The Oscar : విల్ స్మిత్ ను వీడని ‘చెంపదెబ్బ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ యేడాది ఆస్కార్ బరిలో ఉత్తమ నటునిగా నిలచిన విల్ స్మిత్, అదే వేడుకలో హోస్ట్ క్రిస్ రాక్ ను లాగి లెంపకాయ కొట్టిన విషయాన్ని ఎవరూ మరచిపోలేరు. ‘కింగ్ రిచర్డ్’ సినిమా విల్ స్మిత్ కు బెస్ట్ యాక్టర్ గా తొలి ఆస్కార్ ను అందించింది. ఆ వేడుకలో హోస్ట్ క్రిస్ రాక్, విల్ భార్యపై సరదాగా చేసిన కామెంట్ కారణంగా ఈ ఎపిసోడ్ సాగింది. అది అందరికీ తెలిసిన విషయమే. అందుకు విల్ తన సోషల్ మీడియా వేదికలో ‘సారీ’ చెప్పాడు. తరువాత అకాడమీ స్మిత్ ను పదేళ్ళ పాటు ఆస్కార్ వేడుకలకు రాకుండా నిషేధించింది. అయితే ఈ శిక్ష సరిపోదని క్రిస్ రాక్ తల్లి రోజ్ రాక్ అంటున్నారు.
క్రిస్ రాక్ చెంపపై కొట్టిన విల్ స్మిత్ ను అకాడమీ కేవలం పదేళ్ళ పాటు బహిష్కరించడంతో రోజ్ రాక్ సంతృప్తి చెందలేదు. నిజానికి విల్ చేసిన పనికి అతనికి సంకెళ్ళు వేయాల్సిందేనని ఆమె అన్నారు. లేదా విల్ కు ప్రదానం చేసిన ఆస్కార్ ను తిరిగి తీసుకోవాలనీ ఆమె డిమాండ్ చేస్తున్నారు. తన సోషల్ మీడియాలో మరుసటి రోజునే విల్ స్మిత్ క్షమాపణ చెప్పిన విధానం కూడా సరిగా లేదని ఆమె తప్పు పట్టారు. అయితే ఆస్కార్ వేదికపైన విల్ స్మిత్ సభ్యత లేకుండా ప్రవర్తించినా, తన కొడుకు క్రిస్ రాక్ ఎంతో హుందాగా ఉన్నాడని, అందుకు తల్లిగా తాను గర్వపడుతున్నాననీ ఆమె అంటున్నారు. ఇదిలా ఉంటే క్రిస్ సోదరుడు కెన్నీ రాక్ కూడా విల్ స్మిత్ ‘సారీ’ చెప్పిన విధానంలో నిజాయితీయే లేదని అన్నాడు. విల్ క్షమాపణ చెప్పిన తీరులోని లోపాలను ఇంకా ఎందరు ఎత్తి చూపిస్తారో! ఇంకా ఎన్నాళ్ళు ఈ చెంపదెబ్బ విల్ ను వెంటాడుతుందో చూడాలి.
Also Read
- Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
- Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
- #BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. "ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి"
- Jana Nayakudu: 'జన నాయకుడు' పోస్టర్‌తో అంచనాలు పెంచిన విజయ్.. జూలై 23న బాక్సాఫీస్‌పై దండయాత్ర!
తాజావార్తలు
-
World’s First Motorcycle: ప్రపంచంలో మొట్టమొదటి బైక్‌ను ఎవరు కనిపెట్టారు? షాకింగ్ హిస్టరీ ఇదే!
-
PM Modi: దేశ చరిత్రలో మరో కీలక ఘట్టం.. తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్న మోడీ
-
TTD Donations: నిబంధనల మార్పు ఎఫెక్ట్.. టీటీడీకి ఒక్కరోజే రూ.97 కోట్ల విరాళాలు
-
Pakistan: యూనిఫాం విడిచి, రాజకీయాల్లోకి రా.. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు సవాల్..
-
Trump: ఇరాన్‌పై భీకర దాడులకు ప్రణాళిక.. సిచ్యుయేషన్ రూమ్‌లో ట్రంప్ ఎమర్జెన్సీ మీటింగ్
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!