పండుగ పూట కొన్ని విషాద ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి.. తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో తన చెల్లి వద్దకు రాఖీ కట్టించుకోవడానికి వెళ్తూ.. అనంత లోకాలకు చేరాడు ఓ యువకుడు..
ఎన్నికల కమిషన్, కేంద్ర సర్కార్‌పై మరోసారి ఫైర్ అయ్యారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. ఇక, బెంగళూరులోని బీజేపీ పార్టీకి చెందిన ఓ నేత అసెంబ్లీ నియోజకవర్గంలో లక్ష దొంగ ఓట్లు వేసుకున్నారని ఆరోపించారు..
పండుగ సీజన్లో రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది భారతీయ రైల్వేశాఖ.. పండుగ సమయంలో తిరుగు ప్రయాణ టిక్కెట్లపై 20 శాతం తగ్గింపును ప్రకటించింది.. అక్టోబర్ 13 నుండి అక్టోబర్ 26 వరకు ఉన్న అడ్వాన్స్డ్ రిజర్వేషన్లలో తిరుగు ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకుంటే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది..
శ్రీశైలం డ్యామ్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి.. అయితే, ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు పోలీసులు.. శ్రీశైలాం జలాశయం వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలపై సున్నిపెంట పోలీసులు చర్యలు చేపట్టారు..
కడప జిల్లాలో జరుగుతోన్న జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి కొలుసు పార్థసారథి.. పులివెందులలో ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందని ఆయన అన్నారు.. గత ప్రభుత్వం పాలనలో అవినీతి అక్రమాలు జరిగాయని దీంతో ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు..
గుట్కా ప్యాకెట్ల వ్యవహారంలో ఓ హెడ్ కానిస్టేబుల్‌పై జనసేన నేత దాడి చేయడం కలకలం సృష్టించింది.. నంద్యాలలో ఈ ఘటన జరిగింది.. జిల్లా ఎస్పీ స్పెషల్ క్రైమ్ పార్టీ హెడ్ కానిస్టేబుల్ మణిని చితకబాదారు జనసేన జిల్లా కో-ఆర్డినేటర్ పిడతల సుధాకర్..
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తన అన్న నాగబాబుకు మంత్రి పదవి ఇప్పిస్తారా..? లేదా..? మార్చిలోనే MLC అయ్యారు నాగబాబు. ఆయన్ని కేబినెట్లోకి తీసుకుంటామని 2024 డిసెంబర్లోనే ప్రకటించారు సీఎం చంద్రబాబు. మరి ఎందుకు ఇంత ఆలస్యం. నాగబాబు అమాత్య యోగానికి అడ్డం ఏంటీ..? పవన్ కళ్యాణ్‌కు వేరే ఆలోచన ఏమైనా ఉందా..?
ఆ ఎమ్మెల్యే చెప్పేవన్నీ కబుర్లు తప్ప... చేతల్లో కనిపించడం లేదా? మాటలు కోటలు దాటుతున్నాయి గానీ... అభివృద్ధి పనులు గడప కూడా దాటడం లేదా? పైగా అనుచరులు దందాల్లో ఆరితేరిపోయి ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారా? ఎమ్మెల్యేకి స్ననిహితుడైన డాక్టర్ వైద్యం మానేసి సెటిల్మెంట్స్లో బిజీగా ఉన్నారా? ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడ జరుగుతోందా తంతు?
అధికార పార్టీకి విపరీతమైన పట్టున ఆ నియోజకవర్గంలో వైసీపీ తప్పుల మీద తప్పులు చేస్తోందా? అధిష్టానం నిర్ణయంతో ఇప్పుడు కేడర్ డైలమాలో పడిందా? ఆగండి... రా.. రండని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిలుస్తున్నా... పట్టించుకునే స్థితిలో ద్వితీయ శ్రేణి లేదా? ఏదా అసెంబ్లీ సెగ్మెంట్? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులేంటి?