(జనవరి 24న సి.ఉమామహేశ్వరరావు పుట్టినరోజు)తెలుగు చిత్రసీమలో అభిరుచి గలిగి, ఏ నాడూ రాజీపడని దర్శకులు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో సి.ఉమామహేశ్వరరావు చోటు సంపాదించారు. ‘అంకురం’ ఉమామహేశ్వరరావుగా జనం మదిలో స్థానం దక్కించుకున్నారాయన. సదా విలువలకు పెద్ద పీట వేస్తూ సాగారాయన. బహుశా, అందువల్లేనేమో సి.ఉమామహేశ్వరరావు కమర్షియల్ సక్సెస్ ను అంతగా సొంతం చేసుకోలేక పోయారు అనిపిస్తుంది. తెలుగునేలపై కృష్ణమ్మ ఒడిలో 1952 జనవరి 24న కన్ను తెరచిన సి.ఉమామహేశ్వరరావు ఆ తల్లి గలగలలు వింటూ సాహిత్యంపై […]
(జనవరి 24న నటి కృష్ణకుమారి వర్ధంతి)అందాల రాజకుమారి పాత్రల్లో అలరించిన నాయికలు ఎందరో ఉన్నారు. కానీ, కృష్ణకుమారిలా మురిపించిన వారు అరుదనే చెప్పాలి. జానపద కథానాయకులుగా యన్టీఆర్, కాంతారావు రాజ్యమేలుతున్న రోజుల్లో వారి సరసన కృష్ణకుమారి పలు చిత్రాలలో నాయికగా నటించి మురిపించారు. ముఖ్యంగా బి.విఠలాచార్య జానపద చిత్రాల్లో అనేక సార్లు రాజకుమారిగా నటించి మురిపించారు కృష్ణకుమారి. అందుకే ఈ నాటికీ అందాల రాజకుమారిగా జనం మదిలో నిలచిపోయారు కృష్ణకుమారి. కృష్ణకుమారి 1933 మార్చి 6న జన్మించారు. […]
సంక్రాంతి సీజన్ లో ఎన్టీవీ ఎంటర్ టైన్మెంట్ తన వ్యూవర్స్ ముందుకు సరికొత్త కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. అదే ‘ఫన్ ఫీస్ట్ విత్ అషూ రెడ్డి’! ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఫస్ట్ వీక్ దేత్తడి హారిక మనసులోని మాటల్ని వ్యూవర్స్ ముందు ఆవిష్కరింప చేసింది అషూ రెడ్డి. సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఎపిసోడ్ లో జనం ముందుకు వస్తోంది తేనెకళ్ళ సోయగం దివి వైద్య! బిగ్ బాస్ సీజన్ […]
దాదాపు యేడాదిన్నర క్రితం అన్నపూర్ణ స్టూడియోస్, జీ 5, స్పెక్ట్రమ్ మీడియా నెట్ వర్క్ కాంబినేషన్లో రూపుదిద్దుకుంది ‘లూజర్’ వెబ్ సీరిస్. కరోనా ఫస్ట్ వేవ్ పీక్స్ లో ఉండి, థియేటర్లు మూతపడిన టైమ్ లో అంటే… 2020 మే 15న ‘లూజర్’ ఫస్ట్ సీజన్ కు సంబంధించిన మొత్తం పది ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అయ్యాయి. మళ్ళీ ఇంతకాలానికి అదే వెబ్ సీరిస్ సీజన్ 2కు సంబంధించిన ఎనిమిది ఎపిసోడ్స్ శుక్రవారం నుండి జీ 5లో స్ట్రీమింగ్ […]
ఎక్కడైనా మంచికి ఉన్న విలువ, చెడుకు ఎప్పటికీ లభించదు. మన పురాణాల్లోనూ ఉత్తములకు ఉన్న విలువ, అధములకు ఏ మాత్రం దక్కదు. అయితే ఉత్తములకు కీడు కలిగించిన వారి పేర్లు కూడా వారితో పాటు మననం చేసుకోవలసి వస్తుంది. ఈ ముచ్చట దేనికోసమంటే, మన పురాణాల్లోనే కాదు, తరువాత కూడా రామ అన్న పదానికి ఉన్న విలువ, రామునికి కీడు చేసి, ఆ కారణంగా చనిపోయిన రావణుడి పేరుకు లేదని చెప్పడానికే! ఇప్పటికీ రావణ అన్న పేరు […]
నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ చిత్రం పలు రికార్డులు నమోదు చేసింది. ప్యాండమిక్లోనూ విజయవంతంగా అర్ధశతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగానూ అఖండ నిలచింది. ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ పలు అరుదైన రికార్డులను నమోదు చేసుకున్నారు. ఈ సినిమా విడుదలైన తరువాత బాలకృష్ణ నటవిశ్వరూపం గురించి చర్చోపచర్చలు మొదలయ్యాయి. మొన్నటి దాకా బాలయ్య అంటే ముక్కోపి, అభిమానులను సైతం కొడుతూ ఉంటాడు అన్న మాటలు పక్కకు పోయాయి. అఖండ చిత్రాన్ని ఒంటిచేత్తో ఆయన విజయపథంవైపు […]
హీరోగానూ, స్టార్ కమెడియన్‌గానూ ప్రేక్షకులను అలరిస్తున్న సప్తగిరి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ‘యజ్ఞం’, ‘పిల్లా… నువ్వు లేని జీవితం’ వంటి విజయవంతమైన సినిమాలు తీసిన ఎ. ఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వంలో సప్తగిరి ఓ సినిమా చేయబోతున్నాడు. రిగ్వేద క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ వన్ గా ఎ. ఎస్. రిగ్వేద చౌదరి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. నిర్మాత ఎ.ఎస్. రిగ్వేద చౌదరి మాట్లాడుతూ “వినూత్న కథాంశంతో రూపొందిస్తున్న […]
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ చిత్రం గత యేడాది అక్టోబర్ 1వ తేదీ జనం ముందుకు వచ్చింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని చిత్ర నిర్మాతలు ఆ చిత్రాన్ని ఆ రోజున విడుదల చేశారు. భారత రాజకీయ వ్యవస్థతో ఓ ఐ.ఎ.ఎస్. అధికారి తలపడితే ఎలాంటి పర్యావసానం ఎదుర్కోవాల్సి వచ్చిందనేది ప్రధానాంశంగా దేవ కట్టా ‘రిపబ్లిక్’ చిత్రం తెరకెక్కించాడు. అప్పటికి కొద్ది రోజుల ముందు మోటర్ బైక్ యాక్సిడెంట్ తో గాయాల పాలై చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ […]
పొద్దున్నే ప్రముఖ దర్శకనిర్మాత రామ్ గోపాల్ వర్మ దృష్టి, స్టార్ కపుల్ ధనుష్, ఐశర్వ విడాకుల మీద పడినట్టుగా ఉంది. సహజంగా పెళ్ళంటే పడని వర్మ ఎప్పటిలానే పెళ్ళి – దాని పర్యవసానాలపై నాలుగైదు ట్వీట్స్ పెట్టేశాడు. బట్ ఆ పోస్టులు, దానికి వచ్చిన స్పందన వర్మకు పెద్దంత కిక్ ఇచ్చినట్టు లేవు. ఇక మెగా ఫ్యామిలీ మీద పడ్డాడు. ‘అంగీకరించడానికి కష్టంగా ఉన్నా ఇక ‘అల్లు’ అనేది కొత్త ‘మెగా’! అంటూ కామెంట్ పెట్టాడు. దీంతో […]
విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు నందమూరి తారకరాముడు మహాభినిష్క్రమణ చేసి అప్పుడే 26 ఏళ్ళయింది. అయినా ఆయనను మరచినవారు లేరు. అన్నగా జనం గుండెల్లో నిలిచారు. తెలుగు చిత్రపరిశ్రమకు ‘పెద్దాయన’గా నిలచిన నటరత్న యన్టీఆర్ నా అనుకున్నవారిని ఆదుకున్న తీరును ఈ నాటికీ సినీజనం తలచుకుంటూ ఉన్నారు. అలా ఆయన అభిమానంతో వెలుగులు విరజిమ్మిన వారెందరో. తెరపై అనేక మార్లు శ్రీకృష్ణ పరమాత్మగా నటించి అలరించారు రామారావు. ఆపదలో ఉన్న భక్తులను ఆదుకొనే కన్నయ్యగా నటించడమే కాదు, నిజజీవితంలోనూ యన్టీఆర్ […]