MLA Kolikapudi Srinivasa Rao vs MP Kesineni Chinni: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ఈ వ్యవహారంపై స్పందించిన టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆ నేతలతో మాట్లాడాల్సింది ఏమీ లేదని టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావుకు దుబాయ్ నుంచి ఫోన్ చేసి స్పష్టం చేశారు.. అయితే, తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఇవాళ టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అపాయింట్‌మెంట్ కోరారు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.. ఇప్పటికే బెజవాడ ఎంపీ కేశినేని చిన్నిపై కొలికపూడి తీవ్ర విమర్శలు చేయడం.. ఈ అంశంపై సీఎం చంద్రబాబు సీరియస్ కావం.. టీడీపీ కార్యాలయానికి ఎవర్ని పిలవద్దని చెప్పిన తర్వాత.. ఎమ్మెల్యే కొలికపూడి అపాయింట్‌మెంట్ కోరవడం చర్చగా మారింది.. దీంతో ఇవాళ పల్లా శ్రీనివాసరావుతో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భేటీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.. ఈ సమావేశంలో.. తాను ఎంపీ కేశినేని చిన్నిపై సోషల్ మీడియా వేదికగా చేసిన వరుస పోస్టులపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది.. అయితే, ఈ వ్యవహారం ఇంలా ఎటువైపు దారి తీసుకుంటుంది అనేది ఇప్పుడు చర్చగా మారింది..
Read Also: Pak-Afghan: పాక్-అఫ్గాన్ బోర్డర్ బంద్.. కిలో టమాటా రూ. 600!