Venkaiah Naidu: అటల్ మోడీ సుపరిపాలన యాత్ర శుక్రవారం విజయనగరం చేరుకుంది. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నన్ను ఉప రాష్ట్రపతిగా ప్రకటించిన సమయంలో నేను కంటినీరు పెట్టుకున్నాను. మంత్రిగా తొలగించి ఉపరాష్ట్రపతి ఇస్తున్నందుకు బాధ పడుతున్నా అని అందరూ అనుకున్నారు. చిన్నతనంలో నా తల్లి చనిపోయారు.. కష్టంతో రాజకీయాల్లోకి వచ్చాను, బీజేపీ పార్టీ నన్ను తల్లిలా పెంచి పెద్దవాడిని చేసింది. ఉపరాష్ట్రపతి అయితే, ఆ తర్వాత పార్టీని వీడాలనే ఆలోచన ఆవేదన కలిగించింది. ఆ తర్వాత నేను ఏ పార్టీ కార్యక్రమాలకు వెళ్లలేదు. మాధవ్ నేతృత్వంలో అటల్ మోడీ సుపరిపాలన యాత్రకు రావాలని నన్ను కలిసి కోరారు. నేనే శ్రీకాకుళం, విజయనగరం వంటి ప్రాంతాలలో జరిగే సభలకు వస్తా అని చెప్పాను’ అని అన్నారు.
READ ALSO: Nara Lokesh: ఎవరికి ఎప్పుడు ముహూర్తం పెట్టాలో నాకు బాగా తెలుసు.. ఎవరినీ వదిలి పెట్టం!
నేను 16వ ఏట రాజకీయాల్లోకి వచ్చాను.. పోల్స్ ఎక్కి జెండాలు కట్టేవాడిని, ఆరోజు జట్కా బండి ఎక్కి అభ్యర్దులను గెలిపించాలని ప్రచారం చేసే వాడిని, వాజ్ పేయ్ గురించి గోడల మీద రాసి, మైకుల్లో ప్రచారం చేసి, ఆయనకు సహాయకుడిగా ఉన్న వ్యక్తికి.. అదే వాజ్‌పేయ్, అద్వానీ మధ్య అధ్యక్షుడి హోదాలో కూర్చునే అవకాశం నాకు మాత్రమే వచ్చింది. అదీ బీజేపీ గొప్పతనం, పని చేసేవారికి పార్టీలో ఎప్పుడూ గుర్తింపు ఉంటుంది. ఏ నాయకుడు అయినా విశాఖ వరకే వచ్చి మీటింగ్‌లు పెడతారు. ఓడిపోతారు, వెళ్లిపోతారు.. విజయనగరం జిల్లా చాలా మంచి జిల్లా. ఇక్కడ నుంచి చాలా మంది జాతీయ స్థాయి నేతలుగా ఎదిగారు. ప్రజల్లో ఉంటూ.. ప్రజామోదం కోసం పని చేసే నాయకులు ఉన్నారు. రాజకీయాల్లో పదవుల కోసం పోటీ చేయవచ్చు కానీ.. మచ్చ రాకుండా రాజకీయాలు చేసే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉన్నారు. అటు వంటి వారిలో అశోకగజపతిరాజు కూడా ముందు వరుసలో ఉంటారు. నేను, ఆయన కలిసి పని చేశాం.. ఎటువంటి మచ్చ లేకుండా ఆయన రాజకీయాలు చేశారు. నేటు అటల్ జీ సుపరిపాలన దినంగా డిసెంబర్ 25న భారీ కార్యక్రమం చేస్తున్నారు. దేశానికి అవసరమైన మంచి పాలన సురిపాలన, అట్టడుగున ఉండే వ్యక్తికి అవకాశం కల్గించే పాలన సుపరిపాలన, ప్రజలను ఇబ్బందులు పెట్టకుండా వారి సంక్షేమం గురించి ఆలచన చేయడం, మహిళలపై అత్యాచారు లేకుండా, అరాచకాలు, దౌర్జన్యాలు లేకుండా ఉండటం సుపరిపాలన. వేధింపులు లేకుండా ఉండే ప్రభుత్వాన్ని సుపరిపాలన అంటారు.
దేశం కోసం సర్వతోముఖాభివృద్ధి కోసం పని చేయడాన్ని సుపరిపాలన అంటారు. ఇటువంటి సుపరిపాలనకు వాజ్‌పేయ్ శ్రీకారం చుట్టారు. కాంగ్రెస్ యేతర తొలి ప్రధానిగా, విలువతో రాజకీయాలు చేశారు. ఒక్క అవినీతి మచ్చ లేకుండా పాలన సాగించిన ఏకైక నేత వాజ్‌పేయ్. ఈ దేశం మొత్తం ఒక్కటే అని భావన కలిగించేలా ఆయన పాలన సాగించారు. దేశంలో 32 పార్టీలను ఏకం చేసి.. ఒకతాటిపైకి తెచ్చి దేశాన్ని పాలించారు. ఆయన చూపించిన ఐకమత్యం, పరస్పర విశ్వాసం, ప్రజల కోసం చేసిన మంచిని గుర్తు చేసుకోవాలి. ఆయన విగ్రహాలుపెట్టి నమస్కారం పెట్టడం కాదు, ఆయన చూపిన సుపరిపాలనను మన పదవుల ద్వారా అమలు చేసి చూపాలి. బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు తప్పకుండా వాజ్‌పేయ్ గురించి తెలుసుకుని, ఆ విలువలను ఆచరించాలి. ఈ మూడు పార్టీల నేతలు నేడు చాలా చక్కగా మాట్లాడుతున్నారు.. సంతోషం అనిపించింది. నేను రాజకీయాల్లో లేను.. నేను వాజ్ పేయ్‌తో ఉన్న అనుబంధం కారణంగా వచ్చాను. నేను పదవీ విరమణ చేశాను.. పెదవీ విరమణ చేయలేదు కాబట్టి మాట్లాడుతూనే ఉంటాను.
READ ALSO: HCA Corruption Allegations: హెచ్‌సీఏపై బీసీసీఐకి ఫిర్యాదు చేసిన టీసీఏ..