Hemalatha Lavanam: గ్రేట్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ మాజీ భార్య!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హేమలతా లవణం! ప్రముఖ దళిత రచయిత గుర్రం జాషువా కుమార్తె! అంతేకాదు… నాస్తికోద్యమ నిర్మాత గోరా కోడలు!! గోరా తనయుడు లవణంను వివాహం చేసుకున్న సామాజిక సంస్కర్త. మరీ ముఖ్యంగా స్టువర్ట్ పురం దొంగలలో పరివర్తన తీసుకురావడానికి విశేషమైన కృషి చేసిన నారీమణి. ఆ పాత్రను వెండితెరపై పోషించే గొప్ప అవకాశం పవన్ కళ్యాణ్ మాజీ భార్య, నటి, దర్శక నిర్మాత రేణు దేశాయ్ కు లభించింది. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘టైగర్ నాగేశ్వరరావు’. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పిస్తున్నారు.
Also Read
- Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
- Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
- Sigma Telugu Release: తెలుగు రాష్ట్రాల్లో సందీప్ కిషన్ ‘సిగ్మా’ భారీగా రిలీజ్.. మైత్రి, ఎన్వీఆర్ చేతికి థియేట్రికల్ రైట్స్!
- Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
1970 స్టువర్ట్‌పురం నేపధ్యంలో పేరు మోసిన దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ గా ఇది రూపొందుతోంది. ఇందులో రేణు దేశాయ్ హేమలతా లవణం పాత్రను పోషిస్తోంది. ఆమె పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ ఈ రోజు ఒక చిన్న వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఈ వీడియోలో రేణు దేశాయ్ తెల్లచీరలో కనిపించే మరో ఇద్దరు మహిళా కార్యకర్తలతో కలిసి రోడ్డుపై నడుస్తూ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చారు. జి.వి. ప్రకాష్ కుమార్ బిజిఎమ్ పాత్రను మరింత ఎలివేట్ చేసింది. నూపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్ సైతం కీలక పాత్ర పోషించిన ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
తాజావార్తలు
-
Daayra: కరీనా కపూర్ ‘దాయరా’ దిశా కేసు ఆధారంగా తెరకెక్కిందా?
-
Ishan Kishan: ఇషాన్ కిషన్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, అభిషేక్‌లను వెనక్కి నెట్టి.. భారత తరఫున రెండో బ్యాటర్‌గా!
-
Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
-
Rajpal Yadav: కోర్టులోనూ నటిస్తున్నారా?.. రాజ్‌పాల్ యాదవ్‌పై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు, రూ.2 కోట్లు కట్టాల్సిందే!
-
IRCTC Tatkal Ticket Booking: తత్కాల్ టికెట్ బుకింగ్.. ఈ చిట్కాలు పాటిస్తే సీటు పక్కా..!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!