Veggie Frittata Recipe: హెల్తీ అండ్ టేస్టీ.. లంచ్ బాక్స్‌లోకి కమ్మని ‘వెజ్జీ ఫ్రిటాటా’.. తింటే పిల్లలు అస్సలు వదలరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Veggie Frittata Recipe: స్కూల్‌కు వెళ్లే పిల్లలు, ఆఫీస్‌లకు వెళ్లే ఉద్యోగుల లంచ్ బాక్స్‌లోకి మంచి రుచికరమైన ఆహారాన్ని ప్రిపేర్ చేయడం కోసం వంటింట్లో అమ్మలు కుస్తీ పడుతుంటారు. ఈ క్రమంలోనే చాలా మంది తల్లులు రెగ్యులర్‌గా వైట్ రైస్, ఏదైనా కర్రీ పెట్టి పంపుతుంటారు. అయితే, పిల్లలకు రోజూ అదే తినాలంటే బోరింగ్‌గా ఉంటుంది. అందుకే, మీ అందరి కోసం ఒక వెరైటీ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రెసిపీని తీసుకొచ్చాం. అదే, నోరూరించే కమ్మని “వెజ్జీ ఫ్రిటాటా”. ఈ హెల్తీ వెజ్జీ ఫ్రిటాటా రెసిపీ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి లేదా మధ్యాహ్నం లంచ్ బాక్స్‌లోకి చాలా బాగుంటుంది. కేవలం 290 క్యాలరీలతో, ఆరోగ్యకరమైన ప్రోటీన్ (24 గ్రాములు) అందేలా ఈ వంటకాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు:
బేకన్ ముక్కలు: 2 (కొవ్వు లేనివి)
ఆయిల్ స్ప్రే: వేయించడానికి సరిపడా
పుట్టగొడుగులు (Mushrooms): 125 గ్రాములు (సన్నగా తరిగినవి)
పాలకూర: 75 గ్రాములు
ఉడికించిన బంగాళదుంపలు: 100 గ్రాములు (ముక్కలుగా కోసినవి)
చెర్రీ టొమాటోలు: 100 గ్రాములు (సగానికి కోసినవి)
కోడిగుడ్లు: 4 (గిలకొట్టినవి)
ఉప్పు, మిరియాల పొడి: రుచికి సరిపడా
Also Read
- Kulfi Recipe: దీపావళికి మిగిలిపోయిన స్వీట్లతో టేస్టీ హోమ్మేడ్ కుల్ఫీ.. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే సూపర్ రెసిపీ
- Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
- Healthy Breakfast: ఎముకలకు ఉక్కు బలమిచ్చే రాగి - మునగాకు రొట్టెలను ఇలా తయారు చేసుకోండి!
- Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
తయారీ విధానం:
ముందుగా గ్రిల్‌ను మీడియం-హై హీట్ వద్ద ఉంచుకోవాలి. బేకన్ ముక్కలను రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు గ్రిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక చిన్న నాన్-స్టిక్ పాన్‌పై ఆయిల్ స్ప్రే చేసి వేడి చేయాలి. అందులో పుట్టగొడుగుల ముక్కలు వేసి 5 నిమిషాల పాటు అవి మెత్తబడే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్‌లో కడిగి ఆరబెట్టిన పాలకూరను వేసి ఒకటి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి. పాలకూర రంగు మారకుండా ఉన్నప్పుడే తీసి, దానిలోని అదనపు నీటిని పిండేసి పక్కన ఉంచుకోవాలి. పాన్‌ను ఒకసారి శుభ్రం చేసి మళ్లీ ఆయిల్ స్ప్రే చేయాలి. బంగాళదుంప ముక్కలు, టొమాటోలను వేసి 5 నిమిషాల పాటు వేయించాలి. అవి కొద్దిగా రంగు మారాలి కానీ మరీ ముక్కలైపోకుండా చూసుకోవాలి. ఈలోపు ఒక పెద్ద గిన్నెలో కోడిగుడ్లను తీసుకుని బాగా గిలకొట్టాలి. అందులో ముందుగా సిద్ధం చేసుకున్న బేకన్ ముక్కలు (చిన్నగా కోసినవి), పాలకూర, పుట్టగొడుగులను వేయాలి. దీనికి తగినంత ఉప్పు, మిరియాల పొడి కలపాలి. చివరగా వేయించిన బంగాళదుంపలు, టొమాటోలను కూడా ఈ మిశ్రమంలో వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు ఈ గుడ్డు-వెజ్జీ మిశ్రమాన్ని తిరిగి వేడి పాన్‌లో వేసి, తక్కువ మంట మీద సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి. అంచులు గట్టి పడ్డాక, పాన్‌ను గ్రిల్ కింద ఒక 2 నిమిషాలు ఉంచితే పైన కూడా చక్కగా ఉడుకుతుంది. అంతే! ఎంతో రుచికరమైన ఫ్రిటాటా సిద్ధం. దీనిని ముక్కలుగా కోసి తాజా సలాడ్‌తో సర్వ్ చేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి.
తాజావార్తలు
-
Dheeraj Mogilineni : బుక్ మై షో ట్రెండింగ్ వెనుక పెద్ద స్కామ్?..’ఫేక్’ టికెట్ల బాగోతాన్ని బట్టబయలు చేసిన తెలుగు నిర్మాత
-
Damodar Raja Narasimha : హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పనిలేదు.. జిల్లాల్లోనే కార్పొరేట్ వైద్యం..
-
Ranabali OTT Release Date: ఇక మీ ఇంట్లోకి రాబోతున్న ‘రణబాలి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
NTR Dragon: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సాలిడ్ అప్డేట్.. పూనకాలు తెప్పించేలా ‘డ్రాగన్’ క్లైమాక్స్ ఫైట్!
-
CM Chandrababu: రెబల్స్‌కు పార్టీలో నో ఎంట్రీ.. చంద్రబాబు సంచలన నిర్ణయం
ట్రెండింగ్
-
7 అంగుళాల భారీ డిస్ప్లే, 10,000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రాబోతున్న iQOO Z12 సిరీస్..!
-
Varanasi Movie: ‘వారణాసి’లో టైమ్ ట్రావెల్ ట్విస్ట్.. కుంభకర్ణుడి పునర్జన్మగా ఆ పాత్ర?
-
Upcoming Smartphones: ఈ వారం లాంచ్ కానున్న కొత్త స్మార్ట్ఫోన్లు ఇవే.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Reno 17 సిరీస్..!
-
Airtel నుంచి ‘Buy 1 Get 1’ ఆఫర్.. ఆ ప్లాన్స్ తో ఒక్కసారి రీఛార్జ్ చేస్తే రెండుసార్లు ప్రయోజనం..!
-
Realme నుంచి పవర్ఫుల్ 5G ఫోన్లు.. 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో వచ్చేస్తున్న Realme 17 సిరీస్..!