జస్ట్ ఆర్డినరి బ్యానర్ లో అనసూయ , విరాజ్ అశ్విన్ నటించిన ‘థాంక్యూ బ్రదర్’ చిత్రం గత ఏడాది విడుదలై చక్కని గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అదే బ్యానర్ లో మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో రెండో సినిమా రాబోతోంది. జస్ట్ ఆర్డినరి బ్యానర్ పై రమేష్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్ నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్ 2 మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో నటించిన నటీనటుల వివరాలు త్వరలో చిత్ర బృందం తెలియజేయనుంది. భవిషత్తులో మరిన్ని కొత్త కాన్సెప్ట్ లతో జస్ట్ ఆర్డినరి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సినిమాలు తీస్తామని శరత్ చంద్ర రెడ్డి, తారక్ నాథ్ తెలిపారు.