పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిక్ మాగ్నమ్ ఓపస్ మూవీ ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ అన్నపూర్ణ సెవన్ ఏకర్స్ లో వేసిన సెట్స్ లో జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా కోసం జాతీయ అవార్డు గ్రహీత, పద్మశ్రీ తోట తరణి వేసిన సెట్స్ ను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చూసి, ఆయన్ని ఆత్మీయంగా సత్కరించారు. అలానే ఆ సెట్స్ లో చిత్రీకరించే పోరాట సన్నివేశాలకు సంబంధించిన ప్రిపరేషన్ లోనూ పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇప్పుడు […]
సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయిపోయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ రైటర్ విజయంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో సుమంత్ లుక్ సరికొత్తగా డిజైన్ చేశారు. ఫేస్ మీద ఒకవైపు ‘హెల్ప్ మీ’ అనే అక్షరాలు రోల్ అవుతున్నాయి. […]
ఆరడుగులపైనున్న అమితాబ్ బచ్చన్, ఐదున్నర అడుగులకు కాస్త పైనున్న గోవిందాను ఓ సారి లాగి లెంపకాయ కొడతానన్నారట. అసలే ఆయన బిగ్ బి, తానేమో ‘చీచీ’ భయపడక ఏం చేస్తాను అని గోవిందా ఓ సందర్భంలో చెప్పాడు. ఇంతకూ అసలు విషయమేమిటంటే, ఈ లంబూజంబూ కలసి ‘బడేమియా- చోటేమియా’లో నటించారు. అందులో ఓ సన్నివేశం గురించి, గోవిందాతో చర్చిస్తూ బిగ్ బి ఈ సినిమా సక్సెస్ కాకుంటే చాచి లెంపకాయ కొడతానని బెదిరించారట. దాంతో తాను హడలి […]
ఈ యేడాది ఆస్కార్ బరిలో ఉత్తమ నటునిగా నిలచిన విల్ స్మిత్, అదే వేడుకలో హోస్ట్ క్రిస్ రాక్ ను లాగి లెంపకాయ కొట్టిన విషయాన్ని ఎవరూ మరచిపోలేరు. ‘కింగ్ రిచర్డ్’ సినిమా విల్ స్మిత్ కు బెస్ట్ యాక్టర్ గా తొలి ఆస్కార్ ను అందించింది. ఆ వేడుకలో హోస్ట్ క్రిస్ రాక్, విల్ భార్యపై సరదాగా చేసిన కామెంట్ కారణంగా ఈ ఎపిసోడ్ సాగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకు విల్ తన […]
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన చిత్రం ‘సూరారై పొట్రు’. ఈ సినిమా తెలుగులోనూ ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో డబ్ అయ్యింది. కరోనా కారణంగా థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ మధ్య ఈ చిత్రాన్ని దర్శకురాలు సుధ కొంగర తోనే హిందీలోనూ రీమేక్ చేస్తున్నట్టు సూర్య ప్రకటించారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ హిందీలో మొదలైంది. తమిళంలో సూర్య పోషించిన ఎయిర్ డెక్కన్ అధినేత […]
మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ‘దంగల్’ గ్రాండ్ సక్సెస్ తరువాత ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో తీవ్ర నిరాశకు గురయ్యాడనే చెప్పాలి. ఇప్పుడు ఆమిర్ ఆశలన్నీ ‘లాల్ సింగ్ ఛద్దా’ మీదే ఉన్నాయి. హాలీవుడ్ స్టార్ టామ్ హ్యాంక్స్ నటించిన ‘ద ఫారెస్ట్ గంప్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కరీనా కపూర్ నాయిక. ఈ మూవీలో నటించడానికి ఆమిర్ ఖాన్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? కరీనా కపూర్ కంటే ఆరు రెట్లు ఎక్కువట! […]
గతంలో పలు తెలుగు చిత్రాలలో నటించిన సునైన ‘రాజ రాజ చోర’తో టాలీవుడ్ లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో ‘నీర్పరవై’ వంటి చిత్రాలలో తన నటనతో ప్రేక్షకులని మెప్పించి, ఇటీవల ‘సిల్లు కారుపట్టి’ అంథాలజీతో మరోసారి నటనతో ఆకట్టుకుంది సునైనా. తాజాగా ఆమె ‘రెజీనా’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. కోయంబత్తూరుకు చెందిన ఎల్లో బేర్ ప్రొడక్షన్ ఎల్‌ఎల్‌పి బ్యానర్ లో కొత్త నిర్మాత సతీష్ నాయర్ దీన్ని నిర్మిస్తున్నారు. ‘పైపిన్ చువత్తిలే ప్రణయం’, […]
కుర్ర హీరో టైగర్ ష్రాఫ్ ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ సినిమాతో ఢీ కొంటున్నాడు. టైగర్ ష్రాఫ్ తాజా చిత్రం ‘హీరో పంతి-2’ ఏప్రిల్ 29న జనం ముందు వాలనుంది. అదే రోజున అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి టాప్ స్టార్స్ నటించిన ‘రన్ వే 34’ విడుదల కానుంది. మరి అంత పెద్ద స్టార్స్ సినిమాతో పోటీ అంటే మాటలా!? అందుకే తన సినిమాకు, తనకు ఆశీస్సులు కావాలని కోరుకుంటూ రాజస్థాన్ లోని […]
ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు, హరీష్ శంకర్ సంయుక్తంగా జీ5 కోసం రూపొందిస్తున్న వెబ్ సీరిస్ ‘ఏటీఎం’ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది. బిగ్ బాస్ 5 ఫేమ్ సన్నీ, దివితో పాటు సుబ్బరాజు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ నెల 27 నుండి దీని రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతోంది. ‘దిల్’ రాజు ఫ్యామిలీ నెక్ట్స్ జనరేషన్ కు చెందిన హర్షిత్ రెడ్డి, హన్సిత రెడ్డి ఈ వెబ్ సీరిస్ ను నిర్మిస్తున్నారు. సి. […]
ఈవారం తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవిని ‘ఆచార్య’గా అలరించబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’, ‘కెజిఎఫ్2’ తర్వాత భారీ క్రేజ్ తో వస్తున్న సినిమా ఇది. అప్పటి వరకూ అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల దర్శకత్వం కూడా ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. దీంతో ‘ఆచార్య’కు పోటీగా ఏ సినిమాను విడుదల చేయటానికి ఏ దర్శకనిర్మాతలు ధైర్యం చేయలేదు. అయితే తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ మాత్రం ‘ఆచార్య’కు ముందు ఒక రోజు విడుదల కాబోతోంది. దక్షిణాదిన టాప్ […]