ... సాధనలో మాత్రం ఎవరి రాజకీయాలు వారివి అన్నట్టుగా నడుస్తోంది వ్యవహారం. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజవర్గంలో ఓ మహిళా ప్రభుత్వ ఉద్యోగిని కిడ్నాప్ వ్యవహారం సంచలనంగా మారింది.. దేవీపట్నం మండలం శరభవరం గ్రామ సచివాలయంలో.. సోయం శ్రీసౌమ్య వెల్ఫేర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో 8 మంది వ్యక్తులు వచ్చి ఇన్నోవా వాహనంలో సినీ ఫిక్కీలో ఆమెను ఎత్తుకెళ్లారు.
టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. శాతవాహన కాలేజీ ప్రారంభించి 53 యేళ్లు అయ్యింది.. అనేకమంది పెద్దలు సెక్రటరీ లుగా పని చేశారు.. 2011లో నేను సెక్రటరీగా అయిన సమయంలో ఈ ఆస్తిని లోక్ అదాలత్ లో పెట్టినట్లు వంకాయలపాటి కామేశ్వరరావు, బోయపాటి అప్పారావు మధ్య వివాదం నడిచింది.. ఆ తరువాత ఈ వివాదం సుప్రీంకోర్టు వరకూ కూడా వెళ్లింది.. ఆ తర్వాత శ్రీనివాసరావు, ప్రజాప్రతిరావులు కోర్టులో గెలిచి కూడా పిటిషన్ వెనక్కి తీసుకోవడం ఆశ్చర్యం కలిగించింది..
కడప జిల్లాలో రెండు జడ్పీటీసీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతోన్న వేళ.. దాడులు వ్యవహారం కాకరేపుతోంది.. అయితే, రాజ్ భవన్లో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన వైసీపీ నేతల బృందం.. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలపై జరుగుతున్న దాడులపై గవర్నర్ కి ఫిర్యాదు చేశారు..
యువత వారానికి ఒకసారి చేనేత వస్త్రాలను ధరిస్తే ఆ రంగంపై ఆధారపడ్డవారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని.. అందుకే అంతా వారంలో ఒక్కసారైనా చేనేత వస్త్రాలను ధరించాలని పిలుపునిచ్చారు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
విశాఖపట్నంలో భారీ పేలుడు సంభవించింది.. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఏరియాలో ఈ పేలుడు ఘటన చోటు చేసుకుంది.. విశాఖపట్నం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హిమాలయ బార్ దగ్గర గ్యాస్ సిలిండర్ పేలడంతో.. ముగ్గురు మృతిచెందారు.. మరో నలుగురికి తీవ్ర గాయాలు అయినట్టుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే గతంలో ఎన్నడూ పట్టుబడని విధంగా ఏకంగా 25 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు ఓ అధికారి.. రూ.25 లక్షలు లంచం తీసుకుంటుండగా.. ట్రైబల్ వెల్ఫేర్ శాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్‌ను పట్టుకున్నారు ఏసీబీ అధికారులు..