బాలీవుడ్ లో యంగ్ యాక్షన్ స్టార్ గా సాగుతున్న టైగర్ ష్రాఫ్ త్వరలోనే ‘హీరోపంతి-2’తో జనాన్ని అలరించనున్నాడు. ఈ సినిమా ట్రైలర్స్ చూసిన తరువాత టైగర్ సోదరి కృష్ణ ష్రాఫ్ తన అన్న హాలీవుడ్ స్టార్ లా కనిపిస్తున్నాడని కామెంట్ చేసింది. ఇదే విషయాన్ని టైగర్ ను కొందరు ప్రశ్నించగా, తన జీవితధ్యేయం హాలీవుడ్ మూవీలో నటించడమేనని సమాధానమిచ్చాడు. ఇప్పటికే హాలీవుడ్ కొన్ని సినిమాల కోసం తాను వెళ్ళి ఆడిషన్స్ లో పాల్గొన్నానని, అయితే అవి వర్కవుట్ […]
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరాన్ పేరు తెలియని సినీఫ్యాన్స్ ఉండరంటే అతిశయోక్తి కాదు. జేమ్స్ తెరకెక్కించిన ‘అవతార్’ మొదటి భాగం విడుదలై ఈ యేడాదికి 13 ఏళ్ళయింది. ఆ సినిమాకు సీక్వెల్ గా ‘అవతార్ -2’ ఈ యేడాది డిసెంబర్ 16న జనం ముందుకు రానుంది. ‘అవతార్-1’ విడుదలై పుష్కరకాలం దాటినా ఇంకా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా టాప్ గ్రాసర్స్ లో నంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం! ‘అవతార్’ మొదటి భాగం పదమూడేళ్ళ క్రితమే 2,847,246,203 అమెరికన్ […]
‘కె.జి.ఎప్ 2’ రిలీజ్ కి ముందు సినిమా తరువాత భాగంపై ఎలాంటి కామెంట్ చేయనప్పటికీ సినిమా ముగింపులో ‘కెజిఎఫ్3’ ఉంటుందనే సూచన ఇచ్చారు మేకర్స్. అయితే దీని గురించి ఏ ఇంటర్వ్యూలోనూ ప్రశాంత్ నీల్ కానీ, యశ్ కానీ ఎక్కడా మూడవ భాగం గురించి మాట్లాడలేదు. తాజాగా ఓ హాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో యష్ ఆడియన్స్ కి చెప్పడానికి చాలా కథలు మిగిలి ఉన్నాయని అంటూ మూడో భాగం తప్పక ఉంటుందని తెలియచేశాడు. […]
ముంబై అటాక్ లో వీరమరణం పొందిన సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాను శశికిరణ్ తిక్క దర్శకత్వంలో మహేష్ బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీని మే 27న విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. తెలుగుతో పాటు హిందీ, మలయాళ భాషల్లోనే అదే రోజున జనం ముందుకు తమ […]
ఓ నాటి అందాలతార, హిందీ సినిమా ఫస్ట్ సూపర్ స్టార్ ముద్దుల కూతురు, ఈ నాటి సూపర్ స్టార్ ప్రియమైన భార్య- ఇన్ని ఉపమానాలు విన్న తరువాత ఆమె ట్వింకిల్ ఖన్నా అని సినీఫ్యాన్స్ ఇట్టే పసికట్టేస్తారు. బాలీవుడ్ ఫస్ట్ సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా, అప్పటి అందాలభామ డింపుల్ కపాడియా దంపతుల పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా. తల్లిదండ్రుల బాటలోనే పయనిస్తూ ట్వింకిల్ ఖన్నా సైతం కొన్ని చిత్రాలలో నాయికగా నటించారు. తెలుగు సినిమా ‘శీను’లో […]
