Jason Holder: కేజీ నా దగ్గరే ఉన్నాడు.. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్‌పై స్పందించిన హోల్డర్!
- జాసన్ హోల్డర్ అద్భుత ప్రదర్శన
- ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు హోల్డర్ సొంతం
- పాటీదార్ వివాదాస్పద క్యాచ్‌పై స్పందించిన హోల్డర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jason Holder Reacts to Rajat Patidar Controversial Catch: ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్ అద్భుత ప్రదర్శన చేశాడు. అహ్మదాబాద్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. తన బౌలింగ్, ఫీల్డింగ్‌తో జట్టుకు కీలక విజయం అందించిన హోల్డర్.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును సొంతం చేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. తనకు వ్యక్తిగతంగా కూడా ఈ మ్యాచ్ చాలా సంతృప్తినిచ్చిందని, జట్టుగా కూడా అద్భుతంగా ఆడామని చెప్పాడు. మొదటి నుంచే జట్టులో ఎనర్జీ ఉందని, అదే విజయంలో కీలక పాత్ర పోషించిందని తెలిపాడు. రజత్ పాటీదార్ వివాదాస్పద క్యాచ్‌పై స్పందిస్తూ.. క్యాచ్ సమయంలో కగిసో రబాడ (కేజీ) తన దగ్గరే ఉన్నాడని, అతడిని ఢీకొట్టకుండా జాగ్రత్త పడాల్సి వచ్చిందని చెప్పాడు.
‘క్యాచ్ సమయంలో నా దృష్టి మొత్తం బంతిపైనే ఉంది. కేజీ కూడా నాకు సమీపంలోనే ఉన్నాడు. నేలపై పడకుండా క్యాచ్ పట్టాలని మాత్రమే అనుకున్నా. చివరకు క్యాచ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేయడం సంతోషంగా ఉంది’ అని జాసన్ హోల్డర్ వివరించాడు. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ ఔటైన తీరుపై వివాదం చెలరేగింది. క్యాచ్‌ను అందుకునే క్రమంలో హోల్డర్ కింద పడగా.. బంతిని కింద ఆనించినట్లు అనిపించింది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం పాటీదార్‌ను ఔట్‌గా ప్రకటించాడు. దీంతో డగౌట్లో ఉన్న విరాట్ కోహ్లీ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అంపైర్లతో వాగ్వాదంకు దిగాడు.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
ఈ మ్యాచ్‌లో బంతి తన వైపే ఎక్కువగా వచ్చిందని జాసన్ హోల్డర్ సరదాగా అన్నాడు. ‘ఇలాంటి సందర్భాలు నేను ప్రత్యేకంగా కోరుకోను. కానీ వచ్చిన అవకాశాలను వదులుకోకుండా అందిపుచ్చుకోవడం ముఖ్యం. ఈ రోజు అలా జరిగింది. ఆ క్యాచ్ జట్టుకు ఉపయోగపడినందుకు ఆనందంగా ఉంది’ అని చెప్పాడు. మిడిల్ ఆర్డర్‌లో తన పాత్రపై కూడా హోల్డర్ స్పందించాడు. జట్టు మేనేజ్‌మెంట్ చాలా ప్లాన్ ప్రకారం పనిచేస్తోందని, ముఖ్యంగా కోచ్ ఆశిష్ నెహ్రా ప్రణాళికలు ఎంతో స్పష్టంగా ఉంటాయని తెలిపాడు. తాను ఎలాంటి పరిస్థితుల్లోనైనా రెడీగా ఉండాలని, అవసరమైనప్పుడు జట్టును ఆదుకోవడమే తన లక్ష్యమని చెప్పాడు. పరిస్థితులకు అనుగుణంగా ఆడుతూ, జట్టుకు విజయాలు అందించడమే తన బాధ్యతగా భావిస్తున్నానని హోల్డర్ స్పష్టం చేశాడు.
పవర్‌ప్లేలో కగిసో రబాడ, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్‌ను జాసన్ హోల్డర్ ప్రత్యేకంగా ప్రశంసించాడు. ఇద్దరు తొలి ఓవర్లలో వికెట్లు తీసి మ్యాచ్‌ను తమ వైపుకు తిప్పారని అన్నాడు. ఆ సమయంలో బ్యాటర్లు కొంత ఒత్తిడిలో ఉన్నారని, కానీ బౌలర్లు అద్భుతంగా రాణించి మ్యాచ్ మోమెంటమ్‌ను మార్చారని చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచులో మొదట ఆర్సీబీ 19.2 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌటైంది. గుజరాత్ 15.5 ఓవర్లలో ఛేదించింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్… హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..