కన్నప్రేమను మించినదేదీ లేదంటారు. విడిపోయిన కన్నవారిని ఓ చిన్నారి ప్రేమ కలిపింది. ఆమె కన్నవారు సెలబ్రిటీస్ కావడంతో ఆ వార్త మరింతగా హల్ చల్ చేస్తోంది. ఇంతకూ విషయమేమిటంటే, ప్రముఖ మోడల్, టీవీ రియాలిటీ స్టార్ , బిజినెస్ ఉమన్ గా పేరొందిన కిమ్ కర్దాషియన్, ఇరవై ఏళ్ళలో మూడు పెళ్ళిళ్ళు చేసుకుంది. కిమ్ మూడో భర్త ప్రఖ్యాత ర్యాపర్ కేన్ వెస్ట్. వీరిద్దరూ కలసి దాదాపు పదేళ్ళు కాపురం చేశారు.
అంతకు ముందు సహజీవనమూ సాగించారు. వారి తొలి వరాల పంటగా నార్త్ వెస్ట్ జన్మించింది. ఇటీవలే ఈ పాప తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదో యేట అడుగు పెట్టింది. ఆమె బాస్కెట్ బాల్ ఆట కోసం ఈ మధ్యే విడిపోయిన కిమ్ కర్దాషియన్, కేన్ వెస్ట్ మళ్ళీ కలసుకున్నారు. వారిని చూసిన ఫోటోగ్రాఫర్స్ కెమెరాలు క్లిక్కులతో అందరికీ కిక్కునిచ్చాయి. అయితే తామేమీ మళ్ళీ కలసి కాపురం చేయబోవ