సుమంత్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘అహం రీబూట్’. ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వంలో రఘువీర్ గోరిపర్తి, సృజన్ యరబోలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తయిపోయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం జరుగుతోంది. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను స్టార్ రైటర్ విజయంద్ర ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ పోస్టర్ లో సుమంత్ లుక్ సరికొత్తగా డిజైన్ చేశారు. ఫేస్ మీద ఒకవైపు ‘హెల్ప్ మీ’ అనే అక్షరాలు రోల్ అవుతున్నాయి. హెడ్ ఫోన్స్ పెట్టుకున్న సుమంత్… సాయం చేయమని కోరే వాళ్లతో మాట్లాడుతున్నట్లు తెలుస్తోంది. సుమంత్ పాత్రకు తగ్గట్లుగా కాన్సెప్ట్ ను వివరిస్తున్న ఈ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.
ఈ సందర్బంగా విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, ”ఈ కాన్సెప్ట్ వినగానే చాలా ఎగ్జైట్ అయ్యాను. చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. ఇలాంటి కథలకు ఇప్పుడు డిమాండ్ మరింత పెరిగింది. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో నటిస్తున్న సుమంత్ కి అభినందనలు. నిర్మాతలు రఘువీర్, సృజన్ యరబోలు, దర్శకుడు ప్రశాంత్ సాగర్ కు, ఇతర టెక్నీషన్స్ కు ఆల్ ద బెస్ట్” అని చెప్పారు. ప్రశాంత్ సాగర్ అట్లూరి మూవీ గురించి చెబుతూ, ”’అహం రీ బూట్’ తో ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ను అందించబోతున్నాం. అనుకోని సంఘటనలు మనిషిలోని కొత్త కోణాలను, శక్తులకు బయటకు తెస్తాయి. అవి చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయి. అలాంటి కథే ఇది. సుమంత్ నటన చాలా హైలెట్ గా ఉంటుంది” అని అన్నారు. ఈ చిత్రాన్ని జూన్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నామని నిర్మాతల్లో ఒకరైన రఘువీర్ గోరిపర్తి చెప్పారు.