Scrub Typhus: తిరుపతిలో ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Scrub Typhus: తిరుపతి చంద్రగిరి(మం) తొండవాడలో ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్ సోకింది. బాలిక కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. చంద్రగిరి సీహెచ్‌సీ, అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రక్తపరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్‌గా వైద్యులు నిర్ధారించారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు, వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
READ MORE: Smart Phone Price Hike: మొబైల్ ఫోన్లు కొనేవారికి బిగ్ షాక్..
Also Read
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
- Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
స్క్రబ్ టైఫస్ అంటే ఏంటి?
స్క్రబ్ టైఫస్‌ను బుష్ టైఫస్ అని కూడా అంటారు. ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా వల్ల స్క్రబ్ టైఫస్ వస్తుంది. ముందుగా ఇది ఎలుకలకు సోకుతుంది. వాటిని కుట్టిన నల్లిపైకి ఆ సూక్ష్మజీవులు చేరతాయి. నల్లి మనల్ని కుట్టినప్పుడు స్క్రబ్ టైఫస్ మనుషులను సోకుతుంది. దట్టమైన చెట్లు, వ్యవసాయ భూముల పక్కన నివసించే వారిపై దీని ప్రభావం ఎక్కువగా ఉండగలదు. అధికంగా రాత్రి సమయాల్లో ఈ పురుగులు మనుషులను కుడుతుంటాయి. కుట్టినచోట మచ్చలతోపాటు దద్దుర్లు ఉంటాయి. దీనిపై ప్రజల్లో అంతగా అవగాహన లేదు. తమిళనాడులో మారుతున్న వాతావరణ పరిస్థితులు స్క్రబ్ టైఫస్ వ్యాప్తికి దోహదం చేస్తున్నాయి.
స్క్రబ్ టైఫస్‌ని ఎలా గుర్తించాలి?
చర్మంపై కాలిన మచ్చలు, జ్వరం వంటి ప్రాథమిక లక్షణాలు గుర్తించిన వెంటనే అప్రమత్తమవ్వాలి. వెంటనే డాక్టర్‌ని సంప్రదించాలి. ‘ఎలిసా’ అనే రక్తపరీక్ష ద్వారా దీన్ని గుర్తించొచ్చు. పీసీఆర్ వంటి మాలిక్యులార్ టెస్ట్ ద్వారా కూడా శరీరంలో బ్యాక్టీరియా ఉన్నట్లు గుర్తించేందుకు అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!