Khushboo: ఖుషీ చేసిన ఖుష్బూ నటన!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Khushboo Birthday Special: ఇప్పుడంటే ఖుష్బూ కేరెక్టర్ రోల్స్ లో కనువిందు చేస్తున్నారు కానీ, అప్పట్లో ఆమె అందం అనేక చిత్రాలలో చిందులు వేసి కనువిందు చేసింది. ఉత్తరాదిన ఉదయించిన ఖుష్బూ అందం, దక్షిణాది చిత్రాలతోనే వెలుగులు విరజిమ్మింది. తమిళ చిత్రసీమలో అనేక ఘనవిజయాలను చూసింది ఖుష్బూ. తమిళ జనం ఖుష్బూకు గుడి కట్టి పూజలు చేయడం ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకున్నారు.
ఖుష్బూ అసలు పేరు నఖత్ ఖాన్. 1970 సెప్టెంబర్ 29న ముంబయ్ లో జన్మించారామె. బాలనటిగా “ద బర్నింగ్ ట్రెయిన్, లావారిస్, కాలియా, దర్ద్ కా రిస్తా” వంటి చిత్రాలలో నటించిన ఖుష్బూ, అనిల్ కపూర్ ‘మేరీ జంగ్’లో “బోల్ బేబీ బోల్…” పాటలో చిందులతో ఆనందం పంచింది. జాకీ ష్రాఫ్ జోడీగా ‘జానూ’లో మురిపించింది. ఈ సినిమాల తరువాత వెంకటేశ్ హీరోగా నటించిన తొలి చిత్రం ‘కలియుగ పాండవులు’లో నాయికగా నటించి అలరించారు ఖుష్బూ. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తరువాత “కిరాయి దాదా, కెప్టెన్ నాగార్జున, త్రిమూర్తులు, చిన్నోడు పెద్దోడు, చిన్నికృష్ణుడు, గురుశిష్యులు, అలజడి, శాంతి క్రాంతి, పేకాట పాపారావు” వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు ఖుష్బూ. అయితే తమిళనాట హీరో ప్రభుకు హిట్ పెయిర్ గా సాగారు. వారిద్దరూ నటించిన ‘చిన్న తంబి’ బంపర్ హిట్. ఆ సినిమా ఆధారంగానే తెలుగులో వెంకటేశ్ ‘చంటి’ రూపొందింది. తమిళంలో అనేక విజయాలను చూసిన ఖుష్బూ తరువాత కేరెక్టర్ రోల్స్ లో అలరించారు.
Also Read
చాలా రోజుల తరువాత తెలుగులో చిరంజీవి ‘స్టాలిన్’లో ఆయనకు అక్కగా నటించారు ఖుష్బూ. ‘యమదొంగ’లో యమునిగా నటించిన మోహన్ బాబుకు జంటగా కనిపించారు. ‘అజ్ఞాతవాసి’లో హీరోకు సవతి తల్లిగా అభినయించారు. ఈ యేడాది ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ అనే తెలుగు చిత్రంలోనూ ఖుష్బూ నటించారు. తమిళ దర్శకుడు సి.సుందర్ ను వివాహమాడిన ఖుష్బూకు ఇద్దరు పిల్లలు. రాజకీయాల్లోనూ అడుగు పెట్టిన ఖుష్బూ మొదట్లో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారు. చిత్రంగా అదే పార్టీలో చేరి మొన్న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. అయితే హిందుత్వ సంఘాలే ఖుష్బూను వ్యతిరేకించడం గమనార్హం. ఈ ఎన్నికలో ఖుష్బూ ఓటమి చవిచూశారు. ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారామె. తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేయాలని ఈ నాటికీ తపిస్తూనే ఉన్నారు ఖుష్బూ.
తాజావార్తలు
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!