మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ‘దంగల్’ గ్రాండ్ సక్సెస్ తరువాత ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’తో తీవ్ర నిరాశకు గురయ్యాడనే చెప్పాలి. ఇప్పుడు ఆమిర్ ఆశలన్నీ ‘లాల్ సింగ్ ఛద్దా’ మీదే ఉన్నాయి. హాలీవుడ్ స్టార్ టామ్ హ్యాంక్స్ నటించిన ‘ద ఫారెస్ట్ గంప్’ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో కరీనా కపూర్ నాయిక. ఈ మూవీలో నటించడానికి ఆమిర్ ఖాన్ తీసుకున్న పారితోషికం ఎంతో తెలుసా? కరీనా కపూర్ కంటే ఆరు రెట్లు ఎక్కువట!
ఇంతకూ ‘లాల్ సింగ్ ఛద్దా’లో నటించడానికి కరీనా కపూర్ అందుకున్న పారితోషికం ఎంత? అక్షరాలా ఎనిమిది కోట్లు అని తెలుస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆమిర్ ఖాన్ కు ముట్టినది రూ.50 కోట్లు అట! ఇందులో మన తెలుగు స్టార్ నాగచైతన్య కూడా ఓ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం ద్వారా నాగచైతన్యకు రూ.6 కోట్లు లభించిందట! అలాగే ఇందులో నటించిన మోనా సింగ్ కు రెండు కోట్లు, మానవ్ విజ్ కు కోటి రూపాయలు రెమ్యూనరేషన్స్ దక్కాయి. టీటూ వర్మకు మాత్రం రూ.50 లక్షలేనట. ‘త్రీ ఇడియట్స్’లో ఆమిర్, కరీనా జోడీ కట్టి భలేగా ఆకట్టుకున్నారు. మరి ‘లాల్ సింగ్ ఛద్దా’తో వారిద్దరూ ఏ తీరున అలరించారో ఆగస్టు 11న తేలనుంది.