Kurnool Bus Incident: కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదం 20 మంది ప్రాణాలు తీసింది.. నిద్రలో ఉన్నవాళ్లు కళ్లు తెరవకుండానే సజీవ దహనం కావడం.. విషాదాన్ని నింపింది.. దీపావళికి సొంత ఊళ్లకు వచ్చి తిరిగి బెంగళూరు వెళ్లేవాళ్లు.. ఇంటర్వ్యూల కోసం వెళ్లే వారు.. అక్కడే స్థిరపడిన వాళ్లు.. ఇలా ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరు అవుతున్నాయి.. అయితే, ఈ ప్రమాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్.. రోడ్ ఇంజినీరింగ్… బస్ డిజైన్ కు సంబంధించి లోపం ఉండడం వల్లనే గతంలో పాలెం బస్సు ప్రమాదం జరిగిందన్నారు ఎంపీ కృష్ణ ప్రసాద్.. పాలెం బస్సు ప్రమాదంలో ఆయన ఇన్వెస్టిగేషన్ అధికారిగా పని చేసారు. ప్రస్తుతం జరిగిన కర్నూల్ ప్రమాదంపై కూడా త్వరలో వివరాలు తెలుస్తాయన్నారు. భవిష్యత్ లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా.. కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని.. తగిన చర్యలపై దృష్టి పెడతామన్నారు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్.. ఇక, ఎన్టీవీ ప్రత్యేక ఇంటర్వ్యూల్లో కర్నూలు రోడ్డు ప్రమాదంపై బాపట్ల పార్లమెంట్ సభ్యులు కృష్ణప్రసాద్ ఏం మాట్లాడారో తెలుసుకోడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..