ఎదురుగా ఎంతటి మహానటులు ఉన్నా, అదరక బెదరక ఇట్టే ఆకట్టుకొనే అభినయంతో అలరించే బాలలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో నవ్వుల పువ్వులు పూయించే ఆలీ స్థానం ప్రత్యేకమైనది.
Rekha: మరో రెండేళ్ళకు అక్షరాలా ఏడు పదులు చూడనుంది ఆ అందం! అయినా ఆ అందం తలచుకున్న రసికులకు శ్రీగంధాలు పూస్తూనే ఉంది. ఆ అందం పేరు రేఖ! అందానికి అందం అన్నట్టుగా అలరిస్తోన్న రేఖ దక్షిణాదిలోనే నటనలో ఓనమాలు దిద్దుకున్నారు. ఉత్తరాదిన అందాల అభినయంతో ఆకట్టుకున్నారు. అనేక హిందీ చిత్రాలలో రేఖ అందాలతో విందు చేస్తూ జనం మదిలో చెరగని ముద్ర వేశారు.
Trivikram@20: ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ అనగానే... 'ఓ ఆయనా.... మాటల మాంత్రికుడు... మా గురూజీ... ఎందుకు తెలియదు!?' అంటారు. తెలుగు సినిమా ప్రేక్షకులకు త్రివిక్రమ్ పట్ల ఉన్న గౌరవంతో కూడిన అభిమానం అది.
30 years Of Aapadbandhavudu: కళాతపస్వి కె.విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ముచ్చటగా మూడు చిత్రాలు వెలుగు చూశాయి. వారి కలయికలో రూపొందిన తొలి చిత్రం ‘శుభలేఖ’ 1982లో జనం ముందు నిలచింది. 1987లో రెండో చిత్రంగా ‘స్వయంకృషి’ ప్రేక్షకులను అలరించింది. 1992 అక్టోబర్ 9న మూడో సినిమాగా ‘ఆపద్బాంధవుడు’ విడుదలయింది. ఈ మూడు చిత్రాలు చిరంజీవిలోని నటుడికి ప్రేక్షకులు పట్టాభిషేకం చేసేలా చేశాయనే చెప్పాలి. ఈ మూడు చిత్రాల్లోనూ చిరంజీవి నటునిగా ఒక్కో మెట్టూ […]
V.V.Vinayak Birthday: వినాయక్ అంటే విక్టరీ… విజయమంటే వినాయక్ అన్న రీతిలో సాగిన దర్శకుడు వి.వి.వినాయక్. తెలుగులో పలువురు టాప్ స్టార్స్ తో బంపర్ హిట్స్ చూసిన వినాయక్ ప్రస్తుతం హిందీ చిత్రసీమలో తొలి అడుగు వేస్తున్నారు. తన మిత్రుడు రాజమౌళి తెలుగులో రూపొందించిన బ్లాక్ బస్టర్ ‘ఛత్రపతి’ ఆధారంగా హిందీలో వినాయక్ తన తొలి సినిమాను తెరకెక్కిస్తున్నారు. తనను దర్శకునిగా పరిచయం చేసిన నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు హీరో సాయి శ్రీనివాస్ ను ఈ […]
SP Sailaja Birthday Special: ఒక కొమ్మకు పూచిన పూలు దాదాపు ఒకేలా ఉన్నట్టే శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి సంతానంలో ఆయనలాగే ఇద్దరికి గానం ప్రాణమయింది. వారే ప్రఖ్యాత గాయకులు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఆయన చెల్లెలు ఎస్.పి.శైలజ. తండ్రి సాంబమూర్తి హరికథ చెప్పడంలో మేటి అనిపించుకుంటే, ఆయన పిల్లలు చిత్రసీమలో తమ గాత్రంతో జైత్రయాత్ర చేశారు. బాలు చెల్లెలు అన్న గుర్తింపుతోనే సినిమా రంగంలో అడుగు పెట్టినా, తన గళ విన్యాసాలతో శైలజ సైతం జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నారు. […]
బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేస్తూ పికెఎకె ఫిలిమ్స్ నిర్మిస్తున్న సినిమాకు 'బ్లాక్ డాగ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవల తన పరిచయం గురించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన బాడీ లాంగ్వేజ్ విషయంలో విపరీతంగా ట్రోల్ కి గురయ్యాడు చంద్రహాస్.