అభిరుచి ఉండాలే కానీ, అనుభవంతో పనేంటి!? పట్టుమని తీసింది రెండంటే రెండే సినిమాలు. జనం నాడి ఇట్టే పట్టేశాడు. జనం కోరేదే మనం అందించాలని నిర్ణయించాడు. ‘మహానటి’ని తెరకెక్కించాడు. అంతే… ఆ ఒక్క సినిమాతోనే జనం మదిని భలేగా దోచేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పుడు నాగ్ అశ్విన్ అంటే అంతగా తెలియని వారు సైతం, ‘మహానటి’ డైరెక్టర్ అనగానే అతని పేరు చెప్పేస్తున్నారు. అంతలా పాపులర్ అయిన నాగ్ అశ్విన్ త్వరలోనే ప్రభాస్, దీపికా పదుకొణేతో […]
సమంత నటించిన తమిళ చిత్రం ‘కన్మణి రాంబో ఖతీజా’ ఈ నెల 28న తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇదే సమయంలో విజయ్ దేవరకొండ సరసన సమంత ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అది గురువారం పూజా కార్యక్రమాలతో మొదలై పోయింది. ఇక సమంత నటించిన ఉమెన్ సెంట్రిక్ ‘యశోద’ మూవీ ఆగస్ట్ 12, ఆ తర్వాత పాన్ ఇండియా మూవీ ‘శకుంతల’ విడుదల కాబోతున్నాయి. ఈ సంగతి ఇలా ఉంటే… సమంత శుక్రవారం […]
గతంలో ఎప్పుడూ టచ్ చేయని వైవిద్యభరితమైన కథాంశానికి, హై ప్రొడక్షన్ వాల్యూస్ జోడించి ‘విక్కీ: ది రాక్ స్టార్’ అనే పేరుతో డిఫరెంట్ మూవీని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ సి. ఎస్ గంటా. వర్దిని నూతలపాటి సమర్పణలో ఈ చిత్రాన్ని లెఫ్టినెంట్ శ్రీనివాస్ నూతలపాటి నిర్మిస్తున్నారు. విక్రమ్, అమృత చౌదరి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ‘విక్కీ: ది రాక్ స్టార్’ […]
మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ తన సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తోంది. సంవత్సరాలు గడుస్తున్నా బ్లడ్ డొనేషన్ కాన్సెప్ట్ ఇప్పటికీ అప్రతిహతంగా సాగిపోతోంది. చిరంజీవి అభిమానులే కాదు తెలుగు సినిమారంగంలోని నటీనటులు, మెగాఫ్యామిలీ హీరోలు తమ పుట్టిన రోజు సందర్భంగా బ్లడ్ ను డొనేట్ చేయడం అనేది ఓ బాధ్యతగా భావిస్తున్నారు. బహుశా పెదనాన్నను ఆదర్శంగా తీసుకున్నాడేమో పవన్ కళ్యాణ్ కొడుకు అకిర కూడా తొలిసారి బ్లడ్ ను డొనేట్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా […]
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ‘ఎఫ్ 3’ మూవీ షూటింగ్ పూర్తయ్యి విడుదలకు సిద్ధం కాగా, ‘గుర్తుందా శీతాకాలం’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్న ‘భోళా శంకర్’సెట్స్ పై ఉంది. అలానే ఈ అందాల చిన్నది హిందీలోనూ మూడు చిత్రాలలో నటిస్తోంది. ‘బోలే చుడియా’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. అలానే ‘ప్లాన్ ఎ ప్లాన్ బి’ సినిమా […]
ఓ స్టార్ హీరో మరో స్టార్ సినిమాకు గాత్రం అరువివ్వడం అభిమానులకు ఆనందం పంచే అంశమే! తెలుగునాట వాయిస్ ఓవర్ అనగానే ముందుగా మహేశ్ బాబు గుర్తుకు వస్తారు. ఆయన వ్యాఖ్యానంతో వెలుగు చూసిన సినిమాలు బాగానే సందడి చేశాయి. ఇప్పుడు మరోమారు మహేశ్ వాయిస్ ఓవర్ వినిపించబోతోంది. అదీగాక, ఆ సినిమా మెగాస్టార్ చిరంజీవి, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ఆచార్య’ కావడంతో ఫ్యాన్స్ కు మరింత సంబరంగా ఉంది. ‘ఆచార్య’ చిత్ర […]
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ నారాయణ దాస్ నారంగ్ అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే! ఆయనకు నివాళులు అర్పిస్తూ, తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘నారాయణ దాస్ నారాంగ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. సమస్య చిన్నదైనా, పెద్దదైనా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్య మళ్లీ రాకుండా […]
యువ హీరో కార్తికేయ, ‘డీజే టిల్లు’ ఫేమ్ నేహా శెట్టి జంటగా సినిమా రూపొందుతోంది. సైమా, ఆహా పురస్కార వేడుకల్లో బెస్ట్ డెబ్యూడెంట్ ప్రొడక్షన్ హౌస్ అవార్డులు అందుకున్న లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ‘కలర్ ఫొటో’, ‘తెల్లవారితే గురువారం’ తర్వాత ఆయన నిర్మిస్తున్న చిత్రమిది. సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. క్లాక్స్ దర్శకుడు. ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా ప్రారంభమైంది. కాన్సెప్ట్ పోస్టర్ విడుదల […]
‘అన్నీ మంచి శకునములే’ అనే ఓల్డ్ సాంగ్ ను నేచురల్ స్టార్ నాని హ్యాపీగా హమ్ చేసుకోవచ్చు. ఈ మధ్య నాని సినిమాలు పెద్దంతగా బాక్సాఫీస్ దగ్గర హంగామా సృష్టించకపోయినా… అతని మీద తెలుగు ప్రేక్షకులకు ఉన్న ఆదరాభిమానాల్లో ఎలాంటి మార్పూ లేదు. అందుకు తాజాగా నిన్న విడుదలైన ‘అంటే సుందరానికీ…’ టీజర్ కు లభిస్తున్న ఆదరణను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ హవా ఇలా వీస్తుండగానే మరో రికార్డ్ ఒకటి నాని ఖాతాలో జమ అయ్యింది. నాని, […]
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. సెట్స్ పైన పలు చిత్రాలు వివిధ దశల్లో ఉండగానే ఈ రోజు విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్ లో కొత్త సినిమాను ప్రారంభించింది. విశేషం ఏమంటే… ఈ నిర్మాణ సంస్థ నిన్నటి నుండి ఓ రకంగా విజయోత్సవాన్ని జరుపుకుంటోంది. బుధవారం నేచురల్ స్టార్ నానితో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘అంటే సుందరానికీ’ మూవీ టీజర్ ను విడుదల చేశారు. ఆ వేదికపైనే నాని […]