మొన్నటి తరం బాలీవుడ్ ప్రేక్షకులకు ప్రేమకథ అంటే ‘దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే’! ఈ తరం వారికి అలాంటి దృశ్య కావ్యం అందిస్తామని చెబుతున్నాడు రచయిత, దర్శకుడు నితిన్ కుమార్ గుప్తా. కమల్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నితిన్ ‘లవ్ ఇన్ ఉక్రెయిన్’ పేరుతో ఓ సినిమా తెరకెక్కించాడు. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని ప్రకటించడానికి కొన్ని నెలల ముందు ఈ సినిమా షూటింగ్ మొత్తం అక్కడే జరిగింది. భారత్ కు చెందిన ఓ […]
‘నువ్వు నేను ఒక్కటవుదాం’, ‘జువ్వ’ చిత్రాలలో హీరోగా నటించిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు రంజిత్ సోమి తాజా చిత్రం ‘లెహరాయి’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ లోగోను గురువారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ‘లెహరాయి’ సినిమాను రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు. ఇదే వేదికపై ఫస్ట్ […]
‘కేజీఎఫ్-2’ ఏప్రిల్ 14న జనం ముందు నిలచింది మొదలు అన్ని భాషల్లోనూ గణనీయమైన వసూళ్ళు చూస్తోంది. ఈ సినిమా ఖచ్చితంగా ఓ వెయ్యి కోట్ల రూపాయలు పోగేస్తుందని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు. ఈ సినిమా ‘బాహుబలి-2’ను అధిగమిస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అది కలలోని మాటే అని చెప్పాలి. ఎందుకంటే ‘బాహుబలి-2’ ప్రపంచ వ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టింది. ఎటు చూసినా ‘కేజీఎఫ్-2’ కు అంత సీన్ లేదని తెలుస్తోంది. అయితే బాలీవుడ్ […]
ప్రస్తుతం భారతీయ దర్శకుల్లో మన తెలుగువాడయిన ఎస్.ఎస్.రాజమౌళి పేరు మారుమోగి పోతోంది. తన తాజా చిత్రం ‘ట్రిపుల్ ఆర్’తో రాజమౌళి మరో రికార్డును సొంతం చేసుకున్నారు. ఇప్పటి దాకా ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.1084 కోట్లు పోగేసింది. భారతదేశంలో విడుదలైన అన్ని భాషల్లో కలిపి ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం రూ. 880.4 కోట్లు మూటకట్టింది. ఇక విదేశాలలో ఈ సినిమా రూ.203.6 కోట్లు రాబట్టింది. వెరసి మొత్తం రూ.1084 కోట్లు కొల్లగొట్టి, ఈ యేడాది […]
‘పెళ్ళయింది… ప్రేమవిందుకు వేళయింది…’అంటూ కొత్త జంట రణబీర్ కపూర్- అలియా భట్ పాడుకుంటున్నారు. వారి ప్రేమవిందుకోసం రణబీర్ తండ్రి రిషికపూర్ గతంలో నిర్మించిన బంగ్లాను ముస్తాబు చేస్తున్నారు. ఈ బంగ్లాను రిషికపూర్ తన తండ్రి రాజ్ కపూర్, తల్లి కృష్ణ కపూర్ పేర్ల మీద ‘కృష్ణ-రాజ్’పేరుతో నిర్మించారు. రణబీర్, అలియా చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న సమయం నుంచీ ‘కృష్ణ-రాజ్’ బంగళాను అధునాతనంగా మార్చడానికి రణబీర్ తల్లి నీతూ కపూర్ ఆదేశించారు. దాదాపు సంవత్సరం నుంచీ ఆ బంగ్లాను కోరిన […]
నటభూషణ శోభన్ బాబు, లక్ష్మి జంటగా రూపొందిన పలు చిత్రాలు జనాన్ని రంజింప చేశాయి. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వారిద్దరూ నటించిన ‘ప్రేమమూర్తులు’ కూడా ప్రేక్షకాదరణ పొందింది. ఇందులో మరో నాయికగా రాధ నటించారు. ఓ కీలక పాత్రలో మురళీమోహన్ కనిపించారు. శ్రీరాజలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని మిద్దే రామారావు నిర్మించారు. 1982 ఏప్రిల్ 21న విడుదలైన ‘ప్రేమమూర్తులు’ మంచి విజయం సాధించింది. కథ విషయానికి వస్తే- గోపాలరావు అనే ధనికుని కూతురు జ్యోతి. మెడిసిన్ […]
ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది వారియర్’. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. గతంలోనూ కొన్ని సెలక్టివ్ తెలుగు మూవీస్ లో పాటపాడిన శింబు ఇప్పుడు మరోసారి తన గొంతును సవరించుకున్నారు. విశేషం ఏమంటే ‘ది వారియర్’ తెలుగు, తమిళ వర్షన్స్ లో ఆయనే ‘బుల్లెట్’ సాంగ్ ను పాడారు. డీఎస్పీ సంగీతం అందించిన […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తాజా చిత్రం ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’. సీనియర్ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర నిర్మించిన ఈ మూవీ మే 6న విడుదల కాబోతోంది. ఆ సందర్భంగా ఏప్రిల్ 20న మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. సూర్యాపేట లో వడ్డీ వ్యాపారం చేసుకునే 33 సంవత్సరాల అల్లం అర్జున్ కుమార్ కు గోదావరి జిల్లాలోని అమ్మాయితో వివాహ నిశ్చితార్థం జరుగుతుంది. రెండు వేర్వేరు యాసలు, […]
తన ‘డేంజరస్’ సినిమాను ఆపటానికి నట్టి క్రాంతి, నట్టి కరుణ కుట్ర పన్ని ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్స్ తో రిలీజ్ ను అడ్డుకున్నారు. ఇప్పుడు క్రింద కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ని తెలంగాణ హైకోర్టు సస్పెండ్ చేసింది. నట్టి క్రాంతి, నట్టి కరుణతో పాటు మీడియాలో నా పై వేసిన నిందలు, చేసిన ఆరోపణలకు నట్టి కుమార్ మీద నేను,తుమ్మలపల్లి రామత్యనారాయణ పరువు నష్టం దావా కేసు వెయ్యటమే కాకుండా రిలీజ్ కి ముందు ఫోర్జరీ […]
దుల్కర్ సల్మాన్ హీరోగా, హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్న చిత్రం ‘సీతారామం’. ‘యుద్ధంతో రాసిన ప్రేమకథ’ అనేది ఈ మూవీ ఉపశీర్షిక. మృణాళిని ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న ఓ కీలకపాత్రలో కనిపించబోతోంది. ఇందులో దుల్కర్ సల్మాన్ లెఫ్టినెంట్ రామ్ గా నటిస్తుండగా, ఆఫ్రీన్ అనే ముస్లిం మహిళ పాత్రను రష్మిక పోషిస్తోంది. వెటరన్ సినిమాటోగ్రాఫర్ పీఎస్ వినోద్ ఛాయాగ్రహణం అందిస్తున్న ‘సీతారామం’కు విశాల్ చంద్రశేఖర్ సంగీతం […]