మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్ తన సేవలను నిరంతరాయంగా కొనసాగిస్తోంది. సంవత్సరాలు గడుస్తున్నా బ్లడ్ డొనేషన్ కాన్సెప్ట్ ఇప్పటికీ అప్రతిహతంగా సాగిపోతోంది. చిరంజీవి అభిమానులే కాదు తెలుగు సినిమారంగంలోని నటీనటులు, మెగాఫ్యామిలీ హీరోలు తమ పుట్టిన రోజు సందర్భంగా బ్లడ్ ను డొనేట్ చేయడం అనేది ఓ బాధ్యతగా భావిస్తున్నారు. బహుశా పెదనాన్నను ఆదర్శంగా తీసుకున్నాడేమో పవన్ కళ్యాణ్ కొడుకు అకిర కూడా తొలిసారి బ్లడ్ ను డొనేట్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా అతని తల్లి రేణు దేశాయ్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది.
18వ సంవత్సరంలోకి అడుగు పెట్టిన తర్వాత తొలిసారి అకిర రక్తదానం చేశాడని పేర్కొంది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానం చేస్తే మంచిదని, వారిచ్చే రక్తం కారణంగా మరో ప్రాణాన్ని కాపాడినట్టు అవుతుందని రేణు దేశాయ్ ఈ పోస్ట్ ద్వారా తెలిపింది. ఓ మంచి తల్లిగా పిల్లలను చక్కని మార్గంలో రేణు దేశాయ్ నడిపిస్తోంది. అకిర బ్లడ్ డొనేషన్ ఫోటోను రేణు దేశాయ్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగానే అది వైరల్ కావడం మొదలైంది.