వైఎస్ జగన్మోహన్రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి పై కేసు నమోదు అయ్యింది.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. ఆ తర్వాత శ్రీవారి ఆలయం ముందు రాజకీయ వాఖ్యలు చేశారని రవీంద్రనాథ్ రెడ్డి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీటీటీ విజిలెన్స్ అధికారులు. ఇక, విజిలెన్స్ ఫర్యాదుతో రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు తిరుమల పోలీసులు.
ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న సుచరిత అనే మహిళ.. బైక్‌పై బస్సు ను ఓవర్ టేక్ చేసింది.. బస్సు ను ఆపి డ్రైవర్ తో వాగ్వాదానికి దిగింది.. అనంతరం డ్రైవర్ పై చేయి చేసుకుంది.. తోటి ప్రయాణికులు ఎంత వారించినా వెనక్కి తగ్గకుండా దాడికి పాల్పడింది మహళ.. ఓ మహిళ తనపై దాడి చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఏపీఎస్ ఆర్టీసీ బస్సు డ్రైవర్ నటేష్ బాబు.. కాగా, డ్యూటీలో ఉన్న డ్రైవర్, కండక్టర్లపై దాడి చేస్తే.. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుంది ఏపీఎస్ఆర్టీసీ.
అమెరికా - రష్యా చర్చల మధ్య సోమవారం ప్రారంభంలో భారత రూపాయి బలపడిందని అంచనా వేస్తున్నారు.. సోమవారం అమెరికా డాలర్‌తో పోలిస్తే స్థానిక కరెన్సీ 13 పైసలు బలపడి 87.53 వద్ద ప్రారంభమైంది.. శుక్రవారం డాలర్‌తో పోలిస్తే ఇది 87.66 వద్ద ముగిసింది. ట్రేడింగ్ పరిధి 87.25 మరియు 87.80 మధ్య ఉందని ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఎల్ఎల్పీ ట్రెజరీ అధిపతి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలీ అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది.. కొత్త జిల్లాల మార్పుకు సంబంధించి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.. కొన్ని జిల్లాల సరిహద్దులు, పేర్లు, మండలాల మార్పులపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు చేస్తుండగా.. స్వరూపం మార్చుకోనున్నాయి కొన్ని జిల్లాలు... జిల్లాల సంఖ్య 26 నుంచి 32కి పెరిగే అవకాశం ఉంది..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో హైడ్రోపవర్ ప్లాంట్ వ్యతిరేక పోరాటం తీవ్ర రూపం దాలుస్తోంది. అరకులోయ మండలం లోతేరులో సర్వే రాళ్లను ధ్వంసం చేశారు గిరిజనులు.. తమ సంప్రదాయ ఆ యుధాలతో ప్రదర్శన నిర్వహించారు. పవర్ ప్లాంట్లను తరిమి కొడతామని హెచ్చరించడంతో ఏజెన్సీ నివురుగప్పింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్ట్ తీర్పు బీఆర్ఎస్కు బూస్ట్ ఇచ్చిందా? అదే ఊపులో మరో న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించిందా? ఈసారి పెద్దల సభవైపు గులాబీ పెద్దల దృష్టి మళ్ళిందా? ఆ దిశగా ఇప్పుడేం చేయాలనుకుంటోంది కారు పార్టీ? ఏంటా సంగతులు? బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న పది మంది శాసనసభ్యుల విషయంలో స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది సుప్రీం కోర్ట్. అయితే…ఈ మూడు నెలల్లోపు […]
కాళేశ్వరం రిపోర్ట్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు... ఏం చేయబోతున్నారు ? సీఎస్ రామకృష్ణారావు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక హరీశ్‌రావుకు ఇస్తారా? అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంటే... అంతకు ముందే కమిషన్ నివేదికపై మాజీ మంత్రి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా ? కాళేశ్వరంపై తెలంగాణ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది ?