Rekha: అందానికి అందం… ఎందరికో బంధం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rekha: మరో రెండేళ్ళకు అక్షరాలా ఏడు పదులు చూడనుంది ఆ అందం! అయినా ఆ అందం తలచుకున్న రసికులకు శ్రీగంధాలు పూస్తూనే ఉంది. ఆ అందం పేరు రేఖ! అందానికి అందం అన్నట్టుగా అలరిస్తోన్న రేఖ దక్షిణాదిలోనే నటనలో ఓనమాలు దిద్దుకున్నారు. ఉత్తరాదిన అందాల అభినయంతో ఆకట్టుకున్నారు. అనేక హిందీ చిత్రాలలో రేఖ అందాలతో విందు చేస్తూ జనం మదిలో చెరగని ముద్ర వేశారు.
తెలుగునటి పుష్పవల్లి, తమిళ స్టార్ హీరో జెమినీగణేశన్ కు 1954 అక్టోబర్ 10న రేఖ జన్మించారు. పుష్పవల్లికి దర్శకులు వేదాంతం రాఘవయ్య సమీపబంధువు. ఆయన దర్శకత్వంలో యన్టీఆర్ హీరోగా రూపొందిన ‘ఇంటిగుట్టు’లో నాలుగేళ్ళ ప్రాయంలో రేఖ బాలనటిగా కనిపించింది. ఆ తరువాత బి.యన్. రెడ్డి. దర్శకత్వంలో రూపొందిన ‘రంగుల రాట్నం’లో ‘దశావతారాల’ను వర్ణిస్తూ సాగే పాటలో ముద్దుగా మురిపించింది రేఖ. మొదట్లో సన్నగా పీలగా ఉన్న రేఖ తరువాత ముద్దుగా బొద్దుగా తయారయింది. 15 ఏళ్ల వయసులోనే తన బొద్దు అందాలతో మురిపిస్తూ రాజ్ కుమార్ హీరోగా రూపొందిన కన్నడ చిత్రం ‘ఆపరేషన్ జాక్ పాట్ నల్లి సి.ఐ.డి. 999’లో నాయికగా నటించారు రేఖ. అందులో బికినీలో తడి అందాలతో రేఖ అలరించిన తీరును ఇప్పటికీ అభిమానులు మరచిపోలేరు. ఆపై హిందీ చిత్రసీమలో నవీన్ నిశ్చల్ తో కలసి ‘సావన్ భాదో’లో నటించారు. తెలుగులో ‘అమ్మకోసం’ చిత్రంలో కృష్ణంరాజుకు జోడీగా అభినయించారు. ఉత్తరాది చిత్రాలలోనే తన లక్ పరీక్షించుకోవాలని ఆశించారు రేఖ. ఆరంభంలో రేఖ నటించిన అనేక చిత్రాలలో ఆమె బొద్దుగానే కనిపించారు. దక్షిణాది భామలు బొద్దుగానే ఉంటారని రేఖను చూసి కామెంట్ చేసేవారు. దానిని ఓ సవాల్ గా తీసుకొని, తరువాతి రోజుల్లో యోగసాధనతో నాజూకు షోకులు సొంతం చేసుకున్నారు రేఖ.
Also Read
- Hero Sanjosh : బ్లైండ్ ఫౌండేషన్ అమ్మాయిలతో రాఖీ వేడుకలు జరుపుకున్న హీరో సంజోష్
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
ఆ నాటి మేటి హిందీ కథానాయకుల సరసన నాయికగా నటించి మురిపించారు రేఖ. 1973లో అప్పటి క్రేజీ హీరో వినోద్ మెహ్రాను రేఖ వివాహమాడినట్టు వార్తలు గుప్పుమన్నాయి. వాటిని అటు వినోద్ మెహ్రా కానీ,ఇటు రేఖ కానీ ఖండించలేదు. దాంతో వినోద్ మెహ్రాను రేఖ పెళ్ళాడిందనే ఇప్పటికీ చాలామంది నమ్ముతూ ఉంటారు. తరువాతి రోజుల్లో మెహ్రా ఆ వార్తలో నిజం లేదని చెప్పారు. ఆపై అమితాబ్ బచ్చన్ తో రేఖ ప్రేమాయణం కూడా వార్తల్లో నిలచింది. ఆ విధంగా కూడా రేఖకు క్రేజ్ లభించింది. అమితాబ్ బచ్చన్ సరసన రేఖ నటించిన “మిస్టర్ నట్వర్ లాల్, ముఖద్దర్ కా సికందర్” వంటివి ఆకట్టుకున్నాయి. అప్పటి దాకా అందాలతోనే కనువిందు చేసిన రేఖ 1981లో ‘ఉమ్రావ్ జాన్’లో నటిగానూ తనదైన బాణీ పలికించి జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా నిలిచారు. అనేక మంది దిగ్దర్శకుల చిత్రాలలో రేఖ ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో అలరిస్తూనే ఉన్నారామె. ఆ మధ్య ‘సూపర్ నాని’లోనూ రేఖ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు.
దక్షిణాది తారల్లో శ్రీదేవి, జయసుధ, సౌందర్య వంటివారు హిందీలో నటించిన చిత్రాల్లో వారి పాత్రలకు రేఖ డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇక హృషీకేశ్ ముఖర్జీ తెరకెక్కించిన ‘ఖూబ్ సూరత్’ చిత్రం ఆమెకు నటిగా మంచి మార్కులు సంపాదించి పెట్టింది. అందులో ఆర్.డి.బర్మన్ స్వరకల్పనలో “ఖేడా ఖేడా…” అనే పాటనూ ఆలపించి, గాయనిగా మారారు రేఖ. తరువాతి రోజుల్లో “అగర్ తుమ్ నా హోతే…’ చిత్రంలోనూ ఆర్డీ బర్మన్ బాణీలలోనే రూపొందిన “కల్ తో సండే కీ చుట్టీ…” అనే పాటను పాడారు రేఖ. ఖయ్యూమ్ సైతం తన స్వరకల్పనలో ‘ఏక్ నయా రిస్తా’ సినిమా కోసం రేఖతో “ఎహ్ సాస్ కా సౌదా హై…” పాట పాడించారు. ఇక రేఖ యోగాభ్యాసంతో రూపొందిన ‘రేఖాస్ మైండ్ అండ్ బాడీ టెంపుల్’ అప్పట్లో విశేషాదరణ చూరగొంది. ఒకప్పుడు అందాల భామగా, ఆపై అందాల ఆంటీగా, ఈ మధ్య అందాల అమ్మమ్మగానూ రేఖ అలరిస్తున్నారు. ఆమె మరిన్ని పుట్టినరోజులు ఆనందంగా జరుపుకోవాలని ఆశిద్దాం!
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!