Rajat Patidar: పాయింట్ల పట్టికను పట్టించుకోవడం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి
- ఆర్సీబీ ఓటమిపై స్పందించిన కెప్టెన్ రజత్ పాటీదార్
- పాయింట్ల పట్టికను పట్టించుకోవడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026లో భాగంగా గురువారం అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్ (జీటీ)తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి అనంతరం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ రజత్ పాటీదార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ తగినంత స్కోర్ చేయలేకపోయిందని అంగీకరించిన పాటీదార్.. బౌలర్లు చివరివరకు పోరాడిన తీరు పాజిటివ్‌గా భావిస్తున్నానని తెలిపాడు. పాయింట్ల పట్టికపై కాకుండా.. ప్రతి మ్యాచ్‌పై దృష్టి పెట్టాలని తాము నిర్ణయించుకుందని తెలిపాడు. జీటీ బ్యాటర్ శుభ్‌మన్ గిల్ పవర్‌ప్లేలో అద్భుతంగా ఆడాడని, అక్కడే తాము వెనకపడిపోయాం అని పాటీదార్ చెప్పుకొచ్చాడు.
‘నిజంగా చెప్పాలంటే ఈ పిచ్‌పై మా స్కోర్ సరిపోలేదు. కానీ మేము బౌలింగ్ చేసిన తీరు బాగుంది. మ్యాచ్‌ను 15-16 ఓవర్ల వరకు తీసుకెళ్లడం మాత్రం మాకు పాజిటివ్ అనే చెప్పాలి. పిచ్‌పై పచ్చిక బాగా ఉండటంతో మొదట ఫాస్ట్ బౌలర్లకు సహకారం లభించింది. శుభ్‌మన్ గిల్ పవర్‌ప్లేలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతడు మా మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అయినప్పటికీ మేము తిరిగి పోరాడి మ్యాచ్‌ను 16వ ఓవర్ల వరకు తీసుకెళ్లడం ఒక మంచి సంకేతం’ అని రజత్ పాటీదార్ చెప్పాడు.
Also Read
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
- IPL 2027: కోహ్లీ, రోహిత్‌తో కలిసి IPL ఆడాలన్న పాక్ క్రికెటర్ కల నెరవేరుతుందా? బ్రిటిష్ పౌరసత్వంతో ఉత్కంఠ
- KKR Captaincy Crisis: రెండేళ్ల వ్యూహాత్మక తప్పిదం.. కేకేఆర్‌ను సంక్షోభంలోకి నెట్టిందెలా? రహానే రిటైర్మెంట్ కేవలం సాకు మాత్రమే..!
‘మేము మధ్య ఓవర్లలో ఎక్కువ వికెట్లు కోల్పోయాం. అదే మ్యాచ్‌పై ప్రభావం చూపింది. ఆ సమయంలో మేము ఒత్తిడిలోకి వెళ్లిపోయాం. భువనేశ్వర్ కుమార్ టీ20 ఫార్మాట్‌లో అనుభవజ్ఞుడైన బౌలర్ అని అందరికీ తెలిసిందే. మ్యాచ్ తొలి భాగంలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఐపీఎల్ 2026ఓ ఇంకా ప్రయాణం చాలానే ఉంది. మేము ఒక్కో మ్యాచ్‌ను ఆడుతూ ముందుకు వెళ్లాలని భావిస్తున్నాం. పాయింట్ల పట్టిక గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. మంచి క్రికెట్ ఆడడమే మా లక్ష్యం’ అని ఆర్సీబీ కెప్టెన్ తెలిపాడు.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!