హాలీవుడ్ స్టార్ హీరోస్ బెన్ అఫ్లెక్, మ్యాట్ డామ్ కలసి తాజాగా ఓ స్పోర్ట్స్ డ్రామాలో నటించబోతున్నారు. గతంలో వీరిద్దరూ కలసి నటించిన “గుడ్ విల్ హంటింగ్, ద లాస్ట్ డ్యుయల్, చేజింగ్ అమీ, ద లీజర్ క్లాస్” చిత్రాలు వెలుగు చూశాయి. వీటిలో ‘గుడ్ విల్ హంటింగ్’ విశేషాదరణ చూరగొంది. ప్రస్తుతం బెన్, మ్యాట్ నటించబోయే స్పోర్ట్స్ డ్రామా రచనలో వీరిద్దరూ పాలు పంచుకోవడమే కాదు, నిర్మాణంలోనూ భాగస్వాములుగా ఉన్నారు. వీరికి అమెజాన్ స్టూడియోస్, స్కై […]
పెరుగుట విరుగుట కొరకే అంటూ ఉంటారు. అన్ని సందర్భాల్లో కాదు కానీ, కొన్ని విషయాల్లో ఇది నిజమవుతూ ఉంటుంది. స్ట్రీమింగ్ జెయింట్ అనిపించుకున్న నెట్ ఫ్లిక్స్ కు ఈ యేడాది తొలి క్వార్టర్ లోనే షాక్ తగిలినట్టయింది. ఎందుకంటే నెట్ ఫ్లిక్స్ లెక్కలు చూస్తే ఈ యేడాది మొదటి మూడు నెలల్లోనే లక్షలాది మంది సబ్ స్క్రైబర్స్ తగ్గినట్టు తేలింది. అయితే భారతదేశం, మరికొన్ని ఆసియా దేశాల్లో మాత్రం నెట్ ఫ్లిక్స్ దే హవా అని తెలుస్తోంది. […]
యాక్షన్ ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించడంలో రోహిత్ శెట్టిది ఓ ప్రత్యేక శైలి. అలానే ‘సింగం’ మూవీ నుండి కాప్ యాక్షన్ చిత్రాల్లోనూ తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు రోహిత్ శెట్టి. అలా వచ్చిన ‘సింగం రిటర్న్స్’, ‘సింబా’, ‘సూర్యవంశీ’ మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో ‘సింగం -3’ కూడా తెరకెక్కబోతోంది. ఇదిలా ఉంటే రోహిత్ శెట్టి ఇప్పుడు ఓటీటీ బాట పట్టాడు. ‘ఇండియన్ పోలీస్ ఫోర్స్’ పేరుతో సిద్ధార్థ్ మల్హోత్రాతో అమెజాన్ ప్రైమ్ కోసం […]
బుల్లితెరపై మురిపించి, వెండితెరపై వెలిగిపోయిన తారలు బాలీవుడ్ లో చాలామందే కనిపిస్తారు. వారిలో అందరికీ ముందుగా షారుఖ్ ఖాన్ గుర్తుకు వస్తారు. ఈ తరం వారికి మాత్రం ఆయుష్మాన్ ఖురానా చప్పున మదిలో మెదలుతారు. బాలీవుడ్ లో నటునిగా ఈ యేడాదితో పదేళ్ళు పూర్తి చేసుకున్నారు ఆయుష్మాన్. నటుడు, నిర్మాత జాన్ అబ్రహామ్ నిర్మించిన ‘విక్కీ డోనర్’తో తొలిసారి బిగ్ స్క్రీన్ పై మెరిశారు ఆయుష్మాన్ ఖురానా. ఆ సినిమా 2012 ఏప్రిల్ 20న జనం ముందు […]
అందాల భామలకు పెళ్ళయితే క్రేజ్ తగ్గుతుంది అని ఓ అపోహ! పాత రోజుల్లోనూ ఎంతోమంది గ్లామర్ క్వీన్స్ పెళ్ళయిన తరువాత కూడా అందచందాలతో సందడి చేసిన సందర్భాలు బోలెడున్నాయి. అయితే అభిమానులు ఆరాధించే అందగత్తెలందరూ ఓ ఇంటివారయిపోతే ఫ్యాన్స్ పరిస్థితి ఏమి కావాలి? అలియా భట్ పెళ్ళయిన తరువాత ఇప్పుడు బాలీవుడ్ లో అదే చర్చ సాగుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ అనదగ్గ ఆరుమందిలో అలియా భట్ అందరికన్నా చిన్నది. ఆమె కూడా రణబీర్ […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ చూసి నీరుగారి పోయిన ఆయన ఫ్యాన్స్ కు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘కేజేఎఫ్-2’ చూశాక ఆశలు చిగురించాయి. ‘కేజీఎఫ్-1’తోనే ఆల్ ఇండియా ఆడియెన్స్ మనసు దోచిన ప్రశాంత్ నీల్, రెండో భాగంతో మరింతగా జనాన్ని ఆకట్టుకుంటున్నారు. ఈ రెండు సినిమాలు నిర్మించిన విజయ్ కిరగండూర్, ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ‘సలార్’ తెరకెక్కిస్తున్నారు. అందువల్లే అభిమానుల్లో ఆశలు మళ్ళీ అంబరం వైపు సాగుతున్నాయి. ఇప్పటికే ‘కేజేఎఫ్-2’ […]
రచయితల టైటిల్ కార్డ్ చూసి కూడా జనం చప్పట్లు కొట్టే రోజులు అప్పట్లోనే ఉండేవి. అలా చప్పట్లు కొట్టించుకున్న రచయితల్లో త్రిపురనేని మహారథి సైతం చోటు సంపాదించారు. తెలుగు సినిమాల్లో ఒకప్పుడు ‘నేరుగా కథ చెప్పడమే’ ప్రధానంగా ఉండేది. కానీ, అందులోనూ స్క్రీన్ ప్లే ను చొప్పించి మరింత రంజింప చేయవచ్చునని కొందరు రచయితలు తలచారు. వీరందరూ పాశ్చాత్య చిత్రాల ప్రభావంతో అలా రాస్తున్నారనీ కొందరు విమర్శించేవారు. అయితే భవిష్యత్ లో ‘స్క్రీన్ ప్లే’కు విశేషమైన స్థానం […]
ఏప్రిల్ 20న ‘ఉమ్మడి కుటుంబం’కు 55 ఏళ్ళు మహానటుడు నటరత్న యన్.టి.రామారావు బహుముఖ ప్రజ్ఞ గురించి తెలియని తెలుగువారు ఉండరు. కేవలం నటునిగానే కాకుండా, నిర్మాతగా, దర్శకునిగా, కథకునిగా, స్క్రీన్ ప్లే రైటర్ గా, ఎడిటర్ గా యన్టీఆర్ సాగిన తీరు అనితరసాధ్యం అనిపించక మానదు. ఆయన కథలతో రూపొందిన పలు చిత్రాలు తెలుగు వారిని విశేషంగా అలరించాయి. యన్టీఆర్ కథ, స్క్రీన్ ప్లే సమకూర్చిన ‘ఉమ్మడి కుటుంబం’ చిత్రం సైతం విజయపథంలో పయనించి, అందరినీ అలరించింది. […]
డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీ మూవీస్ అనగానే అందులో వినోదంతో పాటు ఎంతో కొంత హృదయాలను తాకే అంశాలూ చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే ఆలోచింప చేసే విషయాలకూ స్థానం ఉండక పోదు. అంతేకాదు రాజ్ సినిమాలు బ్లాక్ బస్టర్స్ గానూ జేజేలు అందుకుంటూ ఉంటాయి. అందువల్ల ఆయన సినిమాల్లో నటించాలన్న అభిలాష బాలీవుడ్ టాప్ స్టార్స్ కూ సహజంగానే ఉంటుంది. మొన్నటి దాకా సూపర్ స్టార్ గా సాగిన షారుఖ్ ఖాన్ కు కూడా రాజ్ […]
స్సెషల్ మూవీ షూటింగ్స్ లో మరిన్ని స్పెషల్స్ చోటు చేసుకుంటేనే మజా! రామ్ చరణ్ నటిస్తోన్న 15వ సినిమా నిస్సందేహంగా ఆయనకు ఓ స్పెషల్ అనే చెప్పాలి. తొలిసారి డైనమిక్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తోన్న చిత్రమిది. ఇక ఈ సినిమాను నిర్మిస్తోన్న దిల్ రాజు కు ఇది 50వ సినిమా కావడం మరింత విశేషం! ఈ విశేషాల నేపథ్యంలో రామ్ చరణ్ మరో స్పెషల్ ను చొప్పించారు. అదేమిటంటే, ప్రస్తుతం ఈ […]