చిత్రసీమ తల్లివంటిది. సినిమా రంగాన్ని నమ్ముకుంటే ఏదో ఒక రోజున ఆ తల్లి కరుణించక మానదు అంటారు. ఎందరో అలాగే నమ్ముకొని సినిమా రంగంలో తమదైన బాణీ పలికించారు. నటుడు బ్రహ్మాజీ కెరీర్ ను పరిశీలించి చూస్తే అది నిజమే అనిపించక మానదు. తన తరం వారు హీరోలుగా వెలిగినా, ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఉన్నారు. బ్రహ్మాజీ మాత్రం ఇప్పటికీ బిజీగానే సాగుతున్నారు. తనకంటే వయసులో ఎంతో చిన్నవారయిన నటులతోనూ ఫ్రెండ్ గా నటించేస్తూ సందడి చేస్తున్నారు […]
మన దేశంలో పాన్ ఇండియా మూవీస్ క్రేజ్ కు ‘ట్రిపుల్ ఆర్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలు మరింత ఊపు తెచ్చాయని పరిశీలకులు చెబుతున్నారు. ఈ యేడాది ఈ రెండు చిత్రాలు దక్షిణాది సినిమా రంగం ప్రతిభను దశదిశలా చాటాయని ట్రేడ్ పండిట్స్ సైతం అంగీకరిస్తున్నారు. ఉత్తరాదిన ఈ సినిమాలు హిందీ చిత్రాలను కూడా పక్కకు నెట్టి అగ్రపథంలో పయనించడం విశేషం! నార్త్ ఇండియాలో హిందీ ‘ట్రిపుల్ ఆర్’ కంటే ‘కేజీఎఫ్- 2’ హిందీ వెర్షన్ ఎక్కువ మొత్తం చూసిందని […]
‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నారు. ఎన్ని కథలు, కవితలు పొంగిపొరలినా, వాటికి నటన కూడా తోడయినప్పుడే రక్తి కడుతుందని పెద్దల మాట! ఇప్పటికీ నాటకం దేశవిదేశాల్లో సందడి చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో తెలుగునాట సైతం నాటకాన్ని బతికించే ప్రయత్నంలో కొందరు సాగుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ‘సి.ఆర్.సి. కాటన్ కళాపరిషత్’ నాటకానికి వైభవం తీసుకువచ్చే దిశగా పయనిస్తోంది. ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ళ భరణి ఈ సంస్థకు గౌరవాధ్యక్షులు. విక్టరీ వెంకటరెడ్డి ఈ సంస్థ కన్వీనర్. […]
‘6 టీన్స్, గర్ల్‌ఫ్రెండ్,పటాస్, ఇదేనా మొదటి ప్రేమలేఖ, ప్రేమలో పావని కళ్యాణ్, బన్ని, ఆచారి అమెరికా యాత్ర, శ్రీరామచంద్రులు, జానకి వెడ్స్ శ్రీరామ్, అధినేత, సెల్ఫీరాజా’ వంటి సినిమాల్లో పలు సూపర్ హిట్ పాటలు రాసిన తైదల బాపు నిర్మాత కాబోతున్నాడు. తన పాటలతో యువతను ఆకట్టుకుని తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న తైదల బాపు పుట్టినరోజు ఏప్రిల్ 25 పురస్కరించుకుని ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందంటూ ఇందుకోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్నారు. […]
తెలుగులో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జెర్సీ’ చిత్రం హిందీలో అదే పేరుతో రీమేక్ అయింది. షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన హిందీ ‘జెర్సీ’ ఇటీవలే విడుదలై విజయపథంలో పయనిస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఓ చిత్రంలో నటించనున్నారు. ‘జెర్సీ’ హిందీ మూవీ సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సమయంలో చెర్రీ తన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరిని అభినందించారు. ‘జెర్సీ’ చిత్రంలో క్రికెట్ నేపథ్యంగా కనిపించినా, అందులో కేవలం […]
ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అది అప్పుడు అలా జరుగుతుందని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిప్రాయపడ్డారు. ‘ఆర్.ఆర్.ఆర్.’ ఆరంభించినప్పుడు వెంటనే మరో మల్టీస్టారర్ లో నటిస్తానని తాను ఊహించలేదని చెప్పారు చెర్రీ. ‘ఆర్.ఆర్.ఆర్.’ అనుకున్న సమయానికి విడుదలయి ఉంటే అనుకుంటాం కానీ, ఏది మన చేతుల్లో ఉండదని అన్నీ అలా సమకూరినప్పుడే మంచి ప్రాజెక్ట్స్ మన సొంతమవుతాయని చెర్రీ తెలిపారు. అనుకోకుండా కేవలం రెండు నెలల వ్యవధిలో ‘ఆర్.ఆర్.ఆర్.’, ‘ఆచార్య’ వంటి మల్టీస్టారర్స్ […]
ఈ మధ్యే విడుదలైన ‘ఆర్.ఆర్.ఆర్.’ టీమ్ అంటే డైరెక్టర్ రాజమౌళి, హీరోలు యన్టీఆర్, రామ్ చరణ్ ను సినిమా రిలీజ్ కు ముందు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఇంటర్వ్యూ చేసి ఆకట్టుకున్నారు. అదే తీరున ఇప్పుడు ‘ఆచార్య’ చిత్రం కోసం చిరంజీవి, రామ్ చరణ్, దర్శకుడు కొరటాల శివను మరో నోటెడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఇంటర్వ్యూ చేయబోవడం విశేషం! ఆదివారం (ఏప్రిల్ 24న) ఈ ఇంటర్వ్యూ జరిగింది. సరిగ్గా 35 రోజుల వ్యవధిలో రెండు […]
‘డైరెక్టర్ ఈజ్ ద కెప్టెన్’ అనేది సినిమా వెలుగు చూసిన రోజుల నుంచీ ఉన్న నానుడి. అందువల్ల సినిమా దర్శకునికి ఎంతో క్రమశిక్షణ అవసరం అని పలువురు భావించేవారు. అలాంటివారు తాము దర్శకత్వం చేస్తున్న సమయంలో క్రమశిక్షణతో మెలగడగమే కాదు, కృషి, దీక్ష, పట్టుదలకు చిహ్నంగా ‘యూనిఫామ్’ కూడా ధరించేవారు. తెలుగునాట కొందరు దర్శకులు ఆ పంథాలో పయనించారు. ఎక్కువమంది దర్శకులు వైట్ అండ్ వైట్ వేసుకొనేవారు. కానీ, ‘ఖాకీ’ దుస్తులు అంటే క్రమశిక్షణకు, శ్రమకు ప్రతీక […]
ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జయంతి .అభిరుచి గల నిర్మాతలు రాజీపడరు. అలాగని కమర్షియల్ సక్సెస్ కోసం పాకులాడరు. ఫలితం ఎలా ఉంటుందో తెలియక పోయినా, తమ అభిరుచికి తగ్గ రీతిన సినిమాలు తెరకెక్కించి, ఆనందిస్తారు. అలాంటి అరుదైన నిర్మాతల్లో పూర్ణోదయా సంస్థ అధినేత ఏడిద నాగేశ్వరరావు పేరు తప్పకుండా ఉంటుంది. తెలుగు సినిమా విలువ తరిగిపోతున్న తరుణంలో ‘శంకరాభరణం’ వంటి కళాఖండాన్ని నిర్మించి, జాతీయ స్థాయిలో తెలుగు వెలుగును ప్రసరింపచేశారాయన. భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలిచారాయన. […]
గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో కుమార్ బాబు, రవి కస్తూరి, పమిడి రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ‘గేమ్ ఆన్’. ఫిల్మ్ నగర దైవ సన్నిధానంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఆరంభమైంది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు ప్రవీణ్ సత్తారు హీరో గీతానంద్, నేహా సోలంకిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, ప్రముఖ పారిశ్రామిక వేత్త పమిడి రమేష్ కెమెరా […]