జి. ఎం.ఎస్. గ్యాలరీ ఫిల్మ్స్ బ్యానర్ పై జి. ఎం సురేష్ నిర్మాత గా మను పి.వి. దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సినిమా ‘స్వ’. మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఫిబ్రవరి 4వ తేదీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి కరణం శ్రీరాఘవేంద్ర సంగీతాన్ని సమకూర్చారు.
సినిమా గురించి నిర్మాత సురేశ్ మాట్లాడుతూ, ”ఇప్పటికే మూవీ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటుంటోంది. నిన్న ‘కన్నుల్లోన…’ అంటూ సాగే పాటను విడుదల చేశాం. దానికి మంచి స్పందన లభిస్తోంది. ఈ పాటను వినోద్ శర్మ, నాదప్రియ పాడగా సంగీత దర్శకుడు కరణం శ్రీ రాఘవేంద్ర దానిని రాశారు. సినిమా సెన్సార్ కార్యక్రమాలు సైతం పూర్తయ్యాయి. సినిమా చూసిన సెన్సార్ అధికారులు మా టీమ్ ను అభినందించారు. సో… రేపు ప్రేక్షకులు సైతం మా చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం కలిగింది” అని అన్నారు.