సినిమా టిక్కెట్ రేట్ల పరిశీలన కమిటీ ఫిబ్రవరి 2న మరోసారి సమావేశం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ రేట్ల విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సంక్రాంతి సీజన్ లో విడుదల కావాల్సిన పాన్ ఇండియా చిత్రాల విడుదల వాయిదా పడటంతో ప్రభుత్వం కూడా ఈ విషయమై నింపాదిగానే నిర్ణయం తీసుకొనేలా కనిపిస్తోంది. పలువురు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు దర్శక నిర్మాతలు ఆర్. నారాయణమూర్తి, రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి పేర్ని నానిని వ్యక్తిగతంగా కలిసి తమ వాదన వినిపించారు. అలానే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు చిరంజీవి ఆయన్ని ఇంటిలో కలిసి, విందు చేసి, చిత్రసీమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఆ సందర్భంగా ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి ప్రకటన రాకపోయినా, చిరంజీవి మాత్రం టిక్కెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మార్చి నెల నుండి భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా విడుదల కావచ్చునని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సినిమా టిక్కెట్ రేట్ల పరిశీలన కమిటీ మూడోసారి ఫిబ్రవరి 2న సమావేశం కాబోతోంది. ఇప్పటికే డిసెంబర్ 31, జనవరి 11 తేదీలలో కమిటీ రెండుసార్లు సమావేశమైంది. అయితే కమిటీలోని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సినిమా టిక్కెట్ రేట్లను నగర పంచాయితీలు, గ్రామ పంచాయితీలలో పెంచాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.
Also Read
- Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
- Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని 'శ్రీ రామ్‌లీలా మహాసంఘ్' డిమాండ్
- Ramayana: 'రామాయణం' ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
- Dhanush - SK : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్‌లో భారీ హైప్
తాజావార్తలు
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
-
TVS iQube Price Hike: టీవీఎస్ iQube ధర పెంపు.. 212KM రేంజ్, 32 లీటర్ల స్టోరేజ్.. కొత్త ధరలు ఇవే!
-
Ramayana : మరో వివాదంలో రామాయణ.. తమకు సినిమా చుపించాల్సిదేనని ‘శ్రీ రామ్‌లీలా మహాసంఘ్’ డిమాండ్
-
RBI MPC 2026: ఆర్‌బీఐ కీలక నిర్ణయం.. రెపో రేటు 5.25 శాతం వద్దే కొనసాగింపు.. హోమ్, పర్సనల్ లోన్స్ EMIలపై ఎలాంటి ప్రభావం?
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్‌తో Lava Probuds Xplore 25° TWS ఇయర్‌బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!