(జూలై 14న తనికెళ్ళ భరణి పుట్టినరోజు) నేడు నటునిగా తనదైన బాణీ పలికిస్తూ అందరినీ అలరిస్తోన్న తనికెళ్ళ భరణి కలం బలం తెలియాలంటే ఓ మూడు దశాబ్దాలు పైగా వెనక్కి వెళ్ళాలి. జనబాహుళ్యంలో ఉన్న పదాలతో పసందైన సంభాషణలు రాసి ఆకట్టుకున్నారు భరణి. ఇక నటనలో అడుగు పెట్టాక, తనకు లభించిన ప్రతి పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయాలనే తపించారు. ఇప్పటికీ ఆ తపనతోనే సాగుతున్నారాయన. అందుకే భరణి అభినయం జనానికి మొహం మొత్తలేదు. ఆయన కామెడీ […]
దర్శకునిగా రవిరాజా పినిశెట్టి జనాన్ని భలేగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా రీమేక్స్ తెరకెక్కించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారాయన. ‘చంటి, పెదరాయుడు’ వంటి రీమేక్స్ తో ఇండస్ట్రీ హిట్స్ ను సొంతం చేసుకున్నారాయన. వి.మధుసూదన రావు తరువాత ‘రీమేక్స్’లో కింగ్ అనిపించుకున్నది రవిరాజానే! రవిరాజా పినిశెట్టి 1949 జూలై 14న పాలకొల్లులో జన్మించారు. ఆయన తండ్రి పినిశెట్టి రామ్మూర్తి అనేక తెలుగు చిత్రాలకు రచన చేశారు. రవిరాజా పినిశెట్టి మనసు కూడా తొలి నుంచీ సినిమాలవైపే సాగింది. దాంతో […]
ప్రఖ్యాత నటదర్శకనిర్మాత రాజ్ కపూర్ తొలి నటవారసుడు రణధీర్ కపూర్. 1970లలో రణధీర్ కపూర్ హీరోగా నటించిన కొన్ని చిత్రాలు జనాన్ని భలేగా ఆకట్టుకున్నాయి. ఆ కోవకు చెందిన చిత్రం ‘జవానీ – దివానీ’. ఈ చిత్రంలో నాయికగా జయబాధురి నటించారు. తరువాతి రోజుల్లో జయబాధురి, తన బోయ్ ఫ్రెండ్ అమితాబ్ బచ్చన్ ను వివాహమాడారు. ఆ పై రాజ్ కపూర్, అమితాబ్ బచ్చన్ కుటుంబాల మధ్య బంధుత్వం కూడా కుదిరింది. అందువల్ల రణధీర్ కపూర్, జయబాధురి […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'పుష్ప' సినిమా మరో అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఈ చిత్రంపై ముందు నుంచి అల్లు అర్జున్ పెట్టుకున్న ప్రతీ నమ్మకం నిజం అవుతూనే ఉంది.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘సీతారామం’. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాలోని పాత్రలను వరుసగా పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ప్రతి పాత్రను వినూత్నంగా పరిచయం చేస్తుండటంతో మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇందులో అఫ్రీన్ పాత్రలో రష్మిక మందన్న నటిస్తుండగా, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ కనిపించనున్నారు. తాజాగా తరుణ్ భాస్కర్ పాత్రను బాలాజీగా పరిచయం చేశారు మేకర్స్. ఈ లుక్ లో కూల్ […]
ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ కల్పన, అభూత కల్పనతో సాగుతూనే సైన్స్ కూ పెద్ద పీట వేస్తూ చిత్రాలు రూపొందిస్తూ ఉంటాడు. తాజాగా నాసాలోని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చిత్రీకరించిన విశ్వంలోని అద్భుతమైన ఫోటోలను ఇలా విడుదల చేయగానే, అలా క్రిస్టఫర్ నోలాన్ ను హాలీవుడ్ జనాలు గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే, నోలాన్ తెరకెక్కించిన ‘ఇంటర్ స్టెల్లార్’లో కథ మొత్తం అంతరిక్షంలోని ఓ గ్రహం చుట్టూ తిరుగుతుంది. ఇది ఇలా ఉంటే క్రిస్టఫర్ సైతం […]
రామ్ గోపాల్ వర్మ్ తెరకెక్కించిన ‘అమ్మాయి’ సినిమా ఈ శుక్రవారం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, చైనీస్ భాషల్లో విడుదల అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టిన పూజా భాలేకర్ మీడియాతో మాట్లాడింది. చిన్నతనం నుండి మార్షల్ ఆర్ట్స్ మీద తాను ఫోకస్ పెట్టాను తప్పితే నటి కావాలని అనుకోలేదని పూజా తెలిపింది. బ్రూస్ లీ ప్రేరణతో వర్మ ‘లడకీ’ సినిమా తీయాలని అనుకుని తనను అప్రోచ్ అయ్యారని, ఆయన ఆఫీస్ […]
విలక్షణ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వం వహించిన ‘పిశాచి’ తెలుగు, తమిళ భాషల్లో చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడు మిస్కిన్ ‘పిశాచి2’ తో ప్రేక్షకుల ముందుకు మరోసారి వస్తున్నారు. ఇది ‘పిశాచి’కి సీక్వెల్ కాదు. అయితే అదే జోనర్‌లో తెరకెక్కుతోంది. ‘పిశాచి’ చిత్రంలో కొత్త నటీనటులతో వచ్చింది. అయితే రెండవ ఫ్రాంచైజీలో ఆండ్రియా జెరెమియా, విజయ్ సేతుపతి, సంతోష్ ప్రతాప్, పూర్ణ లాంటి స్టార్స్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ‘దిల్’ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ […]
సీనియర్ స్టార్ హీరో నాగార్జున ‘ది ఘోస్ట్’ మూవీలో నటిస్తుంటే… పక్కన కర్ణాటకలోని మరో స్టార్ హీరో శివ రాజ్ కుమార్ ‘ఘోస్ట్’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. అలానే ఆ మధ్య నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’తో జనం ముందుకు వస్తే… ఇప్పుడు తమిళనాడులో శరవణన్ ‘ది లెజెండ్’ పేరుతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. శరవణన్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద తానే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, కామెడీ […]
కొరటాల శివ నిన్న మొన్నటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడు. అయితే ఒక్క సినిమాతో ఆయన పరిస్థితి తలక్రిందులు అయింది. రచయితగా ‘భద్ర, మున్నా, నిన్ననేడు రేపు, ఒక్కడున్నాడు, సింహా, బృందావనం, ఊసరవెల్లి’ సినిమాలకు పని చేసి ‘మిర్చి’తో దర్శకుడుగా మారాడు. ఈ సినిమా ఘన విజయం కొరటాలను అందలం ఎక్కించింది. ఆ తర్వాత ‘శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను’ సినిమాలతో టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. ఇన్ని సక్సెస్ లు ఉన్న […]