* ఇవాళ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య చివరి వన్డే.. సిడ్నీ వేదికగా ఉదయం 9 గంటలకు మ్యాచ్ ప్రారంభం
* ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్: ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్.. ఇండోర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్
* ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఇవాళ వాయుగుండంగా మారనున్న అల్పపీడనం.. 27 నాటికి తుఫాన్‌గా మారే అవకాశం.. ఇవాళ ఏపీలోని 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్.. ఏపీ వైపు దూసుకొస్తున్న మంతా తుఫాన్
* ఢిల్లీ: ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో కీలక సమావేశం.. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న డిప్యూటీ సీఎం భట్టి.. ఇవాళ ఉదయం 9.30కి ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఏఐసీసీ పరిశీలకులు
* తిరుమల: ఇవాళ ఆన్‌లైన్‌లో జనవరి నెలకు సంబంధించిన దర్శన టికెట్లు విడుదల.. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు.. మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో వసతి గదులు కోటా విడుదల
* తిరుమల: ఇవాళ నాగుల చవితి సందర్భంగా పెద్దశేష వాహన సేవ.. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి
* హైదరాబాద్: నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..
* నేడు భద్రాచలం రామాలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకొని సామూహిక సత్యనారాయణ వ్రతాలు
* నల్లగొండ జిల్లా: నేడు హుజూర్ నగర్ లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా..
* హైదరాబాద్: మేడిగడ్డ, అన్నారం సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ, పునర్నిర్మాణ డిజైన్ ఏజెన్సీల ఎంపిక నేడే చివరి రోజు. EOI సబ్మిషన్ కు నేడు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఈవోఐ సబ్మిషన్ కు సమయం ఇచ్చిన ఇరిగేషన్ శాఖ.
* నేటి నుంచి జాగృతి అధ్యక్షురాలు కవిత జిల్లాల యాత్ర.. సామాజిక తెలంగాణ లక్ష్యంగా 33 జిల్లాల్లో యాత్రకు రూట్ మ్యాప్ రెడీ చేసుకున్న కవిత.. నిజామాబాద్ నుంచి జిల్లాల యాత్రకు శ్రీకారం చుట్టనున్న కవిత.. ఈరోజు ఉదయం 9గంలకు గన్ పార్క్ లో నివాళులర్పించున్న కవిత
* అనంతపురం : నేటి నుంచి రెండు రోజులు పాటు రాష్ట్రస్థాయి జూనియర్ తైక్వాండో పోటీలు.
* శ్రీ సత్యసాయి: నేడు ధర్మవరంలో పర్యటించనున్న మంత్రి సత్యకుమార్ యాదవ్.. బత్తలపల్లి మండలం డి. చెర్లోపల్లి, ధర్మవరం, కత్తె కొట్టాల, పోతులనాగేయపల్లిలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి
* తిరుమల: 20 కంపార్టుమెంట్లలో వేచినున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,110 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,695 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.89 కోట్లు
* హైదరాబాద్: నేడు తెలంగాణ భవన్ లో కేటీఆర్ కీలక సమావేశం.. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జీలు, కార్పొరేటర్లతో సమావేశం కానున్న కేటీఆర్.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రచారంలో పాల్గొనే విధంగా ప్లానింగ్