కే.వి.రెడ్డిగా జనం మదిలో నిలచిన కదిరి వెంకటరెడ్డి తెలుగు సినిమాకు వెలుగులు అద్దిన వారిలో మేటి అనిపించుకున్నారు. దర్శకునిగా, నిర్మాతగా కేవీ రెడ్డి తనదైన బాణీ పలికించారు.
కొందరికి సినిమా అయస్కాంతం లాంటిది. వారిలోని ప్రతిభ అనే ఇనుప రజను ఎక్కడికో వెళ్ళాలనుకున్నా, ఇక్కడికే ఆకర్షిస్తూ ఉంటుంది. తమ్మారెడ్డి భరద్వాజ తండ్రి కృష్ణమూర్తి చిత్రసీమలో అభిరుచిగల నిర్మాతగా సాగారు.
గత కొన్ని రోజులుగా మీడియాలో సింగింగ్ కపుల్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడాకులు తీసుకుంటున్నారంటూ ఓ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ ఇష్యూపై ఇప్పటి వరకూ మౌనంగా భరిస్తూ వచ్చిన జంట ఎట్టకేలకు సోషల్ మీడియాలో స్పందించింది. వీరిద్దరి మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు నెలకొన్నాయని, ఇద్దరు విడి విడిగా ఉంటున్నారని, విడాకులు తీసుకోబోతున్నారన్న రూమర్లకు చెక్ పెడుతూ ‘సెపెరేట్ అవుతున్నామనే న్యూస్ వచ్చినప్పటి నుంచి తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌తో పాటు యూట్యూబ్ వ్యూస్ […]
కమల్ హాసన్ లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ ‘విక్రమ్’. లోకేష్ కనకరాజ్ తెరకెక్కించిన ‘విక్రమ్’లో మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్, తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో నటించారు. అలానే క్లయిమాక్స్ లో సూర్య ఎంట్రీ ఇచ్చి, మూవీ గ్రాఫ్ ను మరింత హైట్స్ కు తీసుకెళ్ళాడు. హై ఆక్టేన్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకొచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళనాట హయ్యెస్ట్ గ్రాసర్ మూవీగా నిలిచింది. […]
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు మరోసారి తండ్రి అయ్యారు. ‘దిల్’ రాజు భార్య తేజస్విని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు తాజా సమాచారం. సినిమా పంపిణీ రంగం నుండి నిర్మాతగా మారిన ‘దిల్’ రాజు సూపర్ డూపర్ హిట్ చిత్రాలను నిర్మించారు. తెలుగుతో పాటు ఇటీవలే హిందీ చిత్రసీమలోకీ అడుగుపెట్టారు. కమర్షియల్ సక్సెస్ లనూ ఓ వైపు అందుకుంటూనే జాతీయ స్థాయిలో అవార్డులనూ పొందారు. నిర్మాతగా విజయపథంలో సాగుతున్న సమయంలోనే ‘దిల్’ రాజు సతీమణి అనిత 2017లో గుండెపోటుతో […]
కథలు కొత్తవి కనిపించక పోతే, పాత కథలనే కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తుంటారు మన దర్శకనిర్మాతలు. అలా తెలుగు చిత్రసీమలో పలు పాత కథలే కొత్తగా కనిపించే ప్రయత్నం చేశాయి. వాటిలో కొన్ని ఘనవిజయాలు సైతం సాధించాయి. తన చిత్రాలనే మళ్ళీ కాలానుగుణంగా మార్పులూ చేర్పులూ చేసి ప్రేక్షకులను రంజింప చేశారు దిగ్దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య. 1934లో సి.పుల్లయ్య దర్శకత్వంలో రూపొందిన ‘లవకుశ’ తెలుగు చిత్రసీమలో తొలి బిగ్ హిట్ గా నిలచింది. ఆ సినిమానే మరో […]