Shruti Haasan : హీరోయిన్‌గా కంటే ఐటంగర్ల్‌గా ఎక్కువ సంపాదిస్తున్న శృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శృతి హాసన్ స్పెషల్ సాంగ్ గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తోంది. హీరోయిన్‌గా కంటే ఐటమ్ సాంగ్స్ ద్వారానే శృతి ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తోందనే వార్తలు ఫిలిం సర్కిల్స్‌లో గుప్పుమంటున్నాయి. గతంలో ‘ఎవడు’ సినిమాలో రామ్ చరణ్, శృతి హాసన్ జోడీ ప్రేక్షకులను అలరించింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అదే సెంటిమెంట్‌ను ‘పెద్ది’ కోసం కూడా రిపీట్ చేయాలని చరణ్ స్వయంగా శృతిని రికమెండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ క్రేజీ సాంగ్ కోసం శృతి హాసన్ ఏకంగా 3.5 కోట్ల రూపాయల పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం శృతి హాసన్ ఒక సినిమాకు హీరోయిన్‌గా చేసే రెమ్యునరేషన్ రూ. 3 కోట్లు కూడా దాటలేదు. కానీ కేవలం ఒకే ఒక పాట కోసం ఇంత భారీ మొత్తం తీసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. హీరోయిన్‌గా నటిస్తే దాదాపు 30 నుంచి 40 రోజుల డేట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ స్పెషల్ సాంగ్ అంటే కేవలం 3 నుంచి 4 రోజుల్లో షూటింగ్ పూర్తయిపోతుంది. తక్కువ రోజులు పని చేసి హీరోయిన్ రెమ్యునరేషన్ కంటే ఎక్కువే సంపాదిస్తుండటంతో శృతికి ఇది ‘బంపర్ ఆఫర్’ అనే చెప్పాలి. ఇదివరకు ‘స్త్రీ 2’ లో తమన్నా, ‘కూలీ’లో పూజా హెగ్డే కూడా ఇలాగే ఒక పాట కోసం రూ. 3 కోట్ల వరకు ఛార్జ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు శృతి వారిని మించి ‘పెద్ది’ కోసం వసూలు చేస్తోందట. మేకర్స్ ఈ పాటను సాధారణ ఐటమ్ సాంగ్‌లా కాకుండా సినిమా కథలో కీలక మలుపు తిప్పే ఒక ‘స్పెషల్ క్రేజీ సాంగ్’గా రూపొందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం, శృతి హాసన్ ఎనర్జీ చరణ్ స్టెప్పులు కలిసి జూన్ 4న థియేటర్లలో రచ్చ చేయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
తాజావార్తలు
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!
-
AP Local Body Elections 2026: నేడు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. అధికారిక ప్రకటనపై ఉత్కంఠ!
-
12,070mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో హానర్ నుంచి పవర్ఫుల్ ఫోన్లు వచ్చేస్తున్నాయ్..!
-
VB-G RAM G : ఎట్టకేలకు 20 ఏళ్ల కష్టానికి ఫలితం.. ఉపాధి హామీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
-
Explainer: యువత ఆరోగ్యానికి “రాజకీయ” గండం.. వీడియోలు, వార్తలతో మనశ్శాంతి కోల్పోతున్న యూత్..!!
ట్రెండింగ్
-
Temba Bavuma: కెప్టెన్‌గా మొదటి ఓటమి.. ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించిన బవుమా..!
-
IND vs WI 4th T20I: నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20.. పిచ్ రిపోర్ట్, లైవ్ స్ట్రీమింగ్, ప్లేయింగ్ 11 ఇవే!
-
7 అంగుళాల Liquid Retina డిస్ప్లేతో ఇంటిని స్మార్ట్‌గా మార్చే Apple HomeView.. Siri AIతో అదిరిపోయే ఫీచర్లు..!
-
ఇక రిమోట్‌తో పనిలేదు.. వాయిస్‌తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్‌తో కొత్త Apple TV 4K లాంచ్..
-
World Standards Day : మనం కొనే వస్తువులు నాణ్యమైనవేనా? ప్రతి వస్తువు వెనుక ఉన్న అసలు కథ ఇదే.!