Tribute : నారాయణ దాస్ నారంగ్‌కు పరిశ్రమ నివాళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ నారాయణ దాస్ నారంగ్ అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే! ఆయనకు నివాళులు అర్పిస్తూ, తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, నిర్మాతల మండలి ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ‘‘నారాయణ దాస్ నారాంగ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. సమస్య చిన్నదైనా, పెద్దదైనా క్షుణ్ణంగా పరిశీలించి ఆ సమస్య మళ్లీ రాకుండా పరిష్కారం చేస్తారు. ఛాంబర్‌కు సంబంధించిన విషయాల్లో చాలా యాక్టివ్‌గా పాల్గొవడం, మంచి సలహా, సూచనలు ఇస్తూ అభివృద్ధి దిశగా ఎలా వెళ్లాలో చెబుతుండేవారు. అలాంటి వ్యక్తిని కోల్పోవడం బాఽధగా ఉంది’ అని అన్నారు.

Also Read
- Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
- Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ టికెట్ రేట్ల పెంపునకు ఏపీలో గ్రీన్ సిగ్నల్..
- Keerthy Suresh: షూటింగ్లో నన్ను భయపెట్టారు.. తోటి నటులపై కీర్తి సురేష్ సంచలన కామెంట్స్!
- Sai Pallavi: ఖాకీ డ్రెస్సులో సాయి పల్లవి మాస్ లుక్.. ‘ఓం’ గ్లింప్స్‌తో నెట్టింట రచ్చ!
ప్రసన్నకుమార్ మాట్లాడుతూ‘‘ఎన్టీఆర్ కాలంనాటి నుంచి నారయణ దాస్ నారంగా డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాత, ఫైనాన్షియర్‌గా పరిశ్రమకు సేవలందించారు. ఏ రోజు ఆయన చేసిన సేవలు బయటకు చెప్పుకోలేదు. మాట ఇస్తే వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. అదే పద్దతి ఆయన తనయుడు సునీల్‌కు వచ్చింది. అదే పద్థతి వాళ్ళ అబ్బాయి సునీల్ గారికి వచ్చింది. చిన్న సినిమాలకు మేం ఉన్నాం అనే భరోసా కల్పించారు’’ అని అన్నారు.

వై.వి.యస్ చౌదరి మాట్లాడుతూ ‘‘నారాయణదాస్ గారి ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. సినిమాకు ఎలాంటి కష్టం వచ్చిన దాని నుంచి బయట పడేసి ముందుకు తీసుకెళ్తారు. ఎవరితోనూ గొడవలు లేకుండా ఇరువైపులవారికి న్యాయం జరిగేలా చేస్తారు’’ అని అన్నారు.

మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ ‘‘అమెరికాలో ఉన్నప్పటి నుంచీ దాసుగారితో పరిచయం ఉంది. ఆయనకు థియేటర్ రంగంలో అంటే చాలా ఇష్టం. అందుకే ఏషియన్ థియేటర్స్ నిర్మించారు. రిజనబుల్ రేట్లు, మంచి సౌకర్యాలతో థియేటర్లను నడిపిస్తున్నారు. ఆడియన్స్ మనకు దేవుళ్లు అని తరచూ చెబుతుండేవారు’’ అని అన్నారు.
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘‘నా సినిమాను ఆయన సినిమాగా భావించి ఎన్నోసార్లు నా సినిమాలు విడుదల చేశారు. ఎప్పుడు సినిమాల గురించే మాట్లాడేవారు. ఇలాంటి ప్యాషన్ ఉన్న నిర్మాత మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయనతో ఉన్న అనుబంధం, అనుభవాలు కళ్లల్లో మెదులుతున్నాయి’’ అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో డి.ఎస్.రావు, పద్మిని నాగులపల్లి, తెలుగు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Israel Elections: ఇజ్రాయెల్‌లో నేడు సార్వత్రిక ఎన్నికల పోలింగ్.. నెతన్యాహు పీఠానికి ముప్పు?
-
AP Local Body Elections: నేడు సుప్రీంకోర్టులో స్థానిక సంస్థల ఎన్నికల కేసుపై విచారణ.. కీలక ఆదేశాలపై ఉత్కంఠ!
-
Microsoft Buyout Plan: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. 60 వేల మంది ఉద్యోగులపై ప్రభావం?
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
Theni Jail Escape: తమిళనాడులో కలకలం.. తేని జిల్లా జైలు నుంచి 17 మంది ఖైదీలు పరార్!
ట్రెండింగ్
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..
-
Tilak Varma: ఎంఎస్ ధోనిని వెనక్కి నెట్టిన తిలక్ వర్మ.. విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో స్టార్ బాయ్..!
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!