ప్రస్తుతం యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. రాజావారు రాణిగారు సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కిరణ్.. ఆ తర్వాత SR కళ్యాణ మండపం సినిమాతోను మంచి విజయాన్ని అందుకున్నాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ‘సెబాస్టియన్’ కాస్త నిరాశపరిచింది. అలాగే ఇటీవల వచ్చిన ‘సమ్మతమే’ కూడా సో సోగానే నిలిచింది. దాంతో ఎలాగైనా సరే హిట్ కొట్టి మరోసారి తన సత్తా చాటాలనుకుంటున్నాడు కిరణ్. అందుకు తగ్గట్టే.. కిరణ్ […]
ప్రముఖ ఎంటర్టైన్మెంట్ వెబ్ పోర్టల్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ యాప్ జ్యాపి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టింది. జ్యాపి యాప్ ని రూపొందించిన ఉదయ్ కోలా, విజయ్ శేఖర్ అన్నే, కృష్ణ గొర్రెపాటి ‘జ్యాపి స్టూడియోస్’ పేరుతో నిర్మాణ సంస్థని స్థాపించారు. ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్, సీనియర్ ప్రొడ్యూసర్ కె. ఎల్. దామోదర్ ప్రసాద్, ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ కొల్లి రామక్రిష్ణ, రాజా రవీంద్ర తదితరులు ముఖ్య అతిధులుగా బ్యానర్ లాంచ్ […]
ఇటీవల వరుసగా ‘డాక్టర్, డాన్’ సినిమాలో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ తదుపరి ‘మహావీరుడు’గా రాబోతున్నాడు. శుక్రవారం తన తాజా సినిమాను యాక్షన్ ఎపిసోడ్ తో పరిచయం చేస్తూ టైటిల్ రివీల్ చేశాడు. ఇది ద్విభాషా. మావీరన్ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి మడోన్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. మేకర్స్ ప్రకటన వీడియోను ఈరోజు విడుదల చేశారు. తమిళ, తెలుగు భాషల్లో రానున్న ఈ సినిమాకు తమిళంలో ‘మావీరన్’ […]
గతంలో విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ పలు కథనాలు వెలువడ్డాయి. అప్పట్లో రశ్మిక పదే పదే విజయ్ ఇంటికి వెళ్ళడం, పండగలలో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో గడపటం వంటివి అందుకు నిర్ధారణగా సోషల్ మీడియా కథనాలు వండి వార్చింది. దీనిని విజయ్ ఖండించటంతో కథనాలు ఆగిపోయాయి. అయితే తాజాగా మరోమారు ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. దానికి కాఫీ విత్ కరణ్ షో వేదికగా మారింది. కాఫీ […]
సీనియర్ నటుడు ప్రతాప్ పోతన్ ఈ రోజు ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 70 సంవత్సరాలు. నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా, రచయితగా చిత్ర పరిశ్రమలో కొనసాగారు ప్రతాప్ పోతన్ 1951లోతిరువనంతపురంలోజన్మించారు. నటి రాధిక ప్రతాప్ పోతన్ మొదటి భార్య. పెళ్ళైన సంవత్సారానికే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అమల సత్యనాధ్ ను పెళ్ళి చేసుకున్నారు ప్రతాప్ పోతన్. వీరికి ఓ కుమార్తె. ఊటీలో చదువుకున్న ప్రతాప్ పోతన్ కు ఆరంభంలో పెయింటింగ్ […]
అసలే సినిమాల వైపు జనం పరుగులు తీయడం మానేశారని విశేషంగా వినిపిస్తోంది. అందుకు ఓటీటీ ఎఫెక్ట్ కారణమనీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మన భారతీయ సినిమాలకు హాలీవుడ్ కామిక్ మూవీస్ కూడా దెబ్బ కొడుతున్నాయని తెలుస్తోంది. అందుకు జూలై 7న విడుదలైన మార్వెల్ మూవీ ‘థోర్: లవ్ అండ్ థండర్’ తాజా ఉదాహరణ అని చెప్పవచ్చు. ఈ సినిమా మన దేశంలో మొదటివారానికి రూ. 78 కోట్లు పోగేసింది. నిజానికి ఇంతకు ముందు వచ్చిన కామిక్ బేస్డ్ […]
మన దేశంలో తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధి పాత్ర పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రాయోజిత కార్యక్రమాల్లో దర్శన మిచ్చారు. అలాగే ఆమె పాత్ర సైతం అనేక పీరియాడిక్ మూవీస్ లో కనువిందు చేసింది. తాజాగా ఇందిరాగాంధి పాలన తీరు తెన్నులపై రూపొందుతోన్న ‘ఎమర్జెన్సీ’ చిత్రంలో కంగనా రనౌత్ ఇందిరా గాంధిగా నటించబోతోంది. ఇందిర పాత్రలో కంగన తన గెటప్ ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి ఎంతోమంది నెటిజన్స్ ను ఆకట్టుకుంటోంది. ఈ […]