‘పక్కా కమర్షియల్’లో ‘సిరివెన్నెల’ స్ఫూర్తి దాయక గీతం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దివంగత గేయ రచయిత ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రి కలం నుంచి ఎన్నో స్ఫూర్తి దాయకమైన పాటలు జాలువారాయి. ప్రేక్షకులను ప్రభావితం చేసే పాట రాయాలంటే సీతారామశాస్త్రిని మించిన ఆప్షన్ మరొకటి లేదనేది చిత్రసీమలోని దర్శక నిర్మాతల అభిప్రాయం. ఆయన కెరీర్లో ఎన్నో అద్భుతమైన, ప్రభావవంతమైన పాటలు అందించారు. అలాంటి లెజెండరీ రైటర్ కలం నుంచి చివరిసారిగా జాలువారిన స్ఫూర్తి దాయక గీతం ‘పక్కా కమర్షియల్’లో ఉండటం విశేషం. గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో టైటిల్ సాంగ్ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి రాశారు. ఈ నెల 31 ఈ పాటకు సంబంధించిన గ్లిమ్ప్స్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది చిత్ర బృందం. ఫిబ్రవరి 2 పూర్తి పాట ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సిరివెన్నెల’ చివరిసారి రాసిన జీవిత సారాంశం ఈ పాటలో ఉండడంతో దర్శకుడు మారుతి బాగా ఎమోషనల్ అవుతున్నారు.
‘జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు… జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు’ అంటూ సీతారామశాస్త్రి అత్యద్భుతంగా ఈ అందమైన పాట రాశారని, మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారని అనిపిస్తోందని దర్శకుడు మారుతీ అన్నారు. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు వున్నాయని.. జీవితం గురించి, పుట్టుక చావు గురించి అద్భుతమైన సాహిత్యం ‘పక్కా కమర్షియల్’ టైటిల్ సాంగ్ లో ఉంటాయని మారుతి చెప్పారు. ‘సిరివెన్నెల’ కలం నుంచి జాలువారిన చిట్టచివరి స్ఫూర్తిదాయక గీతం ఉన్న ‘పక్కా కమర్షియల్’ చిత్రాన్ని యు.వి. క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Also Read
తాజావార్తలు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
-
Cult : ఇండియాస్ ఫస్ట్ గ్లోబల్ స్లాషర్ ‘కల్ట్’ రిలీజ్ డేట్ ఫిక్స్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!