Christmas Scams 2025: డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ మోసాలకు గురౌతున్నారు. అయితే, పండుగలు, ప్రత్యేక ఈవెంట్లు వచ్చినప్పుడు ఈ స్కామ్‌లు మరింతగా పెరుగుతుంటాయి. ఇక, 2025 క్రిస్మస్ పండగ సమయంలో కూడా ఇలాంటి మోసాలు భారీగా పెరుగుతున్నాయని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగిస్తూ స్కామర్లు మరింత ప్రొఫెషనల్‌గా ఫ్రాడ్ చేస్తున్నారు. ఫలితంగా టెక్నాలజీపై అవగాహన ఉన్నవారు కూడా వీరి ఉచ్చులో పడే ప్రమాదం ఉందంటున్నారు.
Read Also: Eat Chapatis in the Morning: రాత్రి చేసిన చపాతీలు ఉదయం తింటున్నారా? అయితే ఇది తెలుసుకోండి
అయితే, ఈ ఏడాది ఎక్కువగా క్రిస్మస్ స్కామ్‌లలో ఫేక్ డెలివరీ స్కామ్ ఒకటి.. ఇందులో కస్టమర్లకు SMS లేదా వాట్సాప్ ద్వారా పార్సెల్ ఆలస్యమైందని మెసేజ్ వస్తుంది.. ఈ సమస్యను పరిష్కరించాలంటే అందులో ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయాలని పేర్కొంటున్నారు.. ఇక, ఆ లింక్ పై క్లిక్ చేయగానే ఓ నకిలీ వెబ్‌సైట్‌కు తీసుకెళ్తుంది.. అక్కడ లాగిన్ వివరాలు, బ్యాంక్ కార్డు సమాచారం చోరీ చేయబడుతుంది అని చెక్ పాయింట్ పరిశోధకుల తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈ తరహా స్కామ్‌లు ఈ సంవత్సరం రెట్టింపు అయ్యాయి.
Read Also: భారత్‌లో వేగంగా విస్తరిస్తున్న Tesla EV.. అందుబాటులోకి సూపర్ ఛార్జర్, కొత్త షోరూం
ఇక, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఫేక్ గివ్‌అవే స్కామ్‌లు కూడా పెద్ద సమస్యగా మారాయి. ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్, ఫేస్‌బుక్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లలో క్రిస్మస్ బహుమతులు గెలిచారని చెబుతూ మెసేజ్‌లు పంపుతారు. బహుమతి పంపించాలంటే షిప్పింగ్ ఫీజు చెల్లించాలని కోరుతారు.. ఇవి ఎక్కువగా కొత్తగా సృష్టించిన ఖాతాల ద్వారా జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో అసలు బ్రాండ్ల లోగోలు, పేర్లను కూడా కాపీ చేసి వినియోగదారులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. అలాగే, ‘క్రిస్మస్ మెగా సేల్’ పేరుతో జరిగే మోసాలు కూడా ఇప్పుడు పెరుగుతున్నాయి. నిజమైన వెబ్‌సైట్‌ల మాదిరిగా కనిపించే నకిలీ సైట్లు సృష్టించి, ఆకర్షణీయమైన ధరలకు ఉత్పత్తులను ప్రదర్శిస్తారు. ఆర్డర్ కన్ఫర్మేషన్ మెయిల్ కూడా వస్తుంది. కానీ, డబ్బు చెల్లించిన తర్వాత ఆ ఆర్డర్ ఎప్పటికీ రాకుండా పోతుంది.. అప్పటికే వినియోగదారు మోసపోయినట్టే.
Read Also: Mehul Choksi: బెల్జియం కోర్టులో మెహుల్ చోక్సీకి బిగ్ షాక్.. త్వరలోనే భారత్కి
కాబట్టి, ఈ తరహా క్రిస్మస్ స్కామ్‌ల నుంచి రక్షించుకోవాలంటే ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. తెలియని లింక్‌లపై క్లిక్ చేయకూడదు అని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు. మీరు ఆర్డర్ చేయని పార్సెల్ గురించి మెసేజ్ వస్తే వెంటనే అనుమానించాలి.. అలాగే, తక్కువ ధరకు ఖరీదైన ఫోన్లు లేదా గాడ్జెట్లు విక్రయిస్తున్న వెబ్‌సైట్‌లు కనిపిస్తే అవి తప్పకుండా స్కామ్‌లేనని అర్థం చేసుకోవాలి.. కొంచెం జాగ్రత్త పడితే పండుగ సమయంలో పెద్ద నష్టాన్ని నివారించగలగుతారని నిపుణులు పేర్కొంటున్నారు.