Heavy Rains in Andhra Pradesh: ఏపీకి తుఫాన్ ముప్పు..! నేడు ఈ జిల్లాలో అతి భారీ వర్షాలు..
- ఆంధ్రప్రదేశ్‌కి మరో తుఫాన్ ముప్పు..!..
- ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది తీవ్ర అల్పపీడనం..
- నేడు వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని అంచనా..
- నేడు కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Heavy Rains in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కి మరో తుఫాన్ ముప్పు పొంచిఉంది.. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైంది తీవ్ర అల్పపీడనం.. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ నేడు వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని.. రేపు తీవ్ర వాయుగుండంగా బలపడనుందని అంచనా వేస్తున్నారు.. ఎల్లుండికి నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో తుఫాన్‌గా మారే అవకాశం ఉంది.. దీని ప్రభావంతో ఇవాళ కోనసీమ, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని.. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది..
Read Also: Nagula Chavithi: నేడే నాగుల చవితి.. పుట్టలో పాలు పోయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే..!
Also Read
- Bay of Bengal Cyclone Alert: బంగాళాఖాతంలో మరో వాయుగుండం.. ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్
- AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
- AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
అయితే, ఏపీకి తుఫాన్ ముప్పు పొంచి ఉందని ఐఎండీ పేర్కొంది.. బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం.. పశ్చిమ-వాయవ్య దిశగా నెమ్మదిగా కదులుతోంది. ఇవాళ వాయుగుండంగా.. రేపు తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశముందని పేర్కొంది.. ఇది తుపాన్‌గా మారితే ‘మొంథా (మొన్‌థా)’గా నామకరణం చేయనుంది ఐఎండీ.. దీని ప్రభావంతో ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇవాళ బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురవనుండగా.. రేపు గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని.. ఇక, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, పల్నాడు, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది..
తాజావార్తలు
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!