మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన వివాహం జరిగి దాదాపు పదేళ్ళవుతోంది. ఇంకా ఈ దంపతులు పిల్లలు వద్దనుకోవడానికి కారణం ఏమిటో అభిమానులకు అర్థం కావడం లేదు. దక్షిణాది సినీ స్టార్స్ ఫ్యాన్స్ తమ హీరోలకు వారసులు ఉండాలని, వారిని కూడా తాము అభిమానించాలని కోరుకుంటూ ఉంటారు. అందువల్ల తమ అభిమాన హీరో రామ్ చరణ్‌కు ఎప్పుడు పిల్లలు పుడతారా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉంది. అయితే ఆయన భార్య ఉపాసన ఇప్పటికే ఈ విషయమై పలుసార్లు […]
ప్రతాప్ పోతన్ అనగానే నటుడిగా అందరికీ గుర్తొచ్చే చిత్రం ‘ఆకలి రాజ్యం’, అలానే దర్శకుడిగా ‘చైతన్య’. నటుడిగా వైవిధ్యమైన పాత్రలు చేసిన ప్రతాప్ పోతన్ తెలుగులో చాలా కాలం గ్యాప్ తర్వాత ‘గ్రే’ సినిమాలో నటించారు. దానికి దర్శకుడు రాజ్ మాదిరాజు. యాక్టర్ కమ్ డైరెక్టర్ ప్రతాప్ పోతన్ హఠాన్మరణం ఆ చిత్ర బృందాన్ని షాక్ కు గురి చేసింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న గ్రే సినిమా విడుదల కావాల్సి ఉంది. ఈ మూవీ ట్రైలర్ […]
రజనీకాంత్ హిట్ సినిమాలలో ‘చంద్రముఖి’ ఒకటి. హారర్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా తమిళనాటనే కాదు తెలుగులోనూ ఘన విజయం సాధించంది. సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పి. వాసు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రానుంది. అయితే ఇందులో రజనీకాంత్ నటించటం లేదు. ఆయన వీరాభిమాని రాఘవ లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కేవలం తెలుగు హీరో మాత్రమే కాదు…. పాన్ ఇండియా స్టార్. అయితే… దానికంటే ముందు అతను టాలీవుడ్ తో పాటే మల్లూవుడ్ లోనూ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. అలా స్టెప్ బై స్టెప్ పరాయి రాష్ట్రాలలోనూ ఫ్యాన్ బేస్ ను పెంచుకుంటూ వచ్చిన అల్లు అర్జున్ తొలిసారి ‘పుష్ప’ మూవీతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఈ సినిమా ఉత్తరాదిలో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. […]
రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ది వారియర్’ మూవీతో తమిళ దర్శకుడు లింగుస్వామి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అయితే… ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళంలోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు. ఈ సినిమా తొలిరోజున వరల్డ్ వైడ్ రూ. 8.73 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసినట్టు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా శుక్రవారం సంస్థ కార్యాలయంలో సక్సెస్ సెలబ్రేషన్స్ ను జరుపుకున్నారు. హీరో రామ్, విలన్ పాత్రధారి ఆది పినిశెట్టి, […]
శివ నిర్వాణ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా నటించిన ‘మజిలీ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది దివ్యాంశ కౌశిక్. అందులోని అన్షు పాత్రతో కుర్రకారు హృదయాలను దోచుకుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. అలానే దివ్యాంశ కౌశిక్ తన నటనా నైపుణ్యంతో ప్రశంసలు అందుకుంది. తరువాత ఆమె సిద్దార్థ్ నటించిన ‘టక్కర్’ సినిమాతో తమిళంలో అరంగేట్రం చేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రవితేజ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ […]
అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ ‘ఏజెంట్’ టీజర్ విడుదలైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్న ‘ఏజెంట్’తో బాలీవుడ్ బ్యూటీ సాక్షి వైద్య టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ విడుదల చేసిన టీజర్‌లో కూడా మమ్ముట్టీ ఎంట్రీతోనే మొదలైంది. ఆ తర్వాత ‘ఏజెంట్’ గురించి అతను చెప్పే మాటలతో అఖిల్ ఎంట్రీ జరిగింది. వైరి […]
స్తాద్ రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా నటించిన ‘ది వారియర్’ చిత్రం గురువారం జనం ముందుకు వచ్చింది. లింగుస్వామి దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి ‘గురు’ అనే ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. అల్లు అర్జున్ ‘సరైనోడు’లో వైరం ధనుష్ అనే స్టైలిష్ విలన్ గా నటించిన ఆది, ‘ది వారియర్’లో పూర్తి కాంట్రాస్ట్ ఉన్న మాస్ విలన్ ‘గురు’ గా ఇందులో నటించాడు. ఈ సినిమా గురించి, అందులో తన పాత్ర […]
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘సీతా రామం’. ప్రతిష్ఠాత్మక వైజయంతి మూవీస్ సంస్థలో అశ్వినీ దత్ నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్ట్ 5న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతోంది. దర్శకుడు హను రాఘవపూడి 1965 యుద్ధ నేపధ్యంలో ప్రేమకావ్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విశేషం ఏమంటే… ఈ సినిమాలో ఎంతో మంది పేరున్న నటీనటులు నటించారు. వారిందరి పాత్రలను స్పెషల్ మోషన్ పోస్టర్స్ తో గత […]
యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం పుట్టిన రోజు ఇవాళ! దాంతో అతను నటిస్తున్న సినిమాల ప్రొడక్షన్స్ హౌసెస్ నుండి విషెస్ చెబుతూ స్పెషల్ పోస్టర్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగా ‘రూల్స్ రంజన్’ టీమ్ సైతం తమ హీరోకి బర్త్ డే విషెస్ తెలిపింది. ఎ. ఎం. రత్నం సమర్పణలో నిర్మితమౌతున్న ఈ చిత్రంలో ‘డి. జె. టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ను ఎ. […]