అక్కినేని హీరో నాగ చైతన్య త్వరలో ‘థ్యాంక్యూ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దాని తర్వాత అమీర్ ఖాన్ తో కలసి నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ కూడా విడుదల కానుంది. ఇప్పటికే ‘థ్యాంక్యూ’ ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. ఆమీర్ సినిమాకోసం కూడా భారీ ఎత్తున ప్రచారం చేయవలసి ఉంటుంది. మరి వ్యక్తిగత జీవితంలో సమంతతో విడాకులతో పాటు తాజాగా మరో హీరోయిన్ తో ఎఫైర్స్ అంటూ పుట్టుకువచ్చిన పుకార్ల గురించి మీడియా ప్రశ్నించే అవకాశం ఉంది. […]
సోమవారం నటి ఆలియాభట్ ప్రెగ్నెన్సీ టాక్ ఆఫ్ ద సినిమా వుడ్స్ అయింది. దాంతో పెళ్ళయిన రెండు నెలలకే ఎందుకు అలియా, రణ్ బీర్ పిల్లల కోసం సిద్ధపడ్డారన్నది ఎవరికీ ఆర్థం కాని ప్రశ్నగా మిగిలింది. సెట్స్ మీద ఉన్న బాలీవుడ్ సినిమాలలో రెండు పూర్తయ్యాయి. మరొకటి సగానికి పైగా పూర్తయింది. ఇక హాలీవుడ్ సినిమా మాత్రం వదులుకోవాల్సిందే. ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న సినిమాలో ఆలియానే హీరోయిన్ అనే రూమర్స్ వచ్చాయి. […]
అలనాటి నటి, మీర్జాపురం రాజా సతీమణి శ్రీమతి కృష్ణవేణికి తను రాసిన ‘ఆటగదరా శివ’ పుస్తకాన్ని అందజేశారు నటుడు తనికెళ్ళ భరణి. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారు ఘటసాల శతజయంతి స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని కృష్ణవేణికి అందజేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భరణి. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్రసీమలో కృష్ణవేణి పాత్ర మరచిపోలేననిదని చెప్పారాయన. అంతే కాదు తను రాసిన ‘ఆటగదరా శివ’లోని పద్యాలను పాడి వినిపించారు.
ఘంటసాల శతజయంతి అంతర్జాతీయ ఉత్సవాలలో భాగంగా రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారు ఆదివారం ఉదయం అలనాటి నటి కృష్ణవేణిని ఘనంగా సన్మానించారు. అంతే కాదు ఘంటసాల శతజయంతి స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి కృష్ణవేణి నిర్మించిన ‘మనదేశం’, ‘కీలుగుర్రం’ చిత్రాలలో కృష్ణవేణి పాడిన పాటలను పాడి వినిపించటం విశేషం. ఈ కార్యక్రమంలో నటుడు, రచయిత తణికెళ్ల భరణి కూడా పాల్గొన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అటు పాలిటిక్స్ ఇటు సినిమాలతో యమ బిజీగా ఉన్నాడు. 2024లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో కమిట్ అయిన సినిమాలను చకాచకా పూర్తి చేసి ఆ తర్వాత 2023లో పూర్తిగా రాజకీయాలపై దృష్టిపెడతాడని వినిపించింది. ఇదిలా ఉంటే పవన్ కమిట్ మెంట్స్ లో హఠాత్తుగా మరో సినిమా యాడ్ అయింది. ఆల్ రెడీ పూజ కూడా జరుపుకుందని సమాచారం. దీనికి నటుడు, దర్శకుడు సముతిర ఖని దర్శకత్వం వహించబోతున్నాడు. ఇది తమిళంలో సముతిర […]
రణ్ బీర్ కపూర్ ని పెళ్ళాడిన ఆలియా భట్ గర్భవతి అని సోషల్ మీడియాలో ప్రకటించిన వెంటనే అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆలియా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ ఏడాది ఆడియన్స్ ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రచారంలో ఆలియా పాల్గొనవలసి ఉంది. ఇది కాకుండా రెడ్ చిల్లీస్ పతాకంపై షారూఖ్ భార్య గౌరీఖాన్ తో కలసి ఆలియా నిర్మిస్తున్న ‘డార్లింగ్స్’ షూటింగ్ పూర్తి చేసుకుంది. ముందు థియేటర్ రిలీజ్ అనుకున్నప్పటికీ ప్రస్తుతం […]
కిచ్చా సుదీప్ నటించిన పాన్ ఇండియా త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’ వచ్చే నెల 28న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్ర పోషించింది. ఇటీవల ట్రైలర్ విడుదలైనప్పుడు ముంబై, బెంగళూరులో జరిగిన మీడియా సమావేశాలకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హాజరైంది. కానీ ఆ తర్వాత జరిగిన కొచ్చి, చెన్నయ్, హైదరాబాద్ లోని ట్రైలర్ లాంచ్ కార్యక్రమాలకు ఆమె రాలేదు. ఇదే విషయాన్ని హైదరాబాద్ ప్రెస్ మీట్ […]
కిచ్చా సుదీప్ టైటిల్ రోల్ ప్లే చేసిన ప్రతిష్టాత్మక చిత్రం ‘విక్రాంత్ రోణ’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ పాన్ ఇండియా మూవీ జూలై 28న విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా ఇటీవల సోషల్ మీడియా ద్వారా ట్రైలర్ ను విడుదల చేసిన చిత్ర బృందం వ్యక్తిగతంగానూ అభిమానులను కలిసి, థియేటర్ లో త్రీ డీ ట్రైలర్ ను ఆవిష్కరించే పని పెట్టుకుంది. అందులో భాగంగా ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన […]