Naga Chaitanya: విడాకులు, ఎఫైర్ రూమర్స్‌పై చైతూ మాట్లాడతాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని హీరో నాగ చైతన్య త్వరలో ‘థ్యాంక్యూ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. దాని తర్వాత అమీర్ ఖాన్ తో కలసి నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ కూడా విడుదల కానుంది. ఇప్పటికే ‘థ్యాంక్యూ’ ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. ఆమీర్ సినిమాకోసం కూడా భారీ ఎత్తున ప్రచారం చేయవలసి ఉంటుంది. మరి వ్యక్తిగత జీవితంలో సమంతతో విడాకులతో పాటు తాజాగా మరో హీరోయిన్ తో ఎఫైర్స్ అంటూ పుట్టుకువచ్చిన పుకార్ల గురించి మీడియా ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే గతంలో ‘లవ్ స్టోరీ’ ప్రమోషన్ టైమ్ లోనే సమంతతో విడిపోయినట్లు రూమర్స్ వచ్చినా చైతూ దాని గురించి మాట్లాడకూడదనే గట్టి నిర్ణయం తీసుకుని సైలెంట్‌గా ఉండి పోయాడు. ఆ చిత్రం విడుదలైన కొన్నాళ్లకే సమంత, చైతన్య డైవోర్స్ గురించి అధికారికంగా ప్రకటించారు. విడిపోయిన తర్వాత కూడా ‘బంగార్రాజు’ ప్రచారంతో మీడియా ముందుకు వచ్చినా విడాకుల గురించి ఒక్క మాట కూడా జారలేదు.
Read Also: This Week Movies: ఈవారం థియేటర్లు, ఓటీటీలలో విడుదలయ్యే చిత్రాలివే..!!
Also Read
ఇప్పుడు మరోసారి ‘థ్యాంక్యూ’ ప్రమోషన్ కోసం మీడియా ముందుకు చైతూ వస్తున్నాడు. సో ముందులాగే ఈ సారి కూడా విడాకులతో పాటు కొత్త ఎఫైర్ గురించి మాట్లాడటానికి ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే నాగచైతన్య ఎప్పుడూ డిగ్నిఫైడ్‌గా ఉండటానికే ఇష్టపడతాడు. ఒక్కటి మాత్రం నిజం. ఇంతకు ముందు మీడియా ముందుకు వచ్చినపుడు మౌనంగా ముభావంగా ఉన్న నాగచైతన్య ఇప్పుడు మాత్రం చిరునవ్వుతో సంతోషంగా కనిపిస్తున్నాడు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సమంత తమ విడాకులకు కారణం ఏమిటో కరణ్ జోహార్ షో లో చెప్పిందంటూ ప్రచారం జరుగుతోంది. ఒక వేళ అదే నిజం అయితే నాగచైతన్య కూడా మాట్లాడక తప్పదు. టాలీవుడ్ మీడియా ముందు మౌనం వహించినా… బాలీవుడ్ మీడియా మాత్రం అంత తేలికగా వదలి పెట్టదు. మరి చైతూ విడాకులు, ఎఫైర్ రూమర్ పై పెదవి విప్పుతాడా. లెట్స్ వెయిట్ అండ్ సీ.
తాజావార్తలు
-
Anirudh Ravichander: రామ్ చరణ్ – సుకుమార్ మూవీలో అనిరుధ్.. డీఎస్పీని పక్కన పెట్టడానికి కారణం ఇదేనా?
-
Bangladesh: షేక్ హసీనాను గద్దె దించిన బంగ్లాదేశ్ నేత.. ఇప్పుడు CJP నిరసనలకు మద్దతు.!
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Maharashtra: పెళ్లి నిశ్చయం.. ప్రియురాలిని లోయలోకి తోసిచంపిన ప్రియుడు..
-
Drug Network Busted : గోవా–హైదరాబాద్ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. ప్రధాన సూత్రధారి క్రిస్టీ అరెస్ట్
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!