తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. ఈ మధ్య హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఆ పార్టీ నేతలు స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి నియోజకవర్గాల వరకు అందరిలో కదలిక తెచ్చారు.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా భారీ బహిరంగ సభ నిర్వహించి సత్తా చాటారు.. ఇక, ఆ సభకు వచ్చిన జనాన్ని చూసి ప్రధాని నరేంద్ర మోడీ ఫిదా అయిపోయారు.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే, పార్టీలో చేరికలు అడపాదడపా జరుగుతూనే ఉన్నాయి.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతలు ఇప్పటికే కాషాయం కండువా కప్పుకోగా.. మరికొందరి చేరికల విషయంలో సొంత పార్టీ నేతలే.. తమకు ఎక్కడ ఇబ్బందిగా మారుతారో ఏమోనని మోకాలడ్డుతున్నారట.. అయితే, చేరికల విషయంలో రాష్ట్ర నాయకత్వం అవలంభిస్తున్న తీరుపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.. అసలు ఎవరినీ వదులుకోవద్దు.. చేరికలపై సీరియస్‌గా దృష్టి సారించాలని బీజేపీ హైకమాండ్ ఆదేశించింది.
Read Also: Business Updates: ఈ రోజు బిజినెస్ వార్తలు..
ఇప్పటికే పలు మార్లు చేరికలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దలు చెప్పినా.. ఇగోలు పక్కన పెట్టాలని చెప్పినా రాష్ట్ర నేతలు పట్టించుకోవడం లేదని అధిష్టానం సీరియస్ గా ఉందట.. నేతల మధ్య ఏకాభిప్రాయం రాక , ఒకరు తెచ్చిన వ్యక్తిని మరొకరు అడ్డుకోవడంతో పలువురు నేతల చేరికలు ఆగిపోయాయి.. ఇదే అంశాన్ని హై కమాండ్ దృష్టికి తీసుకెళ్లారు కొందరు నేతలు.. ఈ అంశంపై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. రాష్ట్ర నేతలను మందలించినట్టుగా తెలుస్తోంది.. రాష్ట్ర నేతల భేటీలో చేరికలపై క్లారిటీ ఇచ్చేశారు.. చేరికల కమిటీలో ఎవరు ఉండాలని పేర్లను ఫైనల్ చేసింది కూడా ఢిల్లీ పెద్దలే.. అయితే, రాష్ట్ర పార్టీలో ఏకాభిప్రాయం ఉంటే అలాంటి వారిని వెంటనే చేర్చుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.. కానీ, ఏకాభిప్రాయం రానివి ఉంటే తమ దగ్గరికి పంపించండి అని ఖరాఖండిగా చెప్పేశారట నడ్డా, అమిత్ షా.. ఇదే సమయంలో ఎవరినీ వదులుకోవద్దు అనే సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది.. తాము 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలంగాణ నేతలకు స్పష్టం నడ్డా, షా స్పష్టం చేశారు.. అన్ని రకాల సహాయ సహకరాలకు సిద్ధమని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ సూచిచిందని చెబుతున్నారు. దీంతో, బీజేపీలో మరికొంత మంది నేతలు చేరే అవకాశం ఉందని.. ఇప్పటికే ఆగిపోయిన చేరికలు.. ఇక ఊపందుకుంటాయని తెలుస్తోంది.