తొలి సినిమా ‘ఉప్పెన’తో ఉవ్వెత్తున ఎగసి పడ్డాడు పంజా వైష్ణవ్ తేజ్. అయితే రెండో సినిమా ‘కొండ పొలం’ టక్కున క్రింద పడేసింది. దాంతో కొంత గ్యాప్ తీసుకుని మూడో సినిమా ‘రంగ రంగ వైభవంగా’తో రాబోతున్నాడు వైష్ణవ్ తేజ్. రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాతో మళ్ళీ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు. విడుదలైన టీజర్ తో పాటు పాటలు సినిమాపై నమ్మకాన్ని పెంచాయి. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 2న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాతలు […]
మన తెలుగు సినిమాకు ఇటీవల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పెరిగింది. ఇంతకు ముందు టాప్ హీరోల సినిమాలే విదేశాలలో విడుదల అయ్యేవి. ఇక అమెరికాలో అయితే మన కంటే ఓ రోజు ముందే రిలీజ్ అవుతుండేవి. అయితే మారిన పరిస్థితుల్లో అలా ఓ రోజు ముందు ప్రదర్శించటం వల్ల తెలుగు రాష్ట్రాలలో ఆ యా సినిమాల ఫలితాలు ప్రభావితం చేస్తున్నాయి. సాంకేతికత పెరిగిన నేపథ్యంలో షో ఆరంభం అయిన నిమిషం నుంచే అలా ఉంది.. ఇలా […]
ముంబై ఉగ్రదాడులలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా అడివి శేష్ హీరోగా ‘మేజర్’ చిత్రాన్ని తీసి విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు శశికిరణ్ తిక్కా. జూన్ 3న పాన్ ఇండియా మూవీగా విడుదలైన ‘మేజర్’ అన్ని చోట్లా సక్సెస్ సాధించటంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సినిమా హిందీ, తెలుగు వెర్షన్ లలో తొలి రెండు స్థానాల్లో నిలిచివారం రోజుల పాటు ట్రెండింగ్ లో […]
ఎండయినా, వానయినైనా, చలి అయినా – ఏదో ఒక రూపేనా మనిషిని కదలించి వేస్తుంటాయి. వానకు పరవశించి పోవడం ఓ చోట – వరదకు కుంగిపోవడం మరో చోట కనిపిస్తుంది. చెమటలు కక్కించే ఎండల్లోనూ హుషారుగా సాగేవారు కొందరయితే, ఎండదెబ్బకు అనారోగ్యం పాలు కావడమూ కనిపిస్తుంది. చలిలో గిలిగిలికి గురయ్యేవారు కొందరయితే, ఆ చలి తీక్షణమై చితికిపోయినవారూ ఉంటారు. ఇలా అన్ని కాలాలు కొందరికి ప్రమోదం, మరికొందరికి ప్రమాదంగా పరిణమిస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఆగని వానలకు కొన్ని […]
పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇస్మార్ట్ శంకర్’తో సూపర్ డూపర్ హిట్ ను అందుకున్న రామ్ ఆ తర్వాత ‘రెడ్’ మూవీ చేశాడు. ఇప్పుడు లింగు స్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ నెల 14న విడుదల కాబోతున్న ‘ది వారియర్’తో రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. పూరి, లింగుస్వామి గురించి రామ్ చెబుతూ, ”వీరిద్దరూ ట్రెండ్ సెట్టర్స్. వేరే కథలు డిస్కస్ చేస్తున్నప్పుడు కూడా ఆ కథలు కనెక్ట్ కావడం లేదు గానీ… […]
హీరో విశాల్, డైరెక్టర్ ఎ. వినోద్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లాఠీ’. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఆగస్ట్ 12న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ సమయంలో విశాల్ కు పలు గాయాలు కావడంతో అనుకున్న సమయానికి ఈ చిత్రం పూర్తి కాలేదు. అలానే ఫైట్ సీక్వెన్స్ కు సంబంధించిన వి.ఎఫ్.ఎక్స్. వర్క్ సైతం పెండింగ్ లో పడిపోయింది. దీంతో సినిమా విడుదలను సెప్టెంబర్ 15కి వాయిదా […]
స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రమ్మణ్యం తనయుడు, గాయకుడు ఎస్పీ చరణ్ తాజాగా తెలుగులో ‘సీతారామం’ చిత్రంలో రెండు పాటలు పాడాడు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. యుద్థ నేపథ్యంలో తెరకెక్కిన ఈ అందమైన ప్రేమకథకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఇందులోని ‘ఓహ్ సీతా…’, ‘ఇంతందం’ గీతాలు ఇప్పటికే విడుదలై చార్ట్ బస్టర్ గా నిలిచాయి. వీటిని పాడింది ఎస్పీ చరణ్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ”నేను […]
ప్రముఖ యు ట్యూబర్, బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ ఓటీటీ ఫ్లాట్ ఫై ఎంట్రి ఇస్తున్నాడు. ఆహాలో ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ పేరుతో వెబ్ సీరీస్ చేస్తున్నాడు. ఈ వెబ్ సీరీస్ టీజర్ ను అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సీరీస్ లో మొత్తం 10 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి వారం ఒక్కో కొత్త ఎపిసోడ్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసింది ఆహా. డిటెక్టీవ్ కావాలని ప్రయత్నించే సంతోష్ డిటెక్టీవ్ ఏజెన్సీలో చేరతాడు. అక్క […]
చిత్ర పరిశ్రమలో టైటిల్ వివాదం అనేది అప్పుడప్పుడు ఎదురయ్యే సంఘటన. తాజాగా టైటిల్ విషయంలో వివాదం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో ‘ద ఘోస్ట్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా గ్లింప్స్ ను కూడా ఇటీవల విడుదల చేశారు. ద కిల్లింగ్ మిషన్ పేరుతో ఈ గ్లింప్స్ విడుదల చేశారు. సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి, నార్త్ స్టార్ ఎంటర్ […]
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కొత్త చిత్రానికి ‘ఘోస్ట్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. జులై 12 బుధవారం పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. పాన్ ఇండియా సినిమాగా కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కనుంది. ‘బీర్బల్’ దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని రాజకీయనాయకుడు, నిర్మాత సందేశ్ నాగరాజ్ సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా […]