దివంగత గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి కలం నుంచి ఎన్నో స్ఫూర్తి దాయకమైన పాటలు జాలువారాయి. ప్రేక్షకులను ప్రభావితం చేసే పాట రాయాలంటే సీతారామశాస్త్రిని మించిన ఆప్షన్ మరొకటి లేదనేది చిత్రసీమలోని దర్శక నిర్మాతల అభిప్రాయం. ఆయన కెరీర్లో ఎన్నో అద్భుతమైన, ప్రభావవంతమైన పాటలు అందించారు. అలాంటి లెజెండరీ రైటర్ కలం నుంచి చివరిసారిగా జాలువారిన స్ఫూర్తి దాయక గీతం ‘పక్కా కమర్షియల్’లో ఉండటం విశేషం. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో […]
శర్వానంద్ ఏ ఒక్క జానర్‌కు ఫిక్స్ కాకుండా విభిన్న కథలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం అతను ‘ఒకే ఒక జీవితం’ మూవీలో చేస్తున్నాడు. అందులో శర్వా తల్లిగా అమల నటిస్తుంటే, రీతువర్మ హీరోయిన్ గా చేస్తోంది. ఇదిలా ఉంటే శర్వానంద్ నటిస్తున్న మరో సినిమా ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ విడుదల తేదీ కన్ ఫర్మ్ అయ్యింది. ఫిబ్రవరి 25న విడుదల కావాల్సిన పాన్ ఇండియా మూవీ ‘విక్రాంత్ రోణ’ వాయిదా పడటంతో అదే రోజున శర్వానంద్ […]
యంగ్ డైరెక్టర్ పన్నా రాయల్ దర్శకత్వంలో హేసన్ పాషా నిర్మిస్తున్న మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘ఇంటి నెం.13’. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ఫస్ట్‌లుక్, టీజర్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అలాగే ఇటీవల ఈ సినిమా కోసం శ్రీయా ఘోషల్ పాడిన ‘పో పోవే…’ అనే పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాట అందర్నీ ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. తాజాగా ‘ఇంటి నెం. 13’ చిత్రంలోని మరో […]
రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం ‘రియల్ దండుపాళ్యం’. మహేష్ దర్శకత్వంలో సి. పుట్టస్వామి ఈ చిత్రం నిర్మించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ లాబ్స్ ట్రైలర్ ట్రైలర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన తెలుగు నిర్మాతల మండలి కార్యదర్శి టి. ప్రసన్న కుమార్ మాట్లాడుతూ, ”ఈ ‘రియల్ దండుపాళ్యం’లో మహిళలు వారిపై జరిగే అకృత్యాలు, అన్యాయాలపై తిరగబడితే […]
జస్ట్ ఆర్డినరి బ్యానర్ లో అనసూయ , విరాజ్ అశ్విన్ నటించిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం గత ఏడాది విడుదలై చక్కని గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అదే బ్యానర్ లో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రెండో సినిమా రాబోతోంది. జస్ట్ ఆర్డినరి బ్యానర్ పై రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. […]
జి. ఎం.ఎస్. గ్యాలరీ ఫిల్మ్స్ బ్యానర్ పై జి. ఎం సురేష్ నిర్మాత గా మను పి.వి. దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘స్వ’. మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కరణం శ్రీరాఘవేంద్ర సంగీతాన్ని సమకూర్చారు. సినిమా గురించి నిర్మాత సురేశ్ మాట్లాడుతూ, ”ఇప్పటికే మూవీ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటుంటోంది. నిన్న ‘కన్నుల్లోన…’ […]
జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ నటించిన ‘గుడ్ లక్ సఖి’ చిత్రం ఎట్టకేలకు విడుదలైంది. గత యేడాదిన్నరగా ఇదిగో అదుగో అంటూ ఊరిస్తూ వచ్చిన ఈ సినిమా మొత్తానికి జనవరి 28న జనం ముందుకు వచ్చింది. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నగేశ్ కుకునూరు దర్శకత్వంలో సుధీర్ చంద్ర పదిరి నిర్మించిన ఈ సినిమాకు ‘దిల్’ రాజు సమర్పకుడు కావడం విశేషం. తెలంగాణ మారుమూల పల్లెలోని లంబాడీ యువతి సఖి (కీర్తి సురేశ్). ఆమె ఏం […]
(జనవరి 28న బి.విఠలాచార్య జయంతి) తెలుగు చిత్రసీమలో ఎన్నెన్నో జానపద చిత్రాలు జనాన్ని విశేషంగా అలరించాయి. వాటిలో జానపద బ్రహ్మ బి. విఠలాచార్య. తెరకెక్కించిన చిత్రాలు ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాయి. కన్నడ నాట పుట్టి, తమిళనాట అడుగుపెట్టి తెలుగువారిని విశేషంగా అలరించే చిత్రాలు రూపొందించారు విఠలాచార్య. చిత్రవిచిత్రమైన చిత్రాలు రూపొందించి ఆకట్టుకున్న విఠలాచార్య జీవితంలోకి తొంగి చూస్తే, అదీ అలాగే అనిపిస్తుంది. ఉడిపి తాలూకాలోని ఉడయవరలో జన్మించిన విఠలాచార్య చదివింది కేవలం మూడవ తరగతి. చిన్నతనం నుంచీ […]
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సంక్రాంతి సీజన్ లో విడుదల కావాల్సిన పాన్ ఇండియా చిత్రాల విడుదల వాయిదా పడటంతో ప్రభుత్వం కూడా ఈ విషయమై నింపాదిగానే నిర్ణయం తీసుకొనేలా కనిపిస్తోంది. పలువురు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు దర్శక నిర్మాతలు ఆర్. నారాయణమూర్తి, రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి పేర్ని నానిని వ్యక్తిగతంగా కలిసి తమ వాదన వినిపించారు. అలానే ఏపీ […]
(జనవరి 24న దర్శకనిర్మాత సుభాష్ ఘై బర్త్ డే)నటులు కావాలని కలలు కని, తరువాత మెగాఫోన్ పట్టి మ్యాజిక్ చేసిన వారు ఎందరో! అలాంటి వారిలో సుభాష్ ఘైని మరవకుండా పేర్కొనాలి. నటనతో జనాన్ని ఆకట్టుకోవాలని కలలు కన్న సుభాష్ ఘై దర్శకత్వంతో జనం నాడిని పట్టి సినిమాలు తెరకెక్కించారు. సుభాష్ రూపొందించిన అనేక చిత్రాలు తెలుగులోనూ రీమేక్ అయి ఆకట్టుకున్నాయి. సుభాష్ ఘై 1945 జనవరి 24న సుభాష్ ఘై నాగ్ పూర్ లో జన్మించారు. […]