అనేక తెలుగు చిత్రాలలో అక్క, వదిన, పిన్ని, అత్త, అమ్మ పాత్రల్లో ఒదిగిపోతూ అందరినీ అలరించారు నటి సురేఖా వాణి. ఇప్పటికీ పలు చిత్రాలలో సురేఖ కేరెక్టర్ రోల్స్ లో ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా వర్ధమాన తారల చిత్రాలలో సురేఖా వాణి ఏదో ఒక పాత్రలో తప్పకుండా కనిపిస్తూ ఉంటారు. తనదైన అభినయంతో ఆకట్టుకుంటూ సురేఖ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు. సురేఖా వాణి 1977 ఏప్రిల్ 29న విజయవాడలో జన్మించారు. చిన్నతనం నుంచీ సురేఖ […]
సీనియర్ బాలీవుడ్ నటుడు సలీమ్ గౌస్ (70) గురువారం ఉదయం గుండెపోటుతో ముంబైలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన భార్య అనిత సలీమ్ ధృవపరిచారు. ‘బుధవారం రాత్రి గుండె నొప్పిగా ఉందని సలీమ్ చెప్పడంతో, కోకిలాబెన్ హాస్పిటల్ లో చేర్చామని, గురువారం ఉదయం ఆయన హార్ట్ అటాక్ తో కన్నుమూశార’ని ఆమె తెలిపారు. ‘భారత్ ఏక్ ఖోజ్’, ‘సుబహ్’, ‘ఇన్కార్’ తో పాటు పలు టీవీ సీరియల్స్ లో సలీమ్ గౌస్ కీలకపాత్రలు పోషించారు. అలానే ‘సారాంశ్, […]
పాత్ర నచ్చితే చాలు “ఊ…” అనడమే తెలుసు, “ఊహూ…” అని మాత్రం అనరు. అదీ సమంత బాణీ! అందం, చందం, అభినయం అన్నీ కుదిరిన సమంత తనదైన పంథాలో పయనిస్తున్నారు. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరిగా సాగుతున్న సమంత ప్రస్తుతం పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’లో శకుంతల పాత్ర పోషిస్తున్నారు. ప్రేక్షకులకు వైవిధ్యమైన పాత్రలతో వినోదం పంచడానికి సమంత సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే ‘మహానటి’లో సహాయ పాత్రలోనూ మెప్పించారు. ఇప్పుడు శకుంతలగా అలరించే ప్రయత్నమూ చేస్తున్నారు. […]
తెలుగు చలన చిత్రసీమలో పలు అరుదైన రికార్డులు నమోదు చేసిన ఘనత నటరత్న యన్.టి.రామారావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్ కే దక్కుతుంది. యన్టీఆర్ తో రాఘవేంద్రరావు తొలిసారి తెరకెక్కించిన చిత్రం ‘అడవిరాముడు’. ఈ చిత్రంలో అనుసరించిన ఫార్ములాను ఇప్పటికీ తెలుగు సినిమా అనుసరిస్తూనే ఉండడం విశేషం! దర్శకత్వంలో రాణించాలనుకొనేవారికి పూర్తిగా అడవిలో రూపొందిన ‘అడవిరాముడు’ చిత్రం ఓ అధ్యయన అంశమనే చెప్పవచ్చు. ఈ చిత్రం విడుదలై నలభై ఐదేళ్ళు అవుతున్నా, ఇంకా ‘అడవిరాముడు’ ఫార్ములానే అనుసరిస్తున్నవారెందరో ఉన్నారు. […]
ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగు సినిమా వెలుగును దశదిశలా ప్రసరింప చేసిన చిత్రంగా ‘బాహుబలి- ద కంక్లూజన్’ నిలచింది. 2015 జూలై 10న విడుదలైన ‘బాహుబలి-ద బిగినింగ్’కు ఈ సినిమా సీక్వెల్. ‘బాహుబలి’ మొదటి భాగం విడుదలైనప్పుడు ఆ చిత్రం సైతం యావద్భారతాన్నీ అలరించింది. అయితే ‘బాహుబలి-1’లో “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?” అన్న ప్రశ్నను వదిలి, సశేషం అన్నారు. అప్పటి నుంచీ సినీఫ్యాన్స్ ‘బాహుబలి-2’ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. వారి ఆసక్తికి […]
తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి అధ్యక్షులు నారాయణదాస్ కిషన్ దాస్ నారంగ్ గత డిసెంబర్ నుండి ఆరోగ్యపరమైన సమస్యలతో బాధపడుతున్నారు. సుదీర్ఘ అనారోగ్యంతో ఏప్రిల్ 19న ఆయన కన్నుమూశారు. దాంతో ఏప్రిల్ 27న ఫిలిమ్ ఛాంబర్ కార్యవర్గం సమావేశమైంది. ఛాంబర్ నియమ నిబంధనలను అనుసరించి, ఉపాధ్యక్షుడైన కొల్లి రామకృష్ణ (రిథమ డిజిటల్ థియేటర్స్ అధినేత)ను తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి అధ్యక్షుడుగా ఎన్నుకొన్నారు. కొల్లి రామకృష్ణ పదవి కాలం ఈ యేడాది జూలై 31 వరకూ […]
‘ఆహా’లో స్టార్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు నిర్వహించిన ‘Sarkar ‘gameషోకు అప్పట్లో చక్కని స్పందన లభించింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని అగస్త్య ఆర్ట్స్ సంస్థ ఇప్పుడు సీజన్ 2కు రంగం సిద్ధం చేసింది. ఏప్రిల్ 29 నుండి ప్రతి శుక్రవారం సాయంత్రం 6.00 గం.లకు ఈ గేమ్ షో ప్రసారం కానుంది. రెట్టించిన థ్రిల్, రెట్టించిన ఎగ్జయిట్ మెంట్, రెట్టించిన ఎంటర్ టైన్ మెంట్ తో ఈ రియాలిటీ షో ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ప్రతి ఎపిసోడ్ […]
మన తమిళ స్టార్ హీరో తనదైన అభినయంతో ఎల్లలు చెరిపేసుకుంటూ దూసుకుపోతున్నారు. తొలుత మాతృభాష తమిళంలోనూ, తరువాత అనువాద చిత్రాల ద్వారా తెలుగు, కన్నడ సీమల్లోనూ, ఆ పై మళయాళంలోనూ నటించి అలరించారు. తరువాత హిందీ చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు ధనుష్. ఇప్పుడు హాలీవుడ్ మూవీ ‘ద గ్రే మేన్’ అనే సినిమాతో జూలై 15న జనం ముందుకు రానున్నారు ధనుష్. ఈ మూవీ విడుదలైన వారానికే అంటే జూలై 22నే నెట్ ఫ్లిక్స్ లో […]
బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్, మొన్నటి అందాలభామ కాజోల్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. నిజానికి వారిద్దరూ కలసి నటించడం లేదు, పైగా కాజోల్ కు మునుపటిలా సినిమాలూ లేవు. మరెందుకలాగా… అంటారా? వారి ముద్దుల కూతురు నైసా ఎక్కడ కనిపించినా, పేపరాజ్జీ వెంటాడుతోంది. నైసా ఎక్కడైనా కనిపిస్తే చాలు ఫోటోగ్రాఫర్స్ తమ షెట్టర్స్ కు పనిచెబుతున్నారు. క్లిక్… క్లిక్… క్లిక్… అంటూ మోత మోగిస్తున్నారు. దీంతో నైసా తన ప్రైవసీ కోసం పరుగులు తీయాల్సి వస్తోంది. […]
బాలీవుడ్ లో విలక్షణ పాత్రలకు పెట్టింది పేరుగా సాగుతున్నారు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా’ నుండి వెలుగు చూసిన సిద్ధిఖీ ఇప్పటి వరకూ వైవిధ్యం ప్రదర్శిస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ నేడు తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. మొదటి నుంచీ థియేటర్ ఆర్టిస్ట్స్ కు సినిమా తారలంటే అంతగా గౌరవం ఉండదు. ఎందుకంటే, నాటకరంగంలో ఎదురుగా ఎంతోమంది ప్రేక్షకుల ముందు ప్రత్యక్షంగా అభినయించే వీలు ఉంటుంది. అదే సినిమాల్లో అయితే కెమెరా ముందు ఎన్ని […]