స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
- మోటరోలా (Motorola) “బ్రిలియంట్ కలెక్షన్”లో కొత్త డివైస్‌లు విడుదల
- మోటరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్, Moto Buds 2 Plus ఈ కలెక్షన్‌లో భాగం
- స్వరోవ్‌స్కీ, బోస్, పాంటోన్ తో భాగస్వామ్యం
- పాంటోన్ వైలెట్ ఇండిగో కలర్‌తో ప్రీమియం డిజైన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Motorola Brilliant Collection Launch: మోటరోలా (Motorola) సంస్థ నుండి “బ్రిలియంట్ కలెక్షన్”లో భాగంగా కొత్త డివైస్ లను తీసుకవచ్చింది. ఇందులో అప్డేటెడ్ మోటరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్ (Motorola signature smartphone), మోటో బడ్స్ 2 ప్లస్ (Moto buds 2 plus) ఉన్నాయి. ఈ కలెక్షన్ ప్రత్యేకత ఏమిటంటే.. టెక్నాలజీతో పాటు ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ ఎలిమెంట్స్‌ను కలిపి రూపొందించడం. ఈ కొత్త డివైస్‌ల అభివృద్ధిలో మోటరోలా పలు ప్రముఖ బ్రాండ్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ముఖ్యంగా స్వరోవ్‌స్కీ, బోస్, పాంటోన్ సంస్థలతో కలిసి పనిచేసింది. ఈ భాగస్వామ్యాల వల్ల డివైస్‌లకు ప్రత్యేకమైన డిజైన్, మెరుగైన పనితీరు లభించాయి.
డిజైన్, ఫీచర్లు:
ఈ కలెక్షన్ లోని డివైస్లు రాత్రి ఆకాశం, నక్షత్రాల నుంచి ప్రేరణ పొందిన డిజైన్‌తో రూపొందించబడ్డాయి. ప్రత్యేకంగా పాంటోన్ వైలెట్ ఇండిగో (PANTONE Violet Indigo) కలర్‌తో సిల్క్ ఫినిష్ లుక్ ను అందించారు. మోటరోలా సిగ్నేచర్ స్మార్ట్‌ఫోన్‌లో 3D క్విల్టెడ్ ప్యాటర్న్ తో పాటు 20 అమెథిస్ట్ స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్ ను చేతితో అమర్చారు. ఇది ఫోన్‌కు ప్రీమియం లుక్‌ను ఇస్తుంది. ఇక మోటో బడ్స్ 2 ప్లస్ కూడా అదే వైలెట్ ఇండిగో (Violet Indigo) థీమ్‌లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఇయర్‌బడ్‌లో 12 స్వరోవ్‌స్కీ క్రిస్టల్స్ ఉండగా, చార్జింగ్ కేస్‌పై అదనంగా 41 క్రిస్టల్స్ అమర్చబడ్డాయి. ఈ డిజైన్ వల్ల ఇవి జ్యువెలరీలా కనిపించేలా రూపొందించబడ్డాయి. ఆడియో క్వాలిటీ కోసం ‘బోస్’ టెక్నాలజీని ఇన్‌టిగ్రేట్ చేశారు. దీని వల్ల వినికిడి అనుభవం మరింత మెరుగుపడుతుంది.
Also Read
- 165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- 2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
- Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్.. రూ.15 వేల లోపు లభించే కొత్త ఫోన్ల జాబితా వెల్లడి..
- HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
ధర:
ఈ “బ్రిలియంట్ కలెక్షన్”లోని మోటరోలా సిగ్నేచర్, మోటో బడ్స్ 2 ప్లస్ త్వరలో మార్కెట్‌లోకి రానున్నాయి. యూకేలో ఈ బండిల్ ధర సుమారు 1,199 పౌండ్స్ (భారత కరెన్సీలో సుమారు రూ.1.53 లక్షలు)గా నిర్ణయించారు. యూరప్, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లో ఈ డివైస్‌లు దశలవారీగా విడుదల కానున్నాయి. ప్రతి దేశంలో ధరలు, అందుబాటు తేదీలు భిన్నంగా ఉంటాయి.
తాజావార్తలు
-
Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
ట్రెండింగ్
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?