Booster Dose: బూస్టర్ డోస్‌కు కొత్త నిబంధనలు.. 9 నెలలు అవసరం లేదు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా మహమ్మారి కట్టడి కోసం ఇప్పటికే ఎన్నో రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి.. ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ తర్వాత ఇప్పుడు బూస్టర్ డోస్ కూడా నడుస్తోంది.. ఈ నేపథ్యంలో ఫస్ట్ అండ్ సెకండ్ డోస్ వేసుకుని బూస్టర్ డోస్ కోసం వేచిచూస్తున్నవారికి గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్రం.. కోవిడ్ బూస్టర్ డోస్ గ్యాప్‌ను 6 నెలలకు తగ్గించింది ప్రభుత్వం.. కరోనావైరస్ వ్యాక్సిన్ యొక్క రెండో డోస్.. బూస్టర్ డోస్ మధ్య గ్యాప్ 9 నెలలుగా ఉండగా.. దానిని ఆరు నెలలకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్. వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వ సలహా సంఘం-ఇమ్యునైజేషన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (NTAGI).. రెండో డోస్ మరియు బూస్టర్ డోస్ మధ్య అంతరాన్ని తగ్గించాలని సిఫార్సు చేసింది.
Read Also: Revanth Reddy: కేసీఆర్‌ను 2 వేల నోట్ల మీద కాలిస్తే.. ఇంకా డబ్బులు మిగులుతాయి
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
దీంతో.. ఈ రెండు డోసుల మధ్య ఉన్న 9 నెలల వ్యవధిని.. ఇప్పుడు 6 నెలలు లేదా 26 వారాలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్రం.. ప్రైవేట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్‌లో రెండో డోస్ ఇచ్చిన తేదీ నుండి 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన తర్వాత 18-59 సంవత్సరాలు బూస్టర్ డోస్ వేసుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది.. దీనిపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఒక లేఖ రాశారు.. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు ఈ లేఖలను పంపింది కేంద్రం.. ఇక, 60 ఏళ్లు, ఆపై వయస్సు వారికి, హెల్త్ కేర్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ప్రభుత్వ సీవీసీల్లో రెండో డోస్ వ్యాక్సినేషన్ తర్వాత 6 నెలలు లేదా 26 వారాలు పూర్తయిన వెంటనే బూస్టర్ డోస్ ఇవ్వబడుతుందని.. వారికి ఇది పూర్తిగా ఉచితమని లేఖలో పేర్కొంది కేంద్రం.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!