తెలుగు చిత్రసీమలో ‘గురువు గారు’ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది దర్శకరత్న దాసరి నారాయణరావు పేరే! తరువాత చప్పున ఆయన శిష్యగణం కూడా మన స్మృతిపథంలో మెదలుతారు. వారిలో కోడి రామకృష్ణ ముందుగా కనిపిస్తారు. వెనువెంటనే రేలంగి నరసింహారావు గుర్తుకు వస్తారు. ఆ తరువాతే ఎవరైనా! అలా గురువుకు తగ్గ శిష్యులు అనిపించుకున్నారు దాసరి శిష్యులు. రేలంగి నరసింహారావు తెలుగులోనే కాదు కన్నడనాట కూడా తనదైన బాణీ పలికించడం విశేషం. కామెడీతో కబడ్డీ ఆడేస్తూ కలెక్షన్ల […]
Krishnam Raju: కృష్ణంరాజు 'రెబల్ స్టార్'గా జేజేలు అందుకోకముందు ఆయన హీరోగా నటించిన అనేక చిత్రాలలో సాఫ్ట్ రోల్స్ లోనే కనిపించారు. అందుకు కారణం అంతకు ముందు ఆయన పలు సినిమాల్లో విలన్ గానూ, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లోనూ కనిపించి, జనాన్ని జడిపించడమే!
Mega Power Star Ramcharan: మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ సెప్టెంబర్ 28తో నటునిగా పదిహేనేళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఆయన హీరోగా రూపొందిన తొలి చిత్రం `చిరుత` 2007 సెప్టెంబర్ 28న జనం ముందు నిలచింది. ప్రేక్షకుల మదిని గెలిచింది. మెగాస్టార్ చిరంజీవి తనయునిగా రామ్ చరణ్ ను తెరపై చూడాలని తపించిన అభిమానులకు `చిరుత` చిత్రం ఆనందం పంచింది. అదే సమయంలో చిరంజీవి రాజకీయ ప్రవేశం గురించి ఆంధ్రప్రదేశ్ అంతటా ఆసక్తి నెలకొని ఉంది. దాంతో […]
Lata Mangeshkar: కాశ్మీరం మొదలు కన్యాకుమారి దాకా విస్తరించిన భరతావనిని తన మధురగానంతో అలరించిన గానకోకిల లతా మంగేష్కర్. లతా మంగేష్కర్ పాట మనకు లభించిన ఓ వరం అనే చెప్పాలి. ఆ పాటతోనే పలు తరాలు అమృతపానం చేశాయి. ఆ పాటతోనే ఎందరో గాయనీమణులు తమ గళాలకు మెరుగులు దిద్దుకున్నారు. ఈ నాటికీ లత పాటతోనే ప్రతిదినం పరవశించి పోయేవారు ఎందరో ఉన్నారు.
God Father: మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'గాడ్ ఫాదర్' దసరా కానుకగా అక్టోబర్ 5న జనం ముందుకు రానుంది. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనంత పూర్ లో సెప్టెంబర్ 28వ తేదీన జరగనుంది.