ఇటీవల మలయాళ రీమేక్ ‘భీమ్లా నాయక్’తో ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా మరో రీమేక్ లో నటించటానికి ఓకె చెప్పినట్లు వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో ‘హరిహరవీరమల్లు’ సినిమాలో నటిస్తున్న పవన్ హరీశ్ శంకర్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమాతో పాటు తమిళ రీమేక్ ‘వినోదాయ సీతమ్’ రీమేక్ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. దీనికి త్రివిక్రమ్ రచన చేస్తున్నట్లు వినిపిస్తోంది. ఇక ఇదిలా ఉంటే తమిళంలో అట్లీ దర్శకత్వంలో వచ్చిన సూపర్ […]
ప్రముఖ దర్శకుడు స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ పెద్ద కొడుకు ఆర్యన్ రాజేశ్ నటించిన సినిమాల్లో చక్కని విజయం సాధించిన చిత్రం ‘లీలామహల్ సెంటర్’. దేవీప్రసాద్ దర్శకత్వం వహించిన ఆ మూవీలో ఆర్యన్ రాజేశ్, సదా జంటగా నటించారు. ఇప్పుడీ ఇద్దరూ జీ 5 కోసం ఓ వెబ్ ప్రొడక్షన్ లో మరోసారి కలిసి నటించబోతున్నారు. నాగబాబు కుమార్తె, నటి, నిర్మాత నిహారిక దీన్ని నిర్మిస్తోంది. ‘హలో వరల్డ్ ‘పేరుతో శివ సాయి వర్థన్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. […]
ప్రియదర్శన్ రూపొందించిన ‘భూల్ భులయ్యా’ చిత్రం 2007లో విడుదలై చక్కని విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి హారర్ కామెడీ చిత్రంలో అక్షయ్ కుమార్, విద్యాబాలన్, షైనీ అహూజా కీలక పాత్రలు పోషించారు. మళ్లీ ఇంతకాలానికి అదే పేరుతో ‘భూల్ భులయ్యా -2’ మూవీ వస్తోంది. తొలి చిత్రంలో కీలక పాత్ర పోషించిన రాజ్ పాల్ యాదవ్ ఈ సినిమాలోనూ నటించాడు. అతనితో పాటు ఇప్పుడీ సినిమాలో కార్తిక్ ఆర్యన్, కియారా అద్వానీ, టబు కీ-రోల్స్ చేశారు. ‘నో […]
ఆహా సంస్థ నిర్వహిస్తున్న ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ కార్యక్రమం సమ్ థింగ్ స్పెషల్ గా సాగుతోంది. ఈ కార్యక్రమానికి అతిథులను తీసుకొచ్చే విషయంలోనూ వైవిధ్యతను నిర్వాహకులు ప్రదర్శిస్తున్నారు. ఈ వీకెండ్ లో స్ట్రీమింగ్ అయ్యే 19, 20 ఎపిసోడ్స్ లో అలాంటి ఓ ప్రత్యేకత చోటు చేసుకోబోతోంది. శుక్ర, శనివారాల్లో రాత్రి 9 గంటలకు ‘తెలుగు ఇండియన్ ఐడిల్’ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇందులో పది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరంతా ఒక్కో వారం ఒక్కో అంశం […]
శ్రీవిష్ణు, కేథరిన్ జంటగా నటించిన ‘భళా తందనాన’లోనిది ఈ స్టిల్. వీరిద్దరి మధ్య సాగే సంభాషణను తాజా పరిణామాలకు అన్వయిస్తే… బహుశా కేథరిన్ ”ఈ వీకెండ్ లో చిరంజీవి, రామ్ చరణ్ ‘ఆచార్య’ మూవీ వస్తోంది కదా! మన సినిమానూ ఇప్పుడే ఎందుకు రిలీజ్ చేయడం!?.. వాయిదా వేస్తే బెటరేమో” అంటుండవచ్చు. ఒకరకంగా అది నిజం కూడా. ‘భళా తందనాన’ చిత్ర నిర్మాతలు ఇటీవల ఏప్రిల్ 30న తమ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. దాంతో చాలామంది […